సత్యజిత్ రాయ్ మాటల్లో – సినిమా ఆడకపోవడం గురించి

ఆ రోజుల్లో సినిమా నడవకపోతే “ప్రేక్షకులు ఈ సినిమా స్థాయికి ఎదగలేదు” అనడం ఇంకా ప్రాచుర్యం పొందలేదు. సినిమా తీసేవాడికి ప్రేక్షకుడి స్పందన ఎలా ఉంటుందో ఒక అంచనా ఉంటుంది కదా! కనుక, సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులని అనేవాళ్ళు కాదు. ఒక పెద్ద విందుభోజనం జరుగుతూ ఉంటే, అందులో చాలా మందికి ఫలానా వంటకం నచ్చలేదు అనుకోండి, అప్పుడు వంటవాడు “నా పాక నైపుణ్యం అనుభవించే రసికత మీలో లేదు” అని తినేవాళ్ళని అంటే సబబుగా ఉంటుందా?

నిన్న కాసేపు గత ఏడాది విడుదలైన సత్యజిత్ రాయ్ సినిమా వ్యాసాల సంకలనం “Deep Focus: Reflections on Cinema” లో కొన్ని వ్యాసాలు చదివాను. ఎప్పట్లాగే, వీలైనంత సరళ వాక్యాల్లో తాను చెప్పాలనుకున్నది చెప్పే శైలి కనుక, వ్యాసాలు నాకు నచ్చాయి. వీటి మధ్యలో, పై వాక్యం నన్ను ఆకట్టుకుంది (ఆ వాక్యానికి ఇంచుమించు అర్థం ఇదీ). ఈ ఉపమానాన్ని నేను పూర్తిగా సమర్థిస్తాను అనను కానీ, “A film should serve its objective” అని నమ్మే సత్యజిత్ రాయ్ నుండి వచ్చిన వాక్యం కనుక, ఆసక్తి కరంగా అనిపించింది. వ్యక్తిగతంగా ఆ ఉపమానాలతో సంబంధం లేకుండా నేను అలాగే అనుకుంటాను – “సినిమా నడవకపోతే, ప్రేక్షకులు ఎదగాలి అనడమేమిటి? ఎవరో ఒకరిమీదకి బాధ్యత నెట్టడం కాకపోతే? ” అని. ఇదే ముక్క ఆయన రాతల్లో వినడం కొంచెం ఆనందం కలిగించిందనే అనాలి ;).

Advertisements
Published in: on July 31, 2012 at 11:46 am  Leave a Comment  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/07/31/deepfocus-ray/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: