వచ్చాడు నా రాజు…ఒక ఫ్రెండు రప్పిస్తే!

(మంచాయన మహాప్రసంగం గోలలో ఇది కొట్టుకుపోయింది అప్పట్లో. మళ్ళీ ఇవ్వాళ తారసపడడంతో పోస్టుతున్నా… )

నాకు మా మంచమ్మాయ్ అంటే ఎంత ప్రేమతో కూడిన అభిమానం వల్ల వచ్చిన గౌరవమో ఈ టపా చదివేవారిలో కొంతమందికైనా తెలిసే ఉంటుంది. “ప్రేమతో మీ లక్ష్మి” కొట్టు కట్టేశారని తెలిసిన రోజు నా హృదయం మూగగా ఎంతసేపు రోదించిందో నేను ఎవ్వరికీ చెప్పుకోలేదు. అటుపిమ్మట ఎంతో మంది గొప్ప గొప్ప మహా వీర నటులనూ, యాంకర్లనూ చూసినప్పటికీ, ఏమిటో అసంతృప్తి. చాన్నాళ్ళకి, పవిత్ర శుక్రవార వారాంతం కోసమని చెప్పి వచ్చిన ఒక స్నేహితురాలు నాకు ఒక దారి చూపించింది. మంచమ్మాయ్ లేకుంటేనేం? కాస్తో కూస్తో ఆవిడ తమ్ముడు కావడం అన్న ఒకే ఒక్క క్వాలిఫికేషన్ చాలదా – విష్ణు బాబును చూస్తూ నీ బాధ కొంచెం దిగమింగడానికి? అని – అంటే, ఇంత పొడుగ్గా మాట్లాడకపోయినా, “వస్తాడు నా రాజు” సినిమా చూపించింది. పైగా, దీనిలో విష్ణుబాబుకి కాస్టూంస్ రూపకల్పన మంచమ్మాయ్ వాళ్ళ ఇలవేల్పు విన్నీ అని చెప్పింది. ఇదివరలో విన్నీ అంటే మంచమ్మాయ్ కీ వాళ్ళ కుటుంబ సభ్యులకీ ఎంత గౌరవమూ, భక్తీ ఉన్నాయో మాటల్లోనే కాక కవిత్వంలో కూడా చూసి ఉన్నాను కనుక, ఈ రెండు కారణాలు చాల్లే అనేసి సినిమా చూసేసాను.

వీరి ఆస్థాన నటి తాప్సి కూడా ఉన్నదాయె! ఆ అమ్మాయెవరు? అని నా ఫ్రెండును అడిగాక, నేనెంత సిగ్గుపడిపోయానో చెప్పలేను. ఆ సిగ్గుతో కృంగి కృశించి వంగి వడియమై మళ్ళీ మామూలవ్వడానికి ఇన్నాళ్ళు పట్టింది.ఇంతకీ, నేనేం అభిమానిని, కుటుంబ ఆస్థాన నటుల్ని కూడా గుర్తుపట్టలేకపోతే? అన్న సిగ్గు అది. అలాగే, నా ఫ్రెండు ప్రసాదించిన జ్ఞాన గుళికల వల్ల, నేనెంత అజ్ఞాన అభిమానినో కూడా బాగా అర్థమైంది. ఒకరిని అభిమానిస్తే సరిపోదు – వాళ్ళ జీవితంలో ముఖ్య భూమిక పోషించే వారి గురించి, వాళ్ళ వాళ్ళ గురించి, వాళ్ళ వాళ్ళ వాళ్ళ గురించీ, వాళ్ళ వాళ్ళ వాళ్ళ వాళ్ళ గురించీ కూడా తెలుసుకోవాలి, అని అప్పుడే దృఢంగా అనిపించింది.

ఇంతకీ, ఏమైనప్పటికినిన్నీ, బాబు చాలా కష్టపడ్డాడు. మాటల్లోనే కాదు, చేతల్లో కూడా అది బాగా కనబడ్డది. కొంతమంది పావలాకి రూపాయ నటన కూడా చేశారు కానీ, వాళ్ళ ప్రస్తావన ఇక్కడ అనవసరం – వాళ్ళు మంచమ్మాయ్, ఆవిడ ఫ్యామిలీ కానంత వరకూ వాళ్ళేం చేసుకున్నా నాకు అనవసరం కదా! అయినా, ఇప్పట్లో అన్నీ ఇలాగే ఉన్నాయి కదా, విష్ణు బాబుని చూస్తె, కనీసం నాకు ఏదో మనవాళ్ళ సినిమా చూసాం అన్న తృప్తి అయినా మిగుల్తుంది. ఏ రవితేజదో, ధర్మతేజదో చూస్తే కనీసం ఆ ఫీలింగ్ అన్నా కలగదు కదా!

ఇంతకీ, నాకు చూపించాలన్న తపత్రేయంలో రెండోసారి రాజుని తన ముందుకి రప్పించిన ఈ సదరు ఫ్రెండు ఎవరో ఈపాటికి మా ఉమ్మడి పరిచయస్థులకి అర్థం అయ్యే ఉండొచ్చు. నా జీవితంలోకి వసంతాగమనంతో పాటు మంచు కూడా వచ్చే అదృష్టం పట్టడానికి కారణం అయిన సదరు స్నేహితురాలికి ఈ టపా అంకితం. అలాగే, ఈ సినిమాని రెండు సార్లు చూడ్డం వల్ల తనలో దాగి ఉన్న అభిమానిని బయటకు తెచ్చి తనకి తెలియజేసిన అదృష్టం నాకు పట్టడం నా అదృష్టం. ఇలాగ, తమకి తెలియకుండానే అభిమానులని చేసేయడం మంచమ్మాయ్ నుంచే అబ్బిందనుకుంటా విష్ణుబాబుకి!

Published in: on May 11, 2012 at 2:24 pm  Comments (8)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/05/11/vacchaadu-na-raju/trackback/

RSS feed for comments on this post.

8 CommentsLeave a comment

  1. బాబోయ్…… ఆ సినిమా చూశారా???????????????? ఇంకా బతికే ఉన్నారా??????????? బతికి రివ్యూ కూడా రాశారా????????? నిజం చెప్పండి.. మీరు గ్రహంతారవాసి కదూ?……

    • :)) మీరు నన్నే ఇలా అంటే మరి నాకు ఇది రికమెండ్ చేసి కూర్చోబెట్టి చూపించిన వారు గ్రహాంతర వాసుల గురువుల జాతి అన్నట్లా?😉

  2. DISLIKE for your above comment x-(

    • :-)) అంతేనమ్మా..కలికాలం, కలి వ్యాఖ్యాతలు. నిజం చేదు, నిప్పు, అదో జిడ్డు..మన కాలం గడ్డు, ఏం చేస్తాం.

  3. Watch Saleem

  4. మీ మంచమ్మాయి అభిమానాన్ని చాలా రోజులనుండే చూస్తున్నాను.🙂

    మీ అభిమానాన్ని గుర్తించి, మీకు సంతోషం కలిగించడానికి ప్రయత్నం చేసిన మీ స్నేహితురాలి మనసు ఎంత మధురం!!!
    మా ఇంట్లోనూ ఉన్నారు మంచమ్మాయికి ఒక వీరాభిమాని.

  5. “ఆ సిగ్గుతో కృంగి కృశించి వంగి వడియమై” —🙂

  6. భలే రాసారు, మీ కోసం ఇంకో వీడియో: http://www.whosay.com/lakshmimanchu/videos/166562


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: