డాటర్స్ ఆఫ్ మహారాష్ట్ర-5

(మిగితా భాగాలు ఇక్కడ చూడవచ్చు)
******

41) Anuradha Athavale (1936): నర్సుగా పని చేస్తూ, ఆ వృత్తిలో ఉన్న మహిళల పరిస్థితులు బాగుపడ్డం కోసం కృషి చేశారు. తన పదవీ విరమణ తరువాత Institute of Nursing Research and Development స్థాపించి, ఈ దిశలో కృషి కొనసాగించారు.

42) Pushpa Bhave (1939): ప్రముఖ మరాఠీ మేధావి. రచయిత్రిగా, సామాజిక కార్యకర్తగా, నాటక రంగంలో చురుగ్గా ఉన్న వ్యక్తిగా, రాజకీయంగా – ఇలా వివిధ రంగాల్లో కృషి చేశారు. కాలేజీ ప్రొఫెసర్ గా పని చేస్తూనే అనేక సాంఘిక ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్నారు, విరివిగా పరిశొధనాత్మక వ్యాసాలు రాసారు. “I work in a lot of movements, yet belong to myself” అన్న ఆవిడ మాటలు చాలేమో ఆవిడ గురించి చెప్పడానికి.

43) Ahilya Rangnekar (1922): కమ్యూనిస్టు నాయకురాలు. క్విట్ ఇండియా ఉద్యమ కాలం నుండి రాజకీయ, సామాజిక జీవితంలో చురుగ్గా ఉన్నారు.

44) Vijaya Mehta (1934): మరాఠీ నాటకరంగంలో ప్రముఖ దర్శకురాలు, నటి. రంగయాన్ అన్న గ్రూపు స్థాపించారు. ఎంతో పేరు ప్రఖ్యాతి గడించారు. తరువాత టీవీ రంగంలోకి కూడా అడుగుపెట్టారు.

45) Taraben Mashruwala (1909) : గాంధీ శిష్యురాలు. స్వతంత్ర సంగ్రామం రోజుల నుండీ తన జీవితంలో అధిక భాగం సంఘ సేవలోనే చురుగ్గా ఉన్నారు. ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. కస్తూర్బా సర్వోదయ మండల్ స్థాపించి అది స్కూలుగా, ఆశ్రమంగా, మెటర్నిటీ హోం, డిస్పెన్సరీ, హాస్టల్ – ఇలా శాఖోపశాఖలుగా ఎదిగేందుకు కృషి చేశారు.

46) Rohini Khadilkar (1963): అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న చెస్ క్రీడాకారిణి. స్పాన్సర్లు లేక, ప్రభుత్వ సహకారం లేకా తరువాత ప్రొఫెషనల్ చెస్ వదిలేసి, కొన్నాళ్ళు చెస్ నేర్పే కోచ్ గా, చెస్ కాలమిస్టుగా ఉన్నారు. తరువాత, ఒక పత్రికలో జర్నలిస్టుగా పని చేస్తూ, animal husbandry లో తన ఆసక్తిని కొనసాగిస్తున్నారు.

47) Gail Omvedt (1941): స్వీడిష్ అమెరికన్ అయిన ఈవిడ అరవైల నాటి పరిస్థితుల్లో మొదట అమెరికా గురించి కలిగిన అసంతృప్తుల మధ్య మార్క్సిస్టుగా మారారు. తరువాత ఇండియాలో స్థిరపడి అనేక సాంఘిక ఉద్యమాల్లో పాలుపంచుకున్నారు. తరువాత క్రమంగా మార్క్సిజం అన్ని సమస్యలనూ పరిష్కరించదు అని తెలుసుకున్నానంటారు. బర్కిలీ విశ్వవిద్యాలయం నుండి పీ.హెచ్.డీ అందుకున్న గెయిల్ అనేక పుస్తకాలు కూడా రాసారు.

48) Aban Mistry (1940): తబలా వాద్యకారిణిగా ఒక ఆల్బం రికార్డు చేసిన తొలి మహిళ. చిన్నప్పటినుండి సంగీత-నాట్యాల్లో శిక్షణ పొందారు. తబలా గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేసి పీ.హెచ్.డీ కూడా పొందారు. ఒక పక్క సంగీతం గురించిన పరిశోధనలూ, ఒక పక్క తబలా ప్రదర్శనలూ, ఒక పక్క విద్యార్థులకి తబలా శిక్షణా – ఈ ప్రయాణంలో ఆవిడ అనుభవాలు చాలా స్పూర్తివంతంగా ఉన్నాయి.

49) Pramila Dandavate (1928): అనేక సాంఘిక-రాజకీయ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న కార్యకర్త. మహిళా సమస్యల గురించి కృషి చేసారు – మహిళా సంస్థల స్థాపన లో పాలుపంచుకున్నారు. పుస్తకాలు కూడా రాసారు. మధు దండావతే భార్య అయిన ఈవిడ “I’ve managed a dedicated worker’s household and yet had a political life of my own. Still, I’m merely Dandavate’s wife. Two overactive Dandavates are hard to deal with for the party and hence the man from the family gets all the opportunities where as the woman is often ignored. But when it comes to going to prison, it is alright to be gaoled at the same time. I wonder why that is” అన్న మాటలు ఆలోచనలో పడేశాయి.

50) Kamla Ogale (1913): లక్ష కాపీలకు పైగా అమ్ముడుపోయిన “రుచిర” వంటల పుస్తకం రాసారు. వంటల గురించి ఎన్నో వర్క్షాపులు వగైరాలు నిర్వహించారు. ఈ రంగంలో ఎంతో పేరు-ప్రఖ్యాతులు అర్జించి ఎన్నో అవార్డులు కూడా పొందారు.

… మిగితా వారి గురించి వచ్చే టపాలలో!

Published in: on August 21, 2012 at 8:33 am  Leave a Comment  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/08/21/daughtersofmaharashtra-5/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: