ఓకే ఓకే – ఓకే!

లేదు లేదు, నేను టీ.రాజేందర్ చేసిన విన్యాసాల గురించి మాట్లాడుట లేదు. ప్రపంచమున మంచువారు, రాజేంద్రులూ, సింబాబులూ లేనియెడల నా పరిస్థితి ఏమి అవును? అన్న భయం నాకు ఉన్న మాట వాస్తవమే అయిననూ, ఇప్పుడీ టపా మాత్రం రాజేంద్రుల గురించి కాదు.

“ఒరు కల్, ఒరు కన్నాడీ” అను తమిళ చిత్ర రాజము గూర్చి ఆమధ్య కాలమునందు చక్కటి హాస్య చిత్రమన్న సమీక్షలు కొన్ని చదివి ఉంటిని. ఈవేళ అది మనగొట్టంలో తారసపడుట వలన చూడుట తటస్థించినది. “ఓకేఓకే-డబల్ ఓకే” అన్న పేరిట ఒక సమీక్ష వచ్చిననాడు చూచి తరించితిని. చాన్నాళ్ళ క్రితము సదరు దర్శకుడు తీసిన మరొక్క చిత్ర రాజం “బాస్ ఎంగిరా భాస్కరన్” చూస్తూ చూస్తూ నెమ్మదిగా మగతలోకి జారుకున్న జ్ఞాపకం ఇంకా మనసులోంచి చెరిగిపోలేదు. కానీ, ఆ యొక్క చిత్రరాజమునందు చిరుదివ్వెలా వెలిగిన సంతానం గుర్తొచ్చాడు. అనంతమైన నటనాపటిమ కలిగియుండీ, ఈ దిక్కుమాలిన తారల పక్కన హాస్యములాడుకుంటూ ఉండిపోవలసి వస్తున్నదని అతని గురించి నా అభిప్రాయము. ఆ సదరు సినిమాలోనూ సంతానము కథానాయకుడు కాదగ్గవాడు, కథానాయకుడే హాస్యగాడు కాదగ్గ వాడనీ ఆర్యుల వారిపై నాకున్న అకారణ వైమనస్యం వల్ల నా నిశ్చితాభిప్రాయము. ఈ ప్రస్తుత చిత్రరాజమందునూ బాగా సంపద ఉన్న నిర్మాతలు తామె కథానాయకులు అవ్వగలరన్న మాటయే కానీ, సంతానం అసలు కథానాయకుడు అని సినిమా చూడక మునుపే తీర్మానించుకున్ననూ, సంతానం కొరకు చిత్రము చూడవలెనని నిశ్చయించుకుంటిని. అదొక రకం దుగ్ధయని కూడా భావించవచ్చును. మా మంచువారిపై నాకున్న దుగ్ధ ఇట్టిది కాదు. అది మరియొక లాటిది.

ఇంతకీ, నేను చెప్పవచ్చునది ఏమనగా, ఈ చిత్రరాజము కూడా దర్శకుడి గతచిత్రమట్టిదే. ఇరు చిత్రములునూ అద్భుత కథా కథన రీతులు కలవి కావు. ఎక్కడికక్కడ ఎల్లప్పుడూ దర్శనమిచ్చే చిత్రరాజముల వంటివే కానీ, కాలక్షేపానికి చిత్రాలంటే అట్టివాటిని మించినవి ఎక్కడున్నవి చెప్పండి నేడు? అక్కడక్కడా ఇబ్బందికరమైన హాస్యం లేకపోలేదు. అటులనే, చిత్ర నిడివి మరీ ఎక్కువగా ఉన్నట్లు తోచినది. కొంతసేపు పోయిన పిమ్మట ఎంతకూ అవదెమీ? అనిపించినది పెక్కుమాట్లు. అయిననూ, కాలక్షేప సందర్శనమునకును, సంతాన దర్శనం వల్ల కలిగే కాలక్షేపమునకును ఈ చిత్రమును చూడవచ్చును. నాయికానాయకులు ఇరువురూ వారి పరిమితుల్లో ప్రయత్నించిననూ, వారికి పెక్కు పరిమితులు ఉన్నందువల్ల వారి ప్రదర్శన పరిమితము. సంతానము కొరకును, శరణ్య కొరకునూ, వారి హాస్యం కొరకును, హాయిగా నవ్వుకొను కొన్ని చక్కని సంభాషణల కొరకునూ ఈ చిత్రం చూడవచ్చును. నేపథ్య సంగీతము కూడా ఒక మోస్తరుగా వినసొంపుగానేయున్నది. కావున, చివరగా – సంతానము మరల కథానాయకుడు కావలెనని, వీరందరినీ తలదన్ను తారగా ఎదగవలెనన్న నా చిరకాల వాంఛను మరియొకసారి జ్ఞప్తికి తెచ్చుకొనుచు, ఈ వ్యాసము ముగించుచున్నాను.

Advertisements
Published in: on August 1, 2012 at 9:57 pm  Comments (9)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/08/01/okok/trackback/

RSS feed for comments on this post.

9 CommentsLeave a comment

 1. భయపడి చచ్చాను టైటిల్ చూసి.. మొదటి పేరా చదివాక కూడా ఆ భయం తాలూకు కంగారు తగ్గకపోడం వల్ల ప్రస్తుతానికి ఈ పోస్ట్ చదవలేకపోతున్నా.. 😀

 2. సంతాన దర్శనం వల్ల కలిగే కాలక్షేపమునకును ఈ చిత్రమును చూడవచ్చును
  sound funny

  • ఏం చేస్తామండీ, అతగాడి పేరే సంతానం మరి! 🙂

 3. మీ భాష కడు శ్లాఘనీయము, మా సోదరులు గారును ఒకానొకకాలమున ఇట్టి మాదిరిగానే ఉత్తరములను లిఖించుచుండెను. మీరునూ అటులనే లిఖించినందులకుగాను, మీకు ధన్యవాదములు.

 4. Thalli, daya chesi konchem vyavaharika bhasha lo vrayamma. chadavaleka chachipothunnam….

  • కళ్యాణ్ గారికి: మీరెవరో నాకు తెలియదు. కనుక, ఏకవచనం లో సంబోధించడం అంత మంచి పధ్ధతి కాదు అనుకుంటాను. రెండో విషయం – మిమ్మల్ని “ఇది చదువు, లేకపోతే చంపేస్తాను” అని నేను గానీ, ఇంకెవరైనా కానీ బెదిరించారా?

 5. నిజమేనండీ.. ఆ తమిళ చిత్రాలలో హీరోల కంటే సంతానమే కాస్త నయం అనిపిస్తుంది.. నా ఓటు మీకే అండీ ఈ విషయంలో..

 6. గ్రాంధికంలో రాయాలంటే ఇంకొంచెం సాధన అవసరం 🙂

  • 🙂 నేను మొదట మామూలుగా రాసేసి మళ్ళీ అలా ట్రై చేద్దామని మొదట్నుంచి చదువుతూ వచ్చి రీరైట్ చేశా 🙂


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: