మహిళావరణం-11

(ఈ శీర్షికలో గల తక్కిన వ్యాసాలు ఇక్కడ చదవవచ్చు)
*********
101. జమీలా నిషాత్ (1935): ప్రముఖ ఉర్దూ స్త్రీవాద రచయిత్రి. సామాజిక అసమానతలు గురవుతున్న ముస్లిం స్త్రీల గురించి, మతసామరస్యం గురించీ పని చేస్తున్నారు.

102. ప్రతిభా భారతి (1956): రాజకీయ నాయకురాలు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాసనసభకు మొదటి మహిళా స్పీకర్. వివిధ శాఖలకు మంత్రిగా, వివిధ కమిటీల సభ్యురాలిగా కూడా వ్యవహరించారు.

103. గొర్రె సత్యవతి (1956): రూరల్ అవేర్నెస్ డెవెలప్మెంట్ సొసైటీ పేరిట ఒక స్వచ్చంద సంస్థను పూర్తిగా మహిళలతో, మహిళలకోసం పని చేసేలా 1991 లో స్థాపించారు. ఆ సంస్థ ద్వారా ప్రతికూల పరిస్థితులను సైతం జయిస్తూ స్త్రీల అభ్యున్నతి కోసం, వారిలో చైతన్యం కోసం, ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు.

104. అరుణ ఎం.బహుగుణ (1957): ఆంధ్రప్రదేశ్ లో మొదటి మహిళా ఐ.పీ.యస్ అధికారిణి.

105. సి.పుణ్యవతి (1957): విద్యార్థి దశ నుండీ వామపక్ష విద్యార్థి ఉద్యమాల్లోనూ, మహిళా ఉద్యమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ మహిళా సంఘంలో కూడా చాలా కాలం పనిచేశారు.

106. కొండేపూడి నిర్మల (1958): ప్రముఖ స్త్రీవాద రచయిత్రి. ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. వృత్తిరిత్యా జర్నలిస్టు.

107. శోభాలత (1958): సినీరంగంలో మేకప్ కళాకారిణిగా, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కుని నిలబడ్డారు, నంది అవార్డులు కూడా పొందారు. బ్యూటీపర్లర్ మొదలుపెట్టీ శ్త్రీలకి ఆ రంగంలో శిక్షణ కూడా ఇస్తున్నారు. “మేకప్ రంగం స్త్రీలది కాదని, ఆ పని ఆపేయాలనీ” దక్షిణ భారత సినీ కళాకారుల ఫెడరేషన్ (ఫెప్సీ) ఆందోళన చేసిందట శోభాలత కి 1992లో రెండు నందులు వచ్చినప్పుడు!

108. రంగవల్లి (1959-1999): విద్యార్థి దశ నుంచే సి.పి.ఐ (ఎం.ఎల్) సభ్యురాలిగా అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. విద్యార్థి సంఘం నుండి “విజృంభణ” పత్రిక తీసుకొచ్చి విజయవంతంగా నడిపారు. బాగా చురుగ్గా గోదావరి లోయలోని అడవుల్లో పనిచేస్తున్నప్పుడు పోలీసులు చుట్టుముట్టి కాల్చి చంపారు.

109. ఫాతిమా బీ (1960): “కాల్వ” (కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం) సర్పంచిగా పని చేసి, గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఇందుకుగాను 1998లో యూ.ఎన్.డీ.పీ. వారి నుండి అవార్డు అందుకున్నారు. (అవునవును, అప్పట్లో కర్నూల్లో మా స్కూల్లో ఈ విషయం గురించి చెప్పుకున్నాం! )

110. విమల (1960): విప్లవ రచయిత్రి. అనేక రాజకీయ సాంఘిక ఉద్యమాల్లో పాల్గొన్నారు.

***
…తక్కిన వారిపై వచ్చే టపాలో.
(ఊరికే మొదటిపేరు చెప్పి వదిలేస్తే, బహుశా ఆ ఉద్యమాలతో పరిచయం ఉన్న వాళ్ళకి తెలుస్తుందేమో కానీ, ఈ పుస్తకం చదివే అవకాశం ఉన్న నాబోటి సామాన్యులకి కాదు! ఏం విమల? ఏం రంగవల్లి? ఇప్పుడు వీళ్ళ గురించి వివరాలు తెలుసుకోవాలి అనిపిస్తే, ఏమని వెదుకుతాం?)

Advertisements
Published in: on July 12, 2012 at 6:00 am  Comments (1)  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/07/12/mahilavaranam-11/trackback/

RSS feed for comments on this post.

One CommentLeave a comment

  1. “ఏం విమల”

    విమలక్క అని రాసుంటే తొందరగా అర్ధం అయ్యేది.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: