మహిళావరణం-5

(ఈ శీర్షికలో గల తక్కిన వ్యాసాలు ఇక్కడ చదవవచ్చు)
*********

41) చిత్తజల్లు కాంచనమాల (1921-1981) : తెలుగు సినిమాల్లో తొలి గ్లామర్ హీరోయిన్. కవుల కవితల్లో, కాలెండర్ పేజీల్లో, చీరల డిజైన్లకి పెట్టే పేర్లలో – ఇలా జనంలో విపరీతమైన పాపులారిటీ కల నటి. ఒక నిర్మాత తో జరిగిన కోర్టు కేసు వల్ల కలిగిన ఇబ్బందుల మధ్య నటన నుండి విరమించారు. శారీరక మానసిక అనారోగ్యాలతో మద్రాసులో మరణించారు.

42) శ్రీరాజ్యం సిన్‌హా (1923 – ) : ఈవిడ సోషలిస్టు నాయకురాలు, రచయిత్రి, సంపాదకురాలు, వివిధ ప్రభుత్వ పదవుల్లో దీర్ఘకాలం సేవలందించారు. చిన్నప్పుడు వామపక్ష భావాలవైపు మొగ్గడంతో భయపడ్డ తల్లిదండ్రులు శాంతినికేతన్ పంపివేశారట!

43) వింజమూరి సీతాదేవి (1924 – ) : జానపద సాహిత్యం గురించి విశేష కృషి చేశారు. దక్షిణ భారతదేశాంలో జానపద సంగీతానికి సంబంధించిన తొలి మహిళా ప్రొడ్యూసర్ వింజమూరి సీతాదేవి. ఆంధ్రదేశమంతా తిరిగి జానపద పాటలని సేకరించి, యాస చెడకుండా పాడేవారట. “మాభూమి” చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. “ఒక ఊరి కథ” చిత్రానికి కూడా జానపద బాణీలు సమకూర్చారు. ఎన్నో అవార్డులు, బిరుదులు అందుకున్నారు. పుస్తకాలు రాసారు. ఈవిడ ముందు టపాల్లో ప్రస్తావించిన వింజమూరి వెంకటరత్నమ్మ గారి పుత్రిక, మరొక టపాలో ప్రస్తావించిన వింజమూరి అనసూయ గారి సోదరి.

44) మల్లాది సుబ్బమ్మ (1924-) : స్త్రీ సంక్షేమం గురించి చాలా కృషి చేశారు. ప్రస్తుత తరంవారికి, అప్పుడప్పుడూ అయినా పేపర్లూ, టీవీలూ చూశేవారికి బహుశా పరిచయం అక్కర్లేదేమో! మహిళాభ్యుదయ సంస్థను స్థాపించి స్త్రీ జనాభివృద్ధి కోసం శ్రమించారు. అభ్యుదయ వివాహ వేదిక కూడా స్థాపించారు. మద్య నిషేదం గురించి పోరాడారు. పుస్తకాలు వ్రాసారు. ఎన్నో అవార్డులూ, సన్మానాలూ పొందారు.

45) జీనత్ సాజిదా (1924-) : స్త్రీ హక్కుల కోసం పోరాడే అభ్యుదయ వాదిగా, రచయిత్రిగా ప్రసిద్ధులు. యాభై అరవై దశాబ్దాలలో ఉర్దూ ఉత్సవాల నిర్వహణలో పాలుపంచుకున్నారు. తెలుగు సాహిత్య చరిత్రను ఉర్దూలో రాశారు. దక్కనీ సాహిత్యం గురించి కూడా పుస్తకాలు రాశారు. హైదరాబాదులోని కవుల, రచయితల సాహిత్య కృషిని గురించి కూడా పుస్తకం రాసారు. తెలుగు నవలలను ఉర్దూలోకి అనువదించారు. ఇవి కాక స్వయంగా ఎన్నో కథలు రాశారు.

46) మోటూరి ఉదయం (1924-2002) : తెలంగాణా రైతాంగ పోరాటంలోనూ, కమ్యూనిస్టు పార్టీలోనూ చురుగ్గా పనిచేశారు. బుర్రకథలు కూడా చెప్పేవారు. స్త్రీ-బాలలకు స్పూర్తి కలిగించేలా గీతాలు నేర్పేవారు. “బాలభారతం” అని పిల్లల చదువు, ఆర్థిక స్థాయి గురించి పుస్తకం రాసారు. భారత దేశంలో మొదటి మహిళా మెడికల్ రిప్రెజెంటేటివ్ అట! “పాట్రీ, ఉద్యమం, సభ, ఇల్లు ఎక్కడైనా ఉదయం పనితీరు ప్రత్యేకంగా ఉంటుంది” అని ఈ పుస్తక రచయిత్రల అభిప్రాయం. వికీ పేజీ ఇక్కడ.

47) బాను తాహెరా సయీద్ (1924-) : ప్రముఖ ఉర్దూ కవయిత్రి. ఆగ్రాలో జన్మించిన ఆవిడ విదేశాల్లో చదువుకున్నాక వివాహానంతరం హైదరాబాదులో స్థిరపడ్డారు. ఉర్దూ, పర్షియన్, ఆంగ్ల భాషల్లో రచనలు చేస్తారు. ఎన్నో అవార్డులను, గౌరవ డాక్టరేటులనూ పొందారు. ఆమె ఇంటిని ముషాయిరా నిలయంగా పిలుస్తున్నారు ఈ పుస్తక రచయితలు.

48) సూర్యకాంతం (1924-1996): ఈవిడ గురించి తెలియని తెలుగు సినిమా ప్రేక్షకులు చేతులెత్తండి? 🙂

49) భానుమతి రామకృష్ణ (1925-2005): బహుముఖ ప్రజ్ఞాశాలి ఈవిడ గురించి తెలియని వారో? ఈవిడ గురించిన వికీ పేజీ ఇక్కడ. ఈవిడ రాసిన కథలు, ఆత్మకథ వీటి గురించి ఆన్లైన్లో విరివిగా వ్యాసాలున్నాయి. గూగుల్ కి దొరికేవే!

50) శాంతా రామేశ్వరరావు (1925-): హైదరబాదులో ప్రముఖ విద్యావేత్త. మామూలు పాఠశాలకు భిన్నంగా విద్యారణ్య పాఠశాల స్థాపించారు. పిల్లల కోసం ఎన్నో పుస్తకాలను రాసారు. పిల్లల విద్యా బోధన గురీంచి విశేష కృషి చేశారు.

*******
(మిగితా వారి పై వచ్చే టపాల్లో!)

Advertisements
Published in: on July 5, 2012 at 6:00 am  Comments (4)  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/07/05/mahilavaranam-5/trackback/

RSS feed for comments on this post.

4 CommentsLeave a comment

  1. వీరిలో మల్లాది సుబ్బమ్మ గారు తప్ప మిగిలిన మహిళలందరూ భర్త చాటు భార్యలగానో, ఇతర సంప్రదాయవాదులగానో ఉన్న వాళ్ళే. సుబ్బమ్మ గారి గురించి తరువాత వ్రాస్తాను. ఆవిడ భర్త రామమూర్తి గారి గురించి కూడా తరువాత వ్రాస్తాను.

  2. “సూర్యకాంతం (1924-1996): ఈవిడ గురించి తెలియని తెలుగు సినిమా ప్రేక్షకులు చేతులెత్తండి?”

    ఈవిడ గురించే తెలియని వారే కాదు ఈవిడ ఎడమ చేతి దెబ్బ తినని తెలుగు వారే లేరేమో 🙂

    • @Jai: అంటే, “పురచేత్తో కొడితే పునర్జన్మ లేకుండా పోతావ్” అన్న బాలకృష్ణ డైలాగ్ కి మూలాధారం ఈవిడేనంటారా? 😛 😛

    • తెలీదండీ నేను మీరు చెప్పిన సినిమా చూడలేదు. ఆయనంటే నాకు భయం 🙂


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: