మహిళావరణం-7

(ఈ శీర్షికలో గల తక్కిన వ్యాసాలు ఇక్కడ చదవవచ్చు)
*********

61) మల్లు స్వరాజ్యం (1930 – ) : కమ్యూనిస్టు నాయకురాలు. భూస్వాముల కుటుంబంలో పుట్టినా చిన్నతనంలోనే అభ్యుదయ భావాలపట్ల ఆకర్షితులయ్యారు. పన్నెండేళ్ళ వయసులోనే వెట్టిచాకిరికి వ్యతిరేకంగా, కూలిపెంచాలని జరిగిన పోరటంలో పాలుపంచుకున్నారు. రైతుకూలీల భూపోరాటంలో – పాటలు పాడుతూ, ఉపన్యాసాలు ఇస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. కమ్యూనిస్టు పార్టీలో చురుగ్గా పనిచేశారు. కొన్నాళ్ళు శాసన సభ్యురాలిగా కూడా పనిచేశారు. ఈవిడ గురించిన వికీ లంకె ఇక్కడ.

62) తెన్నేటి హేమలత (1931-1997) : ప్రముఖ రచయిత్రి. “లత సాహిత్యం” అని పేరు వచ్చేంత రచనలు చేశారు. స్త్రీపురుష సంబంధాలలోని వైరుధ్యాలను సాహసంతో చిత్రీకరించారు అంటారు. “ఊహాగానం” శీర్షిక చాలా ప్రసిద్ధి పొందింది. వీరి గురించి నిడదవోలు మాలతి గారు “లత సాహిత్య చరిత్ర” పేరిట ఒక బ్లాగు టపా రాశారు. అది చదివితే, వీరి జీవితవిశేషాలు తెలుస్తాయి. ఇక లత గారితో తన వ్యక్తిగత అనుభవాల గురించి కల్పన రెంటాల గారు రాసిన బ్లాగు టపా ఇదిగో!

63) మాలతి పద్మనాభరావు (1932-): ప్రముఖ సంగీత విద్వాంసురాలు. ఎందరికో శిక్షణనిచ్చారు. ఎన్నో అవార్డులు, సన్మానాలు కూడా అందుకున్నారు. ఈమెను ఆంధ్రా ఎం.ఎల్.వసంతకుమారి అంటారట!

64) వాసిరెడ్డి సీతాదేవి (1932-2007): ప్రముఖ రచయిత్రి. ఇంట్లో వాళ్ళని ఎదిరించి చదువుకుని, స్వతంత్రంగా జీవించడం మొదలుపెట్టారు. ప్రభుత్వోద్యోగం చేస్తూనే, సాహిత్య రంగంలో తనదైన ముద్ర వేశారు. సామాజిక సంఘర్షణలను తన నవలల్లో చిత్రీకరించారు. అనేక అవార్డులు అందుకున్నారు. సాహిత్య అకాడెమీ, ఆం.ప్ర. టెక్స్ట్ బుక్స్ కమిటీ వంటి సంస్థల్లో పని చేశారు. వనితాజ్యోతి మాసపత్రికకు గౌరవ సంపాదకులుగా కూడా ఉన్నారు.

65) అబ్బూరి ఛాయాదేవి (1933-): స్త్రీ సమస్యలను హాస్యంగా వ్యంగ్యంగా చెప్పిన రచయిత్రి ఛాయాదేవి. “వనిత”, “కవిత” అన్న పత్రికలను కొన్నాళ్ళు నిర్వహించారు. ప్రభుత్వ్యోద్యోగంలో ఉంటూనే సాహితీ సేవ చేసారు. పత్రికల్లో శీర్షికలు, కథలు, వ్యాసాలు, పుస్తకాలు – ఎన్నో రాసారు. ఈమె కథలు ఆంగ్ల, స్పానిష్, వివిధ భారతీయ భాషల్లోకి అనువాదం అయ్యాయి.

66) చిందు యెల్లమ్మ (1933-2005): “చిందు భాగవతం” అన్న జానపద కళారూపానికి మారుపేరుగా పేరు తెచ్చుకున్నారు. యక్షగానరూపంలో భారత-భాగవత గాథలను పాడి ప్రదర్శనలు ఇచ్చేవారు. ఈ ప్రక్రియలో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అవార్డులు కూడా అందుకున్నారు. ఈవిడ గురించి ఆంధ్రభూమిలో వచ్చిన వ్యాసం ఇదిగో.

67) వినోదిని రెడ్డి (1934-): ప్రముఖ వైద్య శాస్త్రవేత్త. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కు మొదటి మహిళా డైరెక్టర్. పిల్లల పోషకాహార విషయంలో విస్తృత పరిశోధనలు చేశారు. వివిధ పిల్ల ఆరొగ్య సంస్థల్లో సభ్యులుగా ఉన్నారు. ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు.

68) వి.ఎస్.రమాదేవి (1934-): ప్రభుత్వోద్యోగిగా కెరీర్ ప్రారంభించి వివిధ స్థాయుల్లో ఉన్నత పదవుల్ని అలంకరించారు. రాష్ట్ర గవర్నర్ గా కూడా పనిచేశారు. ప్రభుత్వ రంగంలో చురుగ్గా ఉండడంతో పాటు వీరు రచయిత్రి కూడా.

69) మెహతాబ్ ఎస్. బామ్జీ (1934-): న్యుట్రిషనల్ బయోకెమిస్ట్రీలో పరిశోధన చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ లో పనిచేస్తూ, పోషకాహారం గురించి విస్తృత పరిశోధన చేశారు. అంతర్జాతీయ ఖ్యాతి పొందారు. పదవీ విరమనణానంతరం కూడా పోషకాహారం, గ్రామీణ ప్రజల ఆరోగ్యం గురించి పనిచేస్తూనే ఉన్నారు.

70) శారదా శ్రీనివాసన్ (1935 – ): ప్రముఖ రేడియో స్టార్. అద్భుతమైన కంఠ మాధుర్యంతో ఎన్నో పాత్రలకి జీవం పోశారు. ఈవిడ జీవితానుభవాలు పుస్తకంగా కూడా వేశారు. దాని గురించి పుస్తకం.నెట్లో చర్చ ఇక్కడ చూడవచ్చు.

***
ఇవ్వాళ్టికి ఇంతే. మిగితా వారిపై వచ్చే టపాల్లో.

Published in: on July 7, 2012 at 6:00 am  Leave a Comment  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/07/07/mahilavaranam-7/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: