డాటర్స్ ఆఫ్ మహారాష్ట్ర-3

(మిగితా భాగాలు ఇక్కడ చూడవచ్చు)
******

21) Leela Patil (1927) : విద్యారంగంలో చాలాకాలం ప్రభుత్వోద్యోగిగా పని చేశాక, పదవీ విరమణానంతరం “స్రుజన్ ఆనంద్ విద్యాలయ్” స్థాపించారు. నూతన పద్ధతుల్లో విద్యాబోధన గురించి పరిశోధనలు చేసారు..పుస్తకాలు వ్రాసారు. ఆవిడ తన మాటల్లో తన జీవితం గురించి చెప్పుకూంటూ ఉంటే చదవడానికి చాలా బాగుంది. ముఖ్యంగా – కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే కెరీర్ లో ముందుకు వెళ్ళడం గురించి ఆవిడ అనుభవాలు ఆలోచింపజేస్తాయి.

22) Aditi Pant (1943): పరిశోధనా విషయమై అంటార్క్టికా వెళ్ళిన తొలి భారతీయ మహిళ. మెరైన్ బయాలజీ లో పీ.హెచ్.డీ పొందిన ఈవిడ ప్రముఖ Oceanographer.

23) Medha Patkar (1954): ప్రముఖ పర్యావరణ కార్యకర్త.

24) Neelam Gorhe (1954): మహిళా హక్కుల కార్యకర్త. సమాజంలో మహిళల సమస్యల గురించి, పరిస్థితుల గురించి విస్తృత అధ్యయనం చేశారు. మహిళా ఉద్యమాలను గురించి రచనలు కూడా చేశారు. ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు.

25) Saryu Doshi : ప్రముఖ Art historian. Jain Temple Art గురించి చాలా పరిశోధన చేశారు. వ్యక్తిగత కథనంలో భాగంగా తాను ఈ రంగం వైపు ఎలా ఆకర్షితులయ్యారు? పరిశోధన మొదలుపెట్టిన తొలినాళ్ళలో ఎలా ఉండేది – ఇవన్నీ చెప్తూ ఉంటే నా మట్టుకు నాకు స్పూర్తి వంతంగా అనిపించింది.

26) Sudha Karmakar (1934): మరాఠీ నాటక రంగంలో పిల్లల కోసం నాటకాలు రూపొందించడం మొదలుపెట్టిన మొదటి వ్యక్తి. Little Theatre మొదలుపెట్టి వేలకొద్దీ ప్రదర్శనలు ఇచ్చారు. పిల్లలకోసం రూపొందించే నాటకాలకి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకుని వచ్చారు.

27) Najubai Gavit (1950): బహుశా ఈవిడ ప్రపంచంలో మొదటి ఆదివాసీ రచయిత్రి ఏమో – అన్నారు ఈ పుస్తక సంపాదకులు ఈవిడ గురించి రాస్తూ. ఆదివాసీ, దళిత హక్కుల కోసం పోరాటం చేశారు. ‘సత్యశోధక్ మహిళా సభా స్థాపించారు. తన జీవిత కథను వ్రాస్తున్నారు (ఈ పుస్తకం విడుదలయ్యే నాటికి).

28) Chhaya Datar (1944): మహిళా హక్కుల కార్యకర్తగా చాలా కాలం పని చేశాక, Women and Development అన్న అంశంపై పరిశోధన చేసి, Womens Studies రంగంలో విస్తృత కృషి చేశారు.

29) Madhuri Datar (1947): 27 భాషలు తెలిసిన మాధురి Language Services Bureau స్థాపించి వివిధ కంపెనీలకు సాంకెతికాంశాల అనువాదం గురించిన విషయాల్లో తోడ్పాటు అందిస్తున్నారు.

30) Bebi Kamble (1929): దలిట రచయిత్రి. అంబేద్కర్ స్పూర్తితో జీవితాన్ని మలుచుకున్నారు. ప్రభుత్వ అవార్డులు ఎన్నో అందుకున్నారు. అలాగే, సంచార జాతుల వారికోసం ఒక ఆశ్రమంకూడా నడుపుతున్నారు. వీరి జీవితంలో ఒక్క ఆసక్తి కరమైన కథ మాత్రం వివరంగా చెప్పాలనిపిస్తోంది. తల్లిదండ్రులు పెళ్ళి సంబంధాలు చూస్తున్నప్పుడు – “నాకు పల్లెల్లో ఉండాలని లేదు, పట్నంలో ఉన్న పెళ్ళి కొడుకును చూడండీ” అని చెప్పిందట ఈవిడ. సరే, వాళ్ళూ ఎలాగో వెదికి ఒకర్ని చూశారట. కానీ, వాళ్ళ కుల పెద్దలు – తన భర్తని తానే వెదుక్కుందని విమర్శించారట!

*****
…తక్కిన వారి గురించి రాబోయే టపాలలో. ఏమైనా, ఈ పద్ధతి నాకు నచ్చింది. వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకునేటప్పుడు వ్యక్తిగత పరిస్థితులూ గట్రా ఎక్కువ చెబుతారు. దాని వల్ల, వాళ్ళు చేసిన పని ని కొంచెం contextలో చూడగలుగుతాము … కొందరి నేపథ్యం చదువుతూ ఉంటే, ఈ నేపథ్యం నుంచి వచ్చి ఇన్ని చేయగలిగారా – అని మరింత స్పూర్తివంతంగా అనిపిస్తోంది. అయితే, ఇక్కడో చిక్కు ఉంది. వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకున్నప్పుడు వాళ్ళ గొప్ప పనుల గురించి ఎక్కువ చెప్పరు… నేపథ్యం గురించి ఎక్కువ ఉంటుంది. అందుకే, ప్రతి వ్యాసానికీ చివర్లో సంపాదకులు వీళ్ళ గురించి ఒక నాలుగు ముక్కలు రాసి మంచి పని చేశారు. రెండు పద్ధతుల లాభాలూ మనం అనుభవించవచ్చు! 🙂

Advertisements
Published in: on August 17, 2012 at 7:00 am  Leave a Comment  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/08/17/daughtersofmaharashtra-3/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: