నేనూ…. అను పుస్తక పరిచయం

1) ఓంప్రథమంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే – నేను చాలా మంచిదాన్ని. నిజాయితీకి చీర కడితే నాలాగే ఉంటుంది అని నేనే కాదు, నా అభిమానులూ, గురువులూ ఇద్దరూ కూడా అనుకుంటూ ఉంటారు. నేను ఇదంతా చెప్పుకుంటూ ఉంటే మీకు గొప్పలు చెప్పుకుంటున్నట్లు అనిపించవచ్చు. కానీ, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తోచిన సంగతులు ఇవి. ఇలా ఒకసారి జీవితాన్ని సింహావలోకనం చేసుకోవడం చాలా అవసరం.

2) నా ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఎంత కౄరులో నేను మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అది జగమెరిగిన సత్యం. వాళ్ళకి అస్తమానం పెరిగిపోతున్న నా పాపులారిటీ చూసి ఓర్వలేనితనమే!దాని వల్ల వాళ్ళు నన్ను ఎంతగానో వేధించారు. దీని గురించి మా గురువులు, స్నేహితులు, అభిమానులు, కుటుంబ సభ్యులూ ఎంతగానో బాధపడ్డారు కానీ, నేనెప్పుడూ భయపడలేదు.

3) ఇందాకే చెప్పాను నేను నిజాయితీకి ప్రతిరూపాన్ని అని. అలాగే, న్యాయం పక్షాన నిలబడ్డం నాకు ఉగ్గుపాలతో అబ్బింది. డెడ్లీ కాంబో కనక – విద్యార్థి దశ నుంచే నాకెంతో పేరు వచ్చింది ప్రజల్లో. క్రమంగా రాజకీయాల్లోకి వచ్చాను.

4) నిరాహార దీక్షలు, ధర్నాలు, ఉద్యమాలు, వాదోపవాదాలు – ఒకటేమిటి, నేనేం చేసినా నిక్కచ్చిగా, నిజాయితీగా ఉండడమే కాదు, అది ప్రజల కోసమే అయి ఉంటుంది. అలాగే, ప్రత్యర్థి పార్టీ ఏమి చేసినా కూడా అది అధికారంలో ఉండిపోవడానికి, తక్కిన అందర్నీ కంట్రోల్ లో పెట్టడానికీనూ.

5) Youth of my state, awake! – పక్క రాష్ట్రాల వారిని చూసి నేర్చుకొండయ్యా!

6) మా పార్టీ కూడా నేను అనుకున్నంత గొప్పదేం కాదు. అందులో కూడా నా అంత నిస్వార్థ ప్రజాసేవ చేయాలి అనుకునే వారు తక్కువ. మూలాల్లోకి వెళ్ళి సేవ చేయాలి ప్రజలకి. పదవులకోసం ప్రత్యర్థులతో కుమ్మక్కవడం కాదు. అందరికీ నా అంత గొప్ప మనసు ఉంటే ఎంత బాగుణ్ణు?

7) నాకా ఇన్నేళ్ళయినా కూడా తెలివితో పాటు రావాల్సిన గెలివి అబ్బలేదు. అమాయకురాలిని. కనుక, ఈ మోసాలూ గీసాలూ నా వల్ల కాదు బాబూ! అసలుకే సత్ప్రవర్తన నా ఊపిరాయె! దీనివల్ల నేను నష్టపోయినవి చాలా ఉన్నాయి. అయినా నాకు బుద్ధి రాలేదు.

8) ఇంక చాలు – మార్పు అవసరం, అనివార్యం. నేనే నాంది పలకాలిక ఆ మార్పుకి. పెను మార్పుకి. ప్రపంచంలో కనీ వినీ ఎరుగని నిజాయితీ గల నాయకత్వంతో నా ప్రజల్ని ముందుకు నడపాలి.

9) నేను చాలా ఆవేశపరురాలిని, భోళా మనిషిని అన్న విషయం మీకు తెలుసు. కనుక, పైన చెప్పిన వాటిలో ఉన్నవన్నీ నిజాలే…ఎందుకంటే నాకు ఆ టైపు మాటలతో మోసం చేసే వాక్చాతుర్యం లేదు కదా!

– ఇట్లు –
మమతానురాగాలతో,
నేను

ఉపసంహారం:
…… ఈ మధ్య చాలారోజుల బట్టీ ఒక ఆత్మకథ తిరగేస్తున్నాను. అందులో రాజకీయాంశాల గురించి ఆసక్తి కరమైన దృక్కోణాలు లేకపోలేదు. కానైతే, పుస్తకం గురించి రెండు నెలల్లో ఎప్పుడు తల్చుకున్నా, ఇదిగో, ఈ పై స్వగతమే గుర్తొస్తున్నట్లు అనిపించీ… ఇలా రాసుకుంటున్నా. పుస్తకం పేరు కూడా చెప్పుకునే సాహసం నేను చేయలేను కనుక, ఇలాగ బ్లాగులో రాస్తున్నా అనమాట…పుస్తకం.నెట్ బదులు.

Advertisements
Published in: on July 15, 2012 at 8:40 am  Comments (11)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/07/15/nenoo-anu-pustaka-parichayam/trackback/

RSS feed for comments on this post.

11 CommentsLeave a comment

 1. pusthakam peru chepthe memu chadivevallam kadandi,
  visleshana verity ga undi.

  • పేరు చెబితే ఫ్యాన్సు నన్ను ఉతికి ఆరేస్తారు కదండీ. క్లూ లను బట్టి ఊహించాలంతే. ఆవిడ రాసినవే మూడో నాలుగో పుస్తకాలు 😉

 2. was she a governor?

  • oops… i did not see the key word at first and thought of a telugu woman who had worked as governor in recent past. 🙂

  • Sharp 😉

 3. ei ami banglay anubad kore didi ke pathabo na ki? 🙂

  • పైకి: బాబోయ్! ఈయనేదో బెంగాలీలో తిట్టేస్తున్నారు నాయనోయ్!!!
   లోపలకి: 🙂

 4. ఈ స్వగతాలు లింగ భేదం లేకుండా అన్ని రాజకీయ వాదులకు నప్పుతాయి,
  క్రమశీలక రాజకీయ వాదులకే కాకుండా నిజ జీవితం లోనిఉసరవెల్లులకు కూడా.

 5. “మమతానురాగాలతో,”

  Inka mayajaalam emo ani anukunna 😛

  • స్వీయకథనంలో మాయాజాలం లేదనుకుంటాను?

 6. బాగుంది మంచి శిష్యరికమే మొదలెట్టారు. రాబోయే ఎసెంబ్లీ ఎన్నికల్లో మీకోసం ఒక సీటు సిద్ధం చేయించేదా?? 🙂


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: