డాటర్స్ ఆఫ్ మహారాష్ట్ర-2

11) Vijaya Lavate (1930): మామూలు మధ్య తరగతి ప్రభుత్వోద్యోగిగా పని చేస్తున్న కాలంలో పూనా మునిసిపల్ కార్పోరేషన్ చేపట్టిన వ్యభిచారుల పునరావాస కార్యక్రమంలో పని చేస్తూ తరుచుగా వారి జీవన విధానాన్ని పరిశీలించేవారు విజయ. తరువాత వీళ్ళకి పుట్టిన పిల్లలకోసం “Sarveshan Seva Sanstha” పేరిట ఒక హాస్టల్ ప్రారంభించారు. ఎన్నో అవాంతరాలు ఎదుర్కుంటూ ఈ దిశలోనే కృషి కొనసాగించారు. ఆ పిల్లల బాగోగులు చూస్తూనే వారికి వృత్తివిద్యల్లో శిక్షణ ఇస్తూంటారు. (నిజానికి ఇప్పటికీ ఈ సంస్థలు ఉన్నాయో లేదో నాకు తెలియలేదు కానీ, ఈవిడ చిక్కుకున్న సమస్యల మధ్య రెండు గుండె పోట్లు, మానసిక ఆందోళనలు అధిగమించి కూడా మళ్ళీ తన పనులు కొనసాగించారని చదివాక స్ఫూర్తివంతంగా అనిపించింది).

12) Gauri Deshpande (1942): ప్రముఖ మరాఠీ రచయిత్రి. మరాఠీ, ఆంగ్ల భాషల్లో వివిధ కాల్పనిక రచనలూ, వ్యాసాలూ రాశారు, అనువాదాలు చేశారు.

13) Mangal Khinwasara (1957): గొప్పింటి బిడ్డగా పెరిగినా కొన్నాళ్ళ తరువాత “యువక్ క్రాంతి దళ్” వారిపట్ల ఆకర్షితులై సామాజిక సమస్యల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. ఆ సమయంలోనే ఒక కార్యకర్తను వివాహమాడడం వల్ల కుటుంబం వాళ్ళు వెలి వేశారు. తరువాత పూర్తి స్థాయి కార్యకర్తగా దళిత వర్గాల అభ్యున్నతి కోసం “సర్వహర”, “మైత్రి” సంస్థల ద్వారా కృషి చేశారు.

14) Naseema Hurzuk (1950): పదహారేళ్ళ వయసు నుంచి శారీరిక వైకల్యం వల్ల కుర్చీకి అంకితం కావాల్సి వచ్చినా నిరాశ చెందక వికలాంగుల కోసం ఒక పునరావాస కేంద్రాన్ని స్థాపించారు. వారి కోసం క్రీడలు నిర్వహించడం, వారికి అవసరమైన వాటిలో శిక్షణ ఇవ్వడం వంటివెన్నో చేశారు. వికలాంగ విద్యార్థులకి హాస్టల్, తన తోటి వారి కోసం మ్యారేజి బ్యూరో – ఇలా ఎన్నో పనులు చేపట్టారు. ఒక Para-Olympics లో కూడా పాల్గొన్నారట.

15) Sumitra Bhave (1943): సాంఘిక స్పృహతో సినిమాలు తీసే దర్శకురాలు, డాక్యుమెంటరీలు కూడా తీశారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు.

16) Indira Jaising (1940): ప్రముఖ న్యాయవాది. మహిళలకు సంబంధించిన కేసులు వాదించడంలో విశేష ఖ్యాతి అర్జించారు. న్యాయవాద వృత్తి గురించి సామాన్యులకి తెలిసేందుకు లాయర్ అన్న పత్రిక కూడా నడిపారు.

17) Hira Bansode (1939): దలిత సమస్యల గురించి కవితల రూపంలో రాసారు. దళిత పిల్లల మధ్య సృజనాతమక అభివ్యక్తి పెంపొందించడానికి కృషి చేశారు. ఈవిడ చిన్నప్పటి నేపథ్యం గురించి చదివాక క్రమంగా ఆవిడ ఎదిగిన క్రమం స్ఫూర్తిని కలిగిస్తుంది.

18) Prabha Atre (1932): ప్రముఖ గాయని, మ్యూజికాలజిస్ట్. సంగీతం గురించి శాస్త్రీయంగా అభ్యసించారు. ఎన్నో పుస్తకాలు కూడా రాశారు.

19) Lila Poonawala (1944): పూనా ఇంజనీరింగ్ కాలేజీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా పొందిన తొలి మహిళ. కొన్నాళ్ళ ఉద్యోగం తరువాత మరొక సంస్థలోకి మారి – అప్రెంటిస్ ఇంజనీరుగా మొదలుపెట్టి చెయిర్ పర్సన్ స్థాయికి ఎదిగారు. ఒక బహుళ జాతి సంస్థ కి మేనేజింగ్ డైరెక్టర్ అయిన తొలి భారతీయ మహిళ వీరేనట.

20) Kamal Ranadive (1917-2001): కేన్సర్ పరిశోధనలకు పేరు పొందారు. దేశ విదేశాల్లో ఎన్నో పరిశోధనలు చేశారు. ముంబాయిలో కేన్సర్ పరిశోధన సంస్థ స్థాపనలో ముఖ్య భూమిక పోషించారు. పదవీ విరమణ తరువాత ఆదివాసీలతో కలిసి పనిచేస్తూ వారి ఆరోగ్య సమస్యల గురించి అవగాహనకు కృషి చేశారు. వీరు పద్మభూషణ్ అవార్డు గ్రహీత.

….మిగితా వారి గురించి రాబోయే టపాలలో.

Advertisements
Published in: on August 14, 2012 at 7:00 am  Leave a Comment  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/08/14/daughtersofmaharashtra-2/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: