డాటర్స్ ఆఫ్ మహారాష్ట్ర – 1

మొన్న మొన్నటి దాకా మహిళావరణం పుస్తకం గురించి రోజూవారీ అప్డేట్స్ రాసుకుంటున్నానా? ఆ పుస్తకం ముందుమాటలో ప్రస్తావించిన “Daughters of Maharastra” పుస్తకం లైబ్రరీలో కనబడ్డది. చదవడం మొదలుపెట్టాను. అయితే, అంత తరుచుగా చదవలేకపోతున్నా – వివిధ డైవర్షన్స్ వల్ల. ఇంతకీ, ఈ ప్రస్తుత సిరీస్ ఈ పుస్తకంలో ప్రస్తావించబడ్డ మహిళల గురించి. ముందుగా పుస్తకం వివరాలు:

Daughters of Maharasthra: Potraits of Women who are building Maharastra
Interviews and Photographs: Abhijit Varde
Editor: Vidya Bal
(పుస్తకం ఎక్కడన్నా దొరుకుతోందో లేదో నాకు తెలియదు. కానీ, నేను చదువుతున్నది మాత్రం 1997 సెప్టెంబర్ నాటి ముద్రణ.)

పుస్తకం విషయానికొస్తే, నేను ఊరికే మధ్య మధ్యలో ఒకరి గురించి చదువుతూ కాసేపు తిరగేసినప్పుడు – మహిళావరణం తో పోలిస్తే ఇందులో చాలా వైవిధ్యంతో కూడా ప్రొఫైల్స్ ఉన్నట్లు తోచింది. మహిళావరణంలో కొంతసేపు పోయాక వ్యక్తుల ఎంపికలో సంపాదకుల పక్షపాతం ఉన్నట్లు తోచింది. ఈ పుస్తకంలో ఇంకా అలా అనిపించలేదు. చూడాలి. పైగా ఈ పుస్తకం ఇరవయ్యవ శతాబ్దపు మహిళల గురించి. అంతకు ముందు వారిని కలపలేదు. ఇంకో విశేషం – పుస్తకం స్వగతంలా ఉంటుంది. వాళ్ళ గురించి వాళ్ళే చెప్పుకుంటారు. ఇక వివరాల్లోకి వెళ్తే:

1) మాలతి బెడేకర్ (1905-2001): ప్రముఖ అభ్యుదయ రచయిత్రి. ఐదేళ్ళ వయసులోనే అమ్మాయిలకి పెళ్ళిల్లు చేసేసే రోజుల్లో పదేళ్ళ మాలతిని హాస్తళ్ళో ఉండేందుకు పంపారట ఆవిడ తల్లిదండ్రులు! హాస్టల్ రోజుల్లో తోటి ఆడపిల్లలతో మాటల్లో స్త్రీ సమస్యల గురించి అవగాహన పెరిగి, పెద్దయ్యాక వాటి గురించి కథలు రాయడం మొదలుపెట్టారు. మొదట్లో వాటిలోని విప్లవ భావాలు జనం తిరస్కారానికి గురయ్యావి. మాలతి కూడా మారుపేరుతో రాసారు. క్రమంగా ఆవిడ భావాలని జనం అంగీకరించారు. తన పేరుతో కూడా తరువాత కొన్ని పుస్తకాలు రాశారు. (వికీ పేజీ లంకె ఇక్కడ).

2) వేణుభాయ్ మేగ్వాలే (Venubhai Meghwale: around 1952): వెట్టిచాకిరిలో ఉన్న కుటుంబంలో పుట్టిన వేనుభాయ్ అలాంటిదే మరొక కుటుంబంలోకి వెళ్ళారు వివాహానంతరం. ఆ తరువాత “శ్రమజీవి సంఘటన” వారి ప్రభావంలో తన తోటివారి నుండి విమర్శలను ఎదుర్కుంటూనే వెట్టిచాకిరి నిర్మూలన కోసం పోరాడారు. ఆదివాసీ లేబర్ ట్రేడ్ యూనియన్ కు కొన్నాళ్ళు ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు.

3) రజియా పటేల్ (1960): సంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించి, ఆచార వ్యవహారాలకు, అసమానతకు వ్యతిరేకంగా పద్దెనిమిదేళ్ళ వయసులో ఇంటిని విడిచి బయటకు వచ్చారు. ఆ తరువాత ముస్లిం కార్మిక మహిళలతో పనిచేసారు. ముస్లిం మహిళలు సినిమాలు చూడకూడదని జల్గావ్ లో ఒక ఆర్డర్ జారీ చేస్తే, దానికి వ్యతిరేకంగా ఒక మార్చ్ నడిపారు. ముస్లిం మహిళల గురించి విస్తృత అధ్యయనం, పరిశోధన చేసారు.

4) ప్రతిభా పాటిల్ (1934): అవును, గత ఐదేళ్ళు మన రాష్ట్రపతిగా ఉన్న ప్రతిభా పాటిలే.

5) ఉషాప్రభ పగే (UshaPrabha Page: 1943): ఆల్ ఇండియా రేడియో లో స్టేషన్ డైరెక్టర్ గా ఉంటూ, పర్వతారోహణ మీద ఉన్న ప్రేమతో, లెహ్ వంటి ప్రాంతాల్లో కూడా పనిచేశారు. తన భర్తను ఒక పర్వతారోహణ సందర్భంలోనే కోల్పోయినా కూడా భయపడక కొనసాగించారు.ప్రకృతి పై ప్రేమతో పూనా లో “గిరిప్రేమీ” క్లబ్ స్థాపించారు.

6) గౌరభాయ్ సాల్వడే (Gaurabhai Salwade, around 1936) : ప్లేగు మహమ్మారికి కుటుంబాన్ని కోల్పోయాక, బంధువులు ఒకరు గౌరభాయ్ ని ఏడేళ్ళ వయసులో దేవదాసీ గా చేసారు. ఆ తరువాత దేవదాసీ గ్రూపులు ఆమెని కొన్ని కారణాల వల్ల తమలో చేర్చుకోకపోవడంతో రోజు కూలీగా కొనసాగారు. ఈమధ్యలో కొంతమందితో సంబంధాల మధ్య ఇద్దరు పిల్లల తల్లి అయ్యాక ఒంటరిగా మిగిలారు. అయితే, తరువాత దేవదాసి లిబరేషన్ మూవ్మెంట్ లో చురుగ్గా పాల్గొని, తరువాత దేవదాసీ కాంఫరెన్సు అధ్యక్షురాలై… తరువాత దేవదాసి పునరావాస కేంద్రానికి ఈ పుస్తకం రాసేనాటికి వైస్-ప్రెసిడెంటుగా ఉన్నారు.

7) ఇందిరా సంత్ (Indira Sant, 1914-2000) : ప్రముఖ కవయిత్రి. ఎన్నో కథలు, వ్యాసాలు కూడా రాసారు. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.

8) Maxine Berntsen (1935) : జన్మతః అమెరికన్ అయిన మాక్సిన్ భాషశాస్త్రంలో డాక్టరేటు పొందిన వారు. 1960లలో భారత దేశం వచ్చి క్రమంగా స్థిరపడి చివరకి కొన్నేళ్ళ తరువాత పౌరసత్వం తీసుకున్నారు. మరాఠీ, ఇంగ్లీషు భాషలని అవి మాతృ భాషలు కానివారికి బోధించవలసిన పద్ధతుల గురించి విస్తృత కృషి చేశారు. అలాగే, బీద విద్యార్థుల కోసం స్కూలు ను కూడా నడుపుతున్నారు.

9) Anita Awachat (1942-1997): De-Addiction Center ప్రారంభించిన మొదటి మహిళ వీరేనట (నిజానికి ఈ పుస్తకం స్వగతంలా సాగుతుంది కనుక, వాళ్ళ ధోరణిలో వాళ్ళు చెప్పుకుపోతారు. ఈ తరహా – “మొదటి” వ్యక్తి లాంటి వివరాలు ఈవిడ గురించి వ్యాసం మొదట్లో రాసిన ఒక పేరా పరిచయంలో ఉన్నాయి. ఒక పక్క క్యాన్సర్ తో పోరాడుతూనే “ముక్తాంగన్” సంస్థ ద్వారా ఎందరికో మానసిక వైద్యం అందించారు. ఆవిడ మాటల్లో ఆవిడ చెప్పిన వ్యక్తిగత జీవిత కథ మాత్రం నా మట్టుకు నాకు స్పూర్తివంతంగా అనిపించింది.

10) Indira Halbe (1903 – When?) : కొంకణ్ ప్రాంతంలోని చిన్న గ్రామం నుండి వచ్చిన వీరు చిన్న వయసులోనే భరతని, పిల్లల్ని కోల్పోయారు. తరువాత నర్స్ ట్రెయినింగ్ పొంది..తన కూతురి జ్ఞాపకార్థం “మాతృమందిర్” నర్సింగ్ హోం స్థాపించారు. క్రమంగా దానిని ఒక ఆసుపత్రి, స్కూలు, శిశు సంక్షేమ కేంద్రం ఇలా విస్తరింపజేశారు. అనేక అవార్డులు అందుకున్నారు.

(ఇదివరకటి లాగే, వరుసగా వీళ్ళందరి గురించీ రెండు ముక్కలు రాసుకోవాలని ప్రయత్నం. మిగితా వారి గురించి రాబోయే టపాలలో. అయితే, ఈ పుస్తకం గురించి ఇప్పటి దాకా నాకు ఏర్పడ్డ అభిప్రాయాలివీ:

* ఎంచుకున్న మనుషుల ప్రొఫైల్స్ లో చాలా వైవిధ్యం ఉంది.
* కానీ, పుస్తకంలో టైపోలు గట్రా ఇంతలోపే బోలెడు ఉన్నట్లు తోచాయి.
* ఫొటోలు అద్భుతంగా జీవకళ ఉట్టిపడేలా ఉన్నాయి.
* స్వగతంలా చెప్పినందువల్ల – కొన్ని సంగతులు తెలియడం లేదు, సంపాదకులు రాసిన పరిచయాలు చదివే దాకా. కానీ, స్వగతం మామూలు కంటే స్పూర్తివంతంగా అనిపిస్తోంది.

అదీ సంగతి ప్రస్తుతానికి.

Advertisements
Published in: on August 13, 2012 at 7:00 am  Comments (5)  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/08/13/maharashtradaughters-1/trackback/

RSS feed for comments on this post.

5 CommentsLeave a comment

  1. మీ మహిళామణుల గురించి రాసిన బ్లాగులను చదివాను.సంతోషం.నేను ప్రచురించిన ‘సంధ్యారాగం ‘వ్యాససంపుటిలో ‘స్త్రీలు-వైద్యవృత్తి ‘అనే వ్యాసంలో మనదేశంలో తొలి మహిళా డాక్టర్ల గురించి ( pioneers) రాసిన వ్యాసం కూడా చదవండి.

    • Ramanarao garu: Thanks for the comment. Where can I find that essay?

  2. It may be available(in my book ‘sandhyaaraagam’) in Visaalaandhra bookshops.Otherwise I can send one complimentary copy if you give your postal address.

    • Thanks for the information. I will see if I can buy it when I come to India next.

  3. thanks for the post..very inspiring


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: