మహిళావరణం-8

(ఈ శీర్షికలో గల తక్కిన వ్యాసాలు ఇక్కడ చదవవచ్చు)
*********

71) ద్వారం మంగతాయారు (1935 – ): ప్రముఖ వయొలిన్ విద్వాంసురాలు. తండ్రి ప్రముఖ సంగీత విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు. బాల్యంలో మంగతాయారుకి వయొలిన్ పై ఆసక్తి కలగాలని ఆయన ఆవిడ పక్కన కూర్చుని వాయించేవారట. కానీ, ఊహ తెలిసి ఆవిడ నేర్చుకోవడంలో ఆసక్తి చూపేనాటికి ఆయనకి నేర్పే ఆసక్తి పోయి శిష్యుల వద్ద నేర్చుకొమ్మన్నారట. అలాగే నేర్చుకుని, తండ్రితో కలిసి కచేరీలు చేస్తూ ఉండేవారు. తర్వాత క్రమంగా ఆకాశవాణిలో ఆర్టిస్టుగా నిలదొక్కుకుంటున్న సమయంలో ఆయన మళ్ళీ నేర్పేందుకు ఆసక్తి చూపారట. దానితో మళ్ళీ నేర్చుకున్నారట :-). ఎందరో ప్రముఖులతో కలిసి కచ్చేరీలు చేశారావిడ. ఈవిడ గురించిన పరిచయంలో ఈ క్రింది మాటలు ఆలోచింపజేశాయి :
“మంగతాయారు తన కట్టుబొట్టుల గురించి శ్రద్ధ చూపకపోవడంతో చాలామంది ఆవిడను వింతగా చూసేవారు. ఆమె ప్రతిభను తక్కువ అంచనా వేసేవారు. “నాలాగా ఒక పురుషుడు ప్రవర్తిస్తే, అతన్ని జీనియస్ అంటారు. ఆడదాన్ని గాబట్టి నాతో కాస్త మంచిగా తయారై కనబడమని చెప్పే సాహసం చేస్తారు”

72) పి. సుశీల (1936-): ప్రముఖ గాయని. సినిమాల్లో లెక్కలేనన్ని పాటలు పాడారు. అనేక అవార్డులు అందుకున్నారు. గాయనిగా సుదీర్ఘమైన కెరీర్ ఆవిడది.

73) తురగా జానకీరాణి (1936): ప్రముఖ రచయిత్రి. ఆకాశవాణిలో పని చేస్తున్నప్పుడు జాతీయ స్థాయి అవార్డులు కూడా పొందారు. జానకీరాణి గారి గురించి పి.సత్యవతి గారు భూమిక పత్రికలో రాసిన వ్యాసం ఇక్కడ చదవండి. ఇక, ఆవిడ పుస్తకాలు రెంటిపై నిడదవోలు మాలతి గారు రాసిన సమీక్ష పుస్తకం.నెట్లో ఇక్కడ చదవండి.

74) జిలానీ బాను (1936-): ప్రముఖ ఉర్దూ కథా, నవలా రచయిత్రి. ఆమె కథలు పధ్నాలుగు భారతీయ భాషల్లోకి అనువదితమయ్యాయి. రేడియో, టీవీ నాటకాలు రాసారు. దక్కనీ మాండలికాన్ని కాపాడ్డం కోసం తెలంగాణలో తిరిగి, ఆ భాష మాట్లాడగల వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడించి రికార్డు చేశారు. సాహిత్యంలో ఎన్నో అవార్డులు అందుకున్నారు.

75) హేమలత లవణం (1937 -2008): ప్రముఖ సాంఘికోద్యమ నాయకురాలు. నేరస్థుల సంస్కరణ కోసం “సంస్కార్” ను స్థాపించారు. జోగిని ఆచారం రూపుమాపడానికి కృషి చేశారు. బాణామతి వ్యతిరేక ప్రచారం చేశారు. తన తండ్రి పేరిట “జాషువా ఫౌండేషన్” స్థాపించి సాహితీవేత్తలకి బహుమానం అందజేసారు. కొన్ని పుస్తకాలను కూడా రాశారు. నాస్తిక కేంద్రం వారు హేమలత గారి మరణ సందర్భంలో వెలువరించిన వ్యాసం ఇక్కడ చదవొచ్చు.

76) సావిత్రి (1937-1981) : ఏం చెబుతామండీ కొత్తగా సావిత్రి గురించి? ఆ పేరు తెలియని తెలుగువారూ తెలుగువారే?

77) ఎస్. జానకి (1938 – ): ప్రముఖ గాయని. గాయనిగా యాభై ఏళ్ళ పైచిలుగ్గా ఉన్న సుదీర్ఘ కెరీర్ ఆమెది. ఇంకా కూడా అప్పుడప్పుడు పాడుతూనే ఉన్నారు.

78) శ్రీరంగం గోపాలరత్నం (1939-1993): ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసురాలు. అంతర్జాతీయ ఖ్యాతిని అర్జించారు.

79) రమ మేల్కోటే (1940-): వామపక్ష సాంఘిక-రాజకీయోద్యమాలలో చురుగ్గా పాల్గొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేస్తూ అనేకమంది విద్యార్థులను వామపక్ష రాజకీయోద్యమాలలో పాల్గొనేలా ప్రభావితం చేశారు. కొన్ని పుస్తకాలు కూడా వ్రాసారు.

80) డఫ్ని ఎం. డి రెబెల్లో (1941-): తమిళనాడుకు చెందిన ఈవిడ ఆంధ్రప్రదేశ్లో మొదటి ఐ.ఎ.యస్. ఆఫీసర్. అంతర్జాతీయ తూలనాత్మక విద్య గురించి పరిశోధన చేసి పీ.హెచ్.డీ పట్టానూ, ట్రినిటీ మ్యూజిక్ కాలేజీ నుండి సంగీతంలో సర్టిఫికెట్నూ అందుకున్న వ్యక్తి.ఐ.యె.యస్ గా అనేక బాధ్యతాయుతమైన పదవుల్లో పని చేశారు.

****
మిగితా వారి గురించి వచ్చే టపాల్లో. హమ్మయ్య, ఎట్టకేలకు ఇప్పటికి నాకు తెలిసిన పేర్లు తెలియని వాటికంటే ఎక్కువగా ఉన్నాయి ఈ పది మందిలో!! 🙂

Advertisements
Published in: on July 9, 2012 at 6:00 am  Comments (4)  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/07/09/mahilavaranam-8/trackback/

RSS feed for comments on this post.

4 CommentsLeave a comment

  1. ఒక రకంగా చూస్తే, ఆరోగ్యం బాగుండక ఈ రోజున యింటి పట్టునే ఉన్నందుకు మంచి ఫలితం దొరికింది. చాలా సంతోషం. మీ మహిళావరణం టపాలన్నీ ఆత్రంగా చదివాను. ఎంతో మంది గొప్పవారిగురించి తెలుసుకుని సంతోషించాను. నిజానికి ఒక్కొకరి గురించి ఒక్కొక పేజీ చొప్పున వ్రాసి ఉంటే కూడా అదంతా యీ రోజే చదివేసే వాడినే యెంత సేపైనా సరే! చాలా మంచి వ్యాసాలను అందించినందుకు చాలా చాలా ధన్యవాదాలు.

    • శ్యామలరావు గారికి: ధన్యవాదాలు. అవునండీ, అందరి గురించీ కాకపోయినా, కొందరి గురించైనా చెప్పుకోవలసిన సంగతులు చాలా ఉన్నాయని అనిపించింది నాకు. అంటే, అక్కడికి నాకు తెలుసని కాదు కానీ, పుస్తకంలో రాసిన వివరాలు బట్టి ఇంకా చాలా కథుంది అనిపించింది కొందరి గురించి.

  2. Please also read my article about famous lady doctors of India

    • Ramanarao garu: Link?


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: