మహిళావరణం-12

(ఈ శీర్షికలో గల తక్కిన వ్యాసాలు ఇక్కడ చదవవచ్చు)
*********

111. భాగ్యలక్ష్మి (1962-1992): విప్లవ నాయకురాలు. ఒకసారి తోటి విప్లవ కార్యకర్తను పోలీసులు అందరికళ్ళ ఎదుటా కొడుతూ తీసుకెళ్ళి చంపి ఆ తరువాత అతన్ని అరెస్టు చేయలేదని చెబితే, భాగ్యలక్ష్మి ధైర్యంగా కోర్టులో అసలు సంగతి చెప్పి సంచలనం సృష్టించారట. పోలీసుల ఎన్‌కౌంటర్ లో మరణించారు.

112. మున్నంగి సువార్త (1963): కారంచేడులో ఒక అగ్రకులస్థుడి దురాగతాన్ని సువార్త ఎదిరించడంతో ఆ సంఘటన తరువాత అక్కడ దళితుల ఊచకోతకూ, వారిలో పోరాట స్పూర్థికీ దారితీసింది. “కారంచేడులో మాదిగలు చేసిన పోరాటానికి ముందు దలిటుల చైతన్యం వేరు, తరువాతి చైతన్యం వేరు” అని రాసారు రచయిత్రులు. అయితే, విషయం ఏమిటంటే, కనీసం ఈ పుస్తకం వచ్చిన నాటికి నిందితులు శిక్ష తప్పించుకున్నారు! (ఈ సంఘటన ఏమిటి? అని నాలాగే సందేహం కలిగిన వారికోసం – నాకు ఆన్లైన్ లో దొరికిన కత్తి పద్మారావు గారి వ్యాసం ఇదిగో)

113. బొర్లం స్వరూప (1966-1992): పీపుల్స్ వార్ నాయకురాలు. జ్యోతక్కగా ప్రసిద్ధి. విప్లవంలో చురుగ్గా పాల్గొన్నారు. పోలీసుల ఎంకౌంటర్ లో మరణించారు.

114. పాటిబండ్ల రజని (1966): ప్రముఖ స్త్రీవాద కవయిత్రి.

115. పూర్ణిమా రావు (1967) : ప్రముఖ క్రికెట్ క్రీడాకారిణి.

116. కరణం మల్లీశ్వరి (1975): ప్రముఖ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి. ఒలింపిక్ పతకం గ్రహీత. రాజీవ్ ఖేల్ రత్న అవార్డు కూడా పొందారు.

117. కోనేరు హంపి (1987): ప్రముఖ చదరంగ క్రీడాకారిణి.

***
…అయిపోయారు అందరూ. కాకపోతే, చివర్లో ఇచ్చిన లిస్టులో 118 అని ఉంది…ఎవర్నో మిస్సయిపోయా ఈ బ్లాగు టపాల్లో అని వెదికితే, మధ్యలో సురభి కమలాబాయి తరువాత “కొమ్మూరి పద్మావతీదేవి” పేజీ మిస్సయ్యా అని అర్థమైంది.

118. కొమ్మూరి పద్మావతీదేవి (1908-1970): ప్రముఖ నాటకరంగ కళాకారిణి. స్త్రీలసమస్యల గురించి రేడియో ప్రసంగాలు కూడా ఇచ్చారు.

Advertisements
Published in: on July 13, 2012 at 6:00 am  Leave a Comment  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/07/13/mahilavaranam-12/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: