మహిళావరణం-10

(ఈ శీర్షికలో గల తక్కిన వ్యాసాలు ఇక్కడ చదవవచ్చు)
*********

91) పావలా శ్యామల (1951): “పావలా” నాటకం ద్వారా ఎంతో పేరు తెచ్చుకున్న నటి. ఈవిడ సినిమాల్లో, టీవీలో నటించడమే కాకుండా సంభాషణల రచయిత్రి కూడా.

92) కామేశ్వరి జంధ్యాల (1951): శ్త్రీ శక్తి సమాఖ్యలోనూ, మహిళా సమాఖ్యలోనూ పని చేశారు. అనేక సాంఘిక అభివృద్ధి ప్రాజెక్టుల్లో భాగమయ్యారు.

93) జస్బీర్ కౌర్ (1952) : ఎనిమిది భాషలు ఎరిగిన జస్బీర్ కౌర్ ప్రముఖ గాయని.

94) కె. లలిత (1953): అభ్యుదయ మహిళా సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షురాలిగా జంటనగరాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఎమర్జెన్సీ సమయంలో కొన్నాళ్ళు అజ్ఞాతవాసంలో ఉన్నా, బయటకు వచ్చాక మళ్ళీ మహిళా లేస్ వర్కర్స్ గురించి పనిచేశారు. స్త్రీ శక్తి సంఘటన వారితో పనిచేస్తూనే “మనకి తెలియని మన చరిత్ర” అన్న పేరుతో తెలంగాణా రైతాంగ పోరాటంలో పనిచేసిన స్త్రీల మౌఖిక చరిత్రను ప్రచురించారు. స్త్రీల ఆరోగ్యం గురించి కూడా పుస్తకం రాసారు. “విమెన్ రైటింగ్ ఇన్ ఇండియా” పుస్తకాలకి సంపాదకత్వం వహించారు.

95) గీతా రామస్వామి (1953): హైదరాబాదు బుక్ ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. ప్రస్తుతం కూడా దాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అంతకుముందు అనేక సాంఘిక సమస్యల పరిష్కరణ కోసం కృషి చేశారు.

96) ఉమాదేవి (1953) : మహర్షి సాంబమూర్తి వికలాంగ బాలికల ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తూ, బాలికల అభ్యున్నతి కోసం కృషి చేసారు. (ఈ టైపులో ఉమాదేవి అని రాసి వదిలేస్తే, ఈవిడ గురించి వివరం తెలుసుకోవాలన్నా అయ్యే పనేనా? )

97) వేమన వసంతలక్ష్మి (1953) : వృత్తి రిత్యా సంపాదకురాలు. వార్తాపత్రికా జర్నలిజంలో ఎడిటర్ స్థాయికి చేరుకున్న అతి కొద్దిమంది మహిళల్లో వసంత లక్ష్మి ఒకరు. పౌరహక్కుల, మానవహక్కుల సంఘాల్లో కూడా పనిచేశారు. కొన్ని కథలు, ఇతరలాలు ఆంగ్లం నుండి తెలుగులోకి అనువదించారు.

98) కొండవీటి సత్యవతి (1954): భూమిక పత్రిక సంపాదకురాలు సత్యవతి గారే!

99) శోభానాయుడు : (ఈవిడకి జన్మించిన సంవత్సరం రాయలేదు మరి) ప్రముఖ నర్తకి. “కూచిపూడి ఆర్ట్స్ అకాడెమీ ఆఫ్ హైదరాబాదు” స్థాపించి ఎంతోమంది నృత్య కళాకారులకి శిక్షణ ఇచ్చారు. దేశవిదేశాల్లో తిరిగి ప్రదర్శనలిచ్చారు. ఎన్నో అవార్డులు అందుకున్నారు.

100) యు. వింధ్య (1955): పౌరహక్కుల సంఘంలో స్త్రీల అజెండా ముందుకు తీసుకుపోవాలని కృషి చేసిన వారిలో ఒకరు. స్త్రీల మానసిక ఆరోగ్యాన్ని గురించి, రాడికల్ రాజకీయాల్లో స్త్రీల మనస్తత్వాన్ని గురించి, కుటుంబ హింస గురించి – ఇలా స్త్రీవాదానికి, మనస్తత్వ శాస్త్రానికి మధ్య ఉన్న సంబంధాల గురించి పరిశోధనలు చేశారు. పరిశోధకురాలిగా కూడా పేరు తెచ్చుకున్నారు.

…ఇంక అయిపోవస్తోంది. రెండు మూడ్రోజుల్లో ఈ టపాల సిరీస్ ముగుస్తుంది. 🙂

Advertisements
Published in: on July 11, 2012 at 6:00 am  Comments (1)  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/07/11/mahilavaranam-10/trackback/

RSS feed for comments on this post.

One CommentLeave a comment

  1. >శోభానాయుడు – వికీపీడియా
    > 99) శోభానాయుడు : (ఈవిడకి జన్మించిన సంవత్సరం రాయలేదు మరి)

    te.wikipedia.org/wiki/శోభానాయుడు
    రంగం, శాస్త్రీయ నృత్యం నర్తకి. ఉద్యమం, కూచిపూడి. పురస్కారాలు, పద్మశ్రీ. శోభానాయుడు విశాఖ జిల్లా అనకాపల్లి లో 1956 లో జన్మించారు. వెంపటి చిన సత్యం శిష్యురాలు. వెంపటి నృత్యరూపాలలో ఈమె అన్ని ప్రధాన పాత్రలనూ పోషించారు.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: