డాటర్స్ ఆఫ్ మహారాష్ట్ర-4

(మిగితా భాగాలు ఇక్కడ చూడవచ్చు)
******
31) Prema Purav (1935) : మిల్లు కార్మికుల భార్యలను సంఘటిత పరచి, వారికి స్వయం ఉపాధి కోసం చేయూతనిచ్చారు. “అన్నపూర్న మహిళా మండలి” పేరిట సంస్థను స్థాపించారు. ఈ పుస్తక రచనాకాలం నాటికి ఆ సంస్థ రోజుకి 20000 చపాతీలు అమ్ముతోందట. లాభసాటి వ్యాపారంగా దాన్ని తీర్చిదిద్ది, అలాగే, దానికి అనుసంధానంగా ఒక త్రెయినింగ్ సెంటర్, నిరాశ్రయ మహిళలకి ఒక హోం, పిల్లలకి స్కూలు – ఇవన్నీ కూడా నిర్మించారు. ఇంతకీ, ఈవిడ ఒక గోవాలోని అతి మామూలు పల్లెటూరు నుండి వచ్చారు. తన కుటుంబం ఎంతో సహకరించింది అంటారు.

32) Meherunnisa Dalwai (1930): తన భర్త హమీద్ దల్వాయ్ ముస్లిం ప్రజల అభివృద్ధి కోసం ముస్లిం సత్యశోధక సమాజ్ నిర్వహణ బాధ్యతలను ఆయన మరణం తరువాత మెహెరున్నీసా స్వీకరించారు. ఈ సంస్థ సంస్క్రణా దృక్పథం వల్ల చాలా ముస్లిం సంఘాల నుండి గట్టి ప్రతిఘటన ఎదుర్కున్నారు. హమీద్ మరణం వరకు తన ఉద్యోగం తాను చేసుకుంటూ, అతను పూర్తి స్థాయి సామాజిక కార్యకర్త కనుక మొత్తం కుటుంబ బాధ్యతలు తానే స్వీకరించారు. అతని మరణానంతరం అతని పనిని కొనసాగించారు.

33) Flavia Agnes (1947): ఏళ్ళ తరబడి వైవాహిక జీవితంలో రకరకాల కష్టాలు అనుభవించాక, అందులోంచి బయటపడి జీవితాన్ని పునర్నిర్మించుకున్నారు. మహిళా హక్కుల కోసం, వారికి న్యాయ రకషణ కోసం “మజ్లిస్” అన్న సంస్థను స్థాపించారు. స్కూలు మధ్యలో చదువు మానేసిన అమ్మాయిల కోసం వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణా కేంద్రం నడిపారు.

34) Nanda Jadhav (1969): అనుకోకుండా స్కూలులో జరిగిన ఒక cross country race నందా జాదవ్ జీవితాన్ని మార్చివేసింది. ఒక రన్నర్ గా ఎన్నో జాతీయ అంతర్జాతీయ పోటీలలో పాల్గొన్నారు. ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఈ పుస్తకం విడుదలయ్యేనాటికి తనలాగే మారు మూల ప్రాంతాల నుండి వచ్చిన పిల్లలకు అథ్లెటిక్స్ శిక్షణ ఇవ్వడం కోసం కార్యక్రమాన్ని రూపొందించే ప్రయత్నంలో ఉన్నారు.

35) Mable Arole (1935): దేశం లోనూ, విదేశాల్లోనూ వైద్య విద్య అభ్యసించాక, గ్రామీణ ఆరోగ్య అభివృద్ధి కోసం కృషి చేస్తూ, వారిలో ఆరోగ్య సమస్యలపై, వాటి పరిష్కారాలపై అవగాహన కలిగించడం లో విశేష కృషి చేసారు. తన భర్త, వైద్య సహచరుడూ అయిన డాక్టర్ అరోలే తో కలిసి మెగసేసే అవార్డు కూడా అందుకున్నారు. ఆవిడ మాటల్లోనే వాళ్ళ వ్యక్తిగత అనుభవాలతో కూడిన కథ వినడం చాలా స్పూర్తి వంతంగా ఉండింది.

36) Anutai Limaye (1916): స్వతంత్ర సమరంలో చురుగ్గా పాల్గొని, క్రమంగా రాజకీయాల వైపు నుండి సమాజ సేవ వైపు మ్రొగ్గారు. సామాజిక మార్పు కోసం చాలా కృషి చేశారు. సామాజిక సమస్యలను గురించి పని చేసే సమాజవాది మహిళా సభ వంటి అనేక సంస్థల స్థాపన-నిర్వహణల్లో పాలు పంచుకున్నారు.

37) Rani Bang (1951): తెలుగు కుటుంబంలో పుట్టిన రాణి వృత్తిరిత్యా డాక్టరు. తన భర్త అభయ్ తో కలిసి గ్రామీణ ఆరోగ్య సమస్యల పై పరిశోధనలూ, పరిష్కారాలూ, ప్రజల్లో అవగాహనా కార్యక్రమాలూ ఇలాగ ఎన్నో చేశారు. పబ్లిక్ హెల్త్ గురించి కొన్నాళ్ళు అమెరికాలో పరిశోధనలు కూడా చేశారు. అటవీ ప్రాంతాల్లో, ఆదివాసీ లలో ఆరోగ్య సమస్యల గురించి అవగాహన కల్పించడానికి కృషి చేశారు. అంతర్జాతీయంగా తన పరిశోధనలకు గుర్తింపు పొందారు. ఎన్నో అవార్డులు అందుకున్నారు.

38) Vidya Bal (1937): ప్రముఖ జర్నలిస్టు, ఆక్టివిస్టు. ఈ పుస్తకం సంపాదకులు కూడానూ.

39) Nalini Malani (1946): ప్రముఖ చిత్రకారిణి. దేశవిదేశాల్లో కళ గురించి చదువుకున్నారు. సామాజిక సమస్యలను స్పృషిస్తూ విరివిగా బొమ్మలు గీస్తారు. కొన్నాళ్ళు కమర్షియల్ ఇలస్ట్రేటర్ గా కూడా పని చేసి ఎందరో ప్రముఖుల పుస్తకాలకి బొమ్మలు గీశారు. ఒక్కొక్కసారి కాన్వాసుపై కాక గోడల మీద కూడా శక్తివంతమైన చిత్రాలు వేశారు. “This wall will soon be over-painted. Why do you bother to paint here?” అని అడిగినప్పుడు ఆవిడ జవాబు: “Many things are coming to an end like this. We must try to not let this happen and preserve our heritage”.

40) Meeran Chadha-Borvankar (1957): ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అందుకున్న ఐ.పీ.ఎస్. అధికారిణి. ఎన్నో ప్రముఖ కేసుల్ని పరిష్కరించారు. మహిళా సమస్యల సంబంధిత కేసుల నిర్వహణలో పేరు పొందారు.

…. తక్కిన వారి గురించి వచ్చే టపాలలో.

Advertisements
Published in: on August 20, 2012 at 8:46 am  Comments (1)  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/08/20/daughtersofmaharashtra-4/trackback/

RSS feed for comments on this post.

One CommentLeave a comment

  1. Sowmya Garu! Put these posts in ‘Mahila’ patrikalu. Very inspiring stories of great ladies. Keep the spirit.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: