గాలి భాష, మనసు భాషా…ప్రేమ భాషానూ!

నాలుగైదేళ్ళ క్రితం Mozhi అని ఒక తమిళ సినిమా వచ్చింది. అప్పట్లో నేనొక ఐదారు మంది తెలుగు వారికన్నా కూర్చోబెట్టి మూకీసినిమాల కాలంలో తెర పక్కనే ఉండి వ్యాఖ్యానం చేసేవాళ్ళలా సంభాషణలు వివరిస్తూ ఆ సినిమా చూపించి ఉంటాను. ఆ సినిమా పాటలు కూడా చాలా బాగుంటాయ్. అప్పట్లో కొంచెం కష్టపడి, కొంచెం తమిళ స్నేహితుల్ని వేధించీ రెండు మూడు పాటల అర్థాలు కూడా కనుక్కుని మరీ పదే పదే విన్నా. ఇవ్వాళ ఒక స్నేహితురాలు ఏదన్నా సినిమా సూచించమంటే ఇది చూడమన్నా. తనకి సబ్టైటిల్స్ తో దొరక్క విరమించుకుంది కానీ, నేను చూడ్డం మొదలుపెట్టా. అలాగ… ఇవ్వాళ సినిమా చూస్తూ… ఈ Kaatrin Mozhi పాట వినడం మొదలుపెట్టాను. అక్కడ ఆగిపోయి మళ్ళీ మళ్ళీ వింటున్నా. ఒక వాక్యం చాలాసార్లు రిపీట్ అవుతుంది పాటలో…దానర్థం ఇదీ –

ప్రకృతిలో ఉన్న భాషలను తెలుసుకో – మనుషుల భాషలతో పని ఉండదు
హృదయాల భాషలు తెలుసుకో – మనిషికి భాషతోనే పని ఉండదు

ఇప్పుడా పాట ఆసక్తిగలవారి చేత బలవంటంగా వినిపించేందుకే ఈ టపా.

తమిళ పాట – రాగా.కాం లో ఇక్కడ వినవచ్చు.
ఆంగ్ల లిపిలో సాహిత్యం, దానర్థం ఇక్కడ చదవవచ్చు.
యూ ట్యూబులో చూడాలంటే ఇక్కడ.

ఈ సినిమాని “మాటరాని మౌనమిది” పేరుతో తెలుగులోకి డబ్ చేసారట. తెలుగు సినిమాకి రాగా.కాం ఆడియో లంకె…ఇక్కడ. ఈ పాట తెలుగు వర్షన్ ఇక్కడ.

Published in: on May 21, 2012 at 7:38 pm  Comments (3)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/05/21/%e0%b0%97%e0%b0%be%e0%b0%b2%e0%b0%bf-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b7-%e0%b0%ae%e0%b0%a8%e0%b0%b8%e0%b1%81-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b7%e0%b0%be-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b1%87%e0%b0%ae-%e0%b0%ad/trackback/

RSS feed for comments on this post.

3 CommentsLeave a comment

  1. Thanks for this beautiful song:), ardham teliyaka poyina, chala nachhindi.. beautiful picturization… aa ammayi kevalam movements batti, swaram ardham chesuke prayatnam simply superb…
    have a beautiful day

  2. Thank you very much!! manchi saahityam unna paatani parichayam chesaaru. Thank you!!!

  3. చక్కని పాట పరిచయం చేశావ్. Thanks.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: