మహిళావరణం-9

(ఈ శీర్షికలో గల తక్కిన వ్యాసాలు ఇక్కడ చదవవచ్చు)
*********

81) మాలినీ రాజూర్కర్ (1941) : ప్రముఖ హిందుస్తానీ గాయని. ఈవిడ గురించిన వికీ లంకె ఇక్కడ చూడవచ్చు.

82) ఉజ్రా బిల్‌గ్రామి (1943): బాంబే విశ్వవిద్యాలయంలోనూ, విదేశాల్లోనూ చదువుకుని వచ్చిన ఉజ్రా (ఉజ్రమ్మ గా ప్రసిద్ధులు) 1988లో “దస్తకార్ ఆంధ్ర”ను ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలోని నేతపని వారితో కలిసి పనిచేసే సంస్థ ఇది. హస్తకళలను ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండేలా చేయడం, అదే సమయంలో కళను సంప్రదాయ వనరుల నుంచి వేరు చేయకుండా ఉండటం ఈ సంస్థ లక్ష్యాలు. ఈ సంస్థతోనే కాక, ఉజ్రా మరిన్ని హస్తకళల సంబంధిత సంస్థల్లో కన్సల్టెంటుగా కూడా పనిచేశారు.

83) కొలకలూరి స్వరూపరాణి (1943): ప్రముఖ రచయిత్రి. ఆధునిక ఉపమానాలకి ప్రసిద్ధి. భారతీయ కవి సంప్రదాయానికి విరుద్ధంగా చంద్రుణ్ణి స్త్రీగా, రాహువుని చంద్రుని భర్తగా చేసి “చంద్రగ్రహణం” అన్న పద్య కావ్యం రాసారు. అందులో భార్య వ్యక్తిత్వాన్ని భంగపరచి పురుషాధిక్యత ప్రదర్శించే భర్త నియంతృత్వాన్ని ఆవిడ గ్రహణంగా భావించారు. ఇలాగే, అస్తమిస్తున్న సూర్యుణ్ణి కట్నం ఒకేసారి ఇవ్వలేదనే కోపంతో పీటలపై నుంచి వెళ్ళిపోతున్న వరుడితో పోలుస్తారు. (ఇజాల గోల అటు పెడితే, ఇలా కూడా చూడొచ్చు పై దృశ్యాల్ని అంటే నాకు భలే కుతూహలంగా ఉంది ఈవిడ రాసింది చదవాలని.)

84) సుజీ తారు (1943): ఉగాండాకు చెందిన సుజీ తారు ఉద్యోగరిత్యా హైదరాబాదులోని సీఫిల్ (CIEFL) లో స్థిరపడి, స్త్రీ సమస్యల గురించి, హైదరాబాదులో సోషలిస్టు ఫెమినిస్టు దృక్పథం పరిచయం చేయడంలోనూ కృషి చేశారు. పరిశోధకులు, రచయిత్రీ కూడానూ.

85) శారద (1945): ప్రముఖ సినీ నటి. తన నటనకు గాను “ఊర్వషి” అవార్డు మూడుసార్లు అందుకున్నారు.

86) పంచాది నిర్మల (1947-1969): శ్రీకాకుళోద్యమంలో ప్రధాన భూమిక వహించారు. గిరిజనులతో కలిసి పని చేస్తూ వారిని తిరుగుబాటు దిశగా ప్రోత్సహించారు. ఆ సమయంలో భూస్వాములకూ సింహస్వప్నంగా నిలిచారు. అయితే, చివరకి పోలీసులు పట్టుకోవడంతో చిన్న వయసులోనే మరణించారు. (శ్రీకాకులోద్యమం గురించి వెదికితే ఈవిడ గురించి కనిపిస్తుంది. అంత చిన్న వయసులోనే మరణించినా కూడా ఇంతదాకా జనం తల్చుకుంటున్నారూ అంటే ఈవిడెంత సాహసం చేసారో అప్పట్లో!)

87) చౌదరి సంపూర్ణమ్మ (1948): శ్రీకాకుళ గిరిజనోద్యమంలో పనిచేసిన ప్రముఖ నాయకుల్లో ఒకరు. మహిళా సంఘాలలో పని చేశారు. గిరిజనుల్లో శుబ్రత గురించి, ఆరోగ్య సమస్యల గురించి అవగాహన కలిగించేవారు. తరువాత అరెస్టై, జైల్లో కూడా అనేక సమస్యలపై పోరాడారు. తరువాత సీపీఐ (మార్క్సిస్టు) లో పనిచేయడం మొదలుపెట్టారు.

88) లంక అన్నపూర్ణదేవి (1950): తనపాట తనే పాడుకుంటూ కూచిపూడి నాట్య ప్రదర్శనలిచ్చే నర్తకి, గాయని. నాట్యశాస్త్రంలో పరిశోధన చేసి, అతి చిన్నవయసులో సిద్ధేంద్ర కళాక్షేత్రం గుడివాడ శాఖకు ప్రిన్సిపాల్ గా పనిచేశారు. అరవై-డెబ్భైలలో పాకిస్తాన్ తో యుద్ధసమయంలో సరిహద్దుల వద్ద విస్తృతంగా పర్యటించి జవాన్ల కోసం నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. రైలు ప్రమాదంవల్ల కాలు సగంవరకూ తొలగించాల్సి వచ్చినా మొక్కవోని ధైర్యంతో, ఎలాగైనా మళ్ళీ నృత్యంచేయాలని అనేక ఆపరేషన్ల అనంతరం కృత్రిమ కాలితో మళ్ళీ నర్తించి ఎన్నో ప్రదర్శనలు కూడా ఇచ్చారు. ఎన్నో అవార్డులు, ప్రశంసలు ఈవిడని వరించాయి. తండ్రి మరణించినప్పుడు స్మశానానికి వెళ్ళి తలకొరివి పెట్టి, సంవత్సరంపాటు కొడుకు చేయవలసిన కర్మకాండలన్నీ సమాజాన్ని ఎదుర్కుని మరీ చేసారు.

89) ఐ. రోశమ్మ (1950): 1992లో నెల్లూరులో జరిగిన సారా వ్యతిరేకోద్యమంలో నాయకురాలు. మద్య నిషేదం కోసం చాలా కృషి చేశారు.

90) శాంతా సిన్హా (1951): బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం విస్తృత కృషి చేశారు, చేస్తున్నారు. రామన్ మెగసెసే అవార్డు గ్రహీత. మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ ద్వారా బాలకార్మికుల కోసం పని చేస్తున్నారు.

…తక్కిన వారి గురించి రాబోయే టపాలలో!

Advertisements
Published in: on July 10, 2012 at 6:00 am  Comments (1)  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/07/10/mahilavaranam-9/trackback/

RSS feed for comments on this post.

One CommentLeave a comment

  1. Visit http://bookforyou1nly.blogspot.in/

    for books


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: