మహిళావరణం – 1

చాన్నాళ్ళ క్రితం బాపు గారి లైబ్రరీలో ఈ పుస్తకం గురించి తెలుసుకున్నాను. ఆపై ఒక స్నేహితురాలు మళ్ళీ ఈ పుస్తకం గురించి ఇటీవలే ప్రస్తావించింది.. అనుకోకుండా, ఈ పుస్తకం మా లైబ్రరీలో కనిపించింది (అదేమిటో, పేరుకి జర్మన్ యూనివర్సిటీ కానీ, నాకు ఇక్కడే హైదరాబాదులో కనబడని తెలుగు పుస్తకాలు ఎక్కువగా కనబడుతున్నాయి!). అలా, మొదలుపెట్టాను.

వోల్గా, వసంతా కణ్ణబీరన్, కల్పన కణ్ణబీరన్ ల ఆధ్వ్యర్యంలో వచ్చిన ఈ పుస్తకం గత శతాబ్దంలో ఆంధ్రదేశ ప్రాంతాల్లో తిరిగిన, మనం గుర్తుపెట్టుకోవలసిన స్త్రీల చరిత్ర చిత్రణల సంకలనం. ప్రతి మనిషిదీ ఒక చక్కటి చిత్రం, ఆపై, తెలుగులోనూ, ఆంగ్లంలోనూ పరిచయాలూ. “రేపటి చరిత్రను నిర్మించే స్త్రీలకి” అని రాసారు మొదటి పేజీలో. అందరూ తప్పకుండా చదవదగ్గ పుస్తకం – ఆసక్తికరమైన ఎందరి గురించో తెలుస్తోంది నాకు. కనుక ఇపుడు ఇక్కడ తెలుసుకుంటున్న అందరి గురించీ, వన్లైనర్లు అన్నా రాసి పెట్టుకోవడానికి ఈ బ్లాగు టపాలు అనమాట… నా వాక్యాల్లో నేను రాసుకుంటున్నా కనుక కాపీరైట్లు గట్రా ఉల్లంఘించబడవు అనే అనుకుంటూన్నా. ఈ పుస్తకం మార్కెట్లో దొరకట్లేదేమో అని నా అనుమానం కనుక, ఇక్కడ ప్రస్తావించిన వారిపై ఎవరికన్నా ఆసక్తి కలిగితే, ఇంటర్నెట్లో వెదుక్కోవచ్చు.

1) కందుకూరి రాజ్యలక్ష్మి (1851-1910) : స్త్రీ విద్య, వితంతు వివాహం, సంఘసంస్కరణ కోసం కృషి చేసిన స్త్రీలలో మొదటివారు అని చెప్పవచ్చు. మైండులో కనెక్ట్ చేయడానికి మరొక్క విషయం : కందుకూరి వీరేశలింగం గారి ధర్మపత్ని.

2) సరోజినీ నాయుడు (1873-1949) : పరిచయం అక్కర్లేదేమో 🙂 “భారతకోకిల”, ప్రముఖ స్వతంత్ర సమరయోధురాలు.

3) భండారు అచ్చమాంబ (1874-1905) : తెలుగులో తొలి కథ, తొలిసారిగా స్త్రీల చరిత్రా రాసిన వారు. (అచ్చమాంబ గారి కథల గురించి అంతర్జాలంలో కొన్ని వ్యాసాలు ఉన్నవి. కథల పుస్తకం ఈ బ్లాగుటపా ద్వారా దిగుమతి చేసుకోవచ్చు. ఈ కథల గురించిన పరిచయం నిడదవోలు మాలతి గారి బ్లాగులో ఇక్కడ చదవొచ్చు. అచ్చమాంబ గారిపై కొండవీటి సత్యవతి గారు ప్రజాకళ.ఆర్గ్ పత్రికలో రాసిన వ్యాసం ఇక్కడ చదవవచ్చు.)

4) బెంగళూరు నాగరత్నము (1878-1952): కర్ణాటక సంగీతంలో పేరెన్నిక గన్న గాయని. 1905-34 మధ్య కాలంలో 1235 కచేరీలు చేశారట! తిరువాయూరులో త్యాగరాజు సామాధిని నిర్మించి, ఆయన కీర్తనల ప్రచారం కోసం ఒక గురుకులం కులం నిర్మించడానికి తన ఆస్తి యావత్తూ దానం చేశారు. ఆవిడ రచయిత్రి కూడానూ. (నాగరత్నమ్మ గారిపై ఈమాటలో వచ్చిన జెజ్జాల కృష్ణమోహనరావు గారి పరిచయ వ్యాసం ఇక్కడా, దానికి వచ్చిన వ్యాసానుబంధము ఇక్కడా చదవవచ్చు. “The Devadasi and the saint” పేరిట వచ్చిన ఆవిడ జీవిత చరిత్ర గురించి ఒక పరిచయం పుస్తకం.నెట్లో ఇక్కడ చదవవచ్చు.)

5) మార్గరెట్ కజిన్స్ (1878-1954) : ఈ ఐర్లండు వనిత కలిసి భారతదేశం వచ్చాక స్వాతంత్ర్యోద్యమంలో, మహిళోద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వాతంత్ర్యానంతరం స్త్రీ శిశు సంక్షేమంపై దృష్టి కేంద్రీకరించారు. కొన్ని పుస్తకాలు కూడా రాశారు.

6) దువ్వూరి సుబ్బమ్మ (1880-1964) : స్వాతంత్ర్య సమరయోధురాలు. ఖాదీ ప్రచారం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి పోరాటాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఖాదీ ఉద్యమంలో భాగంగా ఖద్దరు బట్టల మూటను నెత్తిన పెట్టుకుని ఊరూరా తిరిగి అమ్మేవారట! ఆమెని చూసి పోలీసులు కూడా భయపడేవారట! (తె.వికీ పేజీ ఇక్కడ)

7) ఉన్నవ లక్ష్మీబాయి (1882-1956) : సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధురాలు. శారదానికేతన్ అన్న గురుకుల పాఠశాలను ప్రారంభించి బాలికల ఉన్నతి కోసం కృషి చేశారు. గృహలక్ష్మీ స్వర్ణకంకణ గ్రహీత. మ్యాపింగ్: ఉన్నవ లక్ష్మీనారాయణ గారి భార్య.

8) సుగ్రా హుమయూన్ మీర్జా (1882-1958): కవయిత్రి, రచయిత్రి, పత్రికా సంపాదకురాలూ కూడా అయిన సుగ్రా హైదరాబాదు ప్రాంతంలో ముస్లిం స్త్రీల అభ్యున్నతికి విశేష కృషి చేశారు. అలాగే, తన రచనల్లో హిందూ-ముస్లిం ఐక్యతనూ, జాతీయ భావాలను, స్త్రీ అభ్యున్నతినీ ప్రచారం చేశారు. మదర్సా-ఎ-సఫాదారియా అన్న ఉర్దూ పాఠశాలను కూడా స్థాపించారు.

9) వింజమూరి వెంకటరత్నమ్మ (1888-1951) : తెలుగులో తొలినాటి మహిళా సంపాదకుల్లో ఒకరు. “అనసూయ” పత్రికను దాదాపు ముప్పై ఏళ్ళ పాటు నడిపారు. పత్రిక ద్వారా స్త్రీ జనోద్ధరణకు కృషి చేశారు. స్వాతంత్ర్యోద్యమం పట్ల కూడా ఆకర్షితులయ్యారు. 20,30 దశాబ్దాలలో ఏర్పడ్డ నవ్యసాహితీ సమితిలో ఏకైక మహిళా సభ్యురాలు వెంకటరత్నమ్మ గారేనట! జానపద సంగీతం ప్రచారానికి కూడా విశేష కృషి చేశారు.

10) అచంట రుక్మిణి (1891-1951): జాతీయోద్యమంలోనూ, పరిపాలన రంగంలోనూ, దేశీ వైద్య విద్యను అభివృద్ధి చేయడంలోనూ కృషి చేసారు. వీణ వాయించడంలో నేర్పరి కూడా!

… ఇవ్వాళ్టికి ఇక్కడ ఆపుతున్నా. నెమ్మదిగా అలా మిగితా వారి గురించి కూడా రెండు ముక్కలు రాసి పెట్టుకోవాలని నా కోరిక… చూడాలి కొనసాగితానో లేదో! అన్నట్లు, లాంకెలు – నాకు దొరికినవి, తెలిసినవి మాత్రం ఇచ్చాను. ఎవరెవరి ఆసక్తినీ, ఓపికనీ బట్టి తక్కిన లంకెలు వెదుక్కోగలరు! 🙂

Published in: on July 1, 2012 at 8:59 am  Comments (4)  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/07/01/mahilavaranam-1/trackback/

RSS feed for comments on this post.

4 CommentsLeave a comment

 1. manchi pusthakam manchi parichayam !!

 2. Very interesting sowmya. ఇక్కడ అడిలైడ్ లో కూడా ఒక కౌన్సిల్ లైబ్రరీలో చాలా మంచి తెలుగు పుస్తకాలు దొరుకుతాయి!
  I was very happily surprised.
  మీ పరిచయం చాలా ఆసక్తి కరంగా వుంది.

 3. chala chala………..chala vishayalu telisinai.chala bhagundi sirshika rachaiyathaku dhanyavadhlu

 4. thank u verymuch andi
  mahilavaranam preface was kept as a lesson in ssc text book.
  your work is verymuch helpful to telugu teachers in andhra who are familiar with internet


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: