“క్షణక్షణముల్ జవరాండ్ర చిత్తముల్”

“క్షణక్షణముల్…” అని చుక్కలు పెట్టేసి వార్తల్లో బానే వాడతారు. “…జవరాల చిత్తముల్” వరకూ కొన్ని కథల్లో వాటిల్లో వాడతారు. ఇన్నాల్టికి మూలపద్యం చదివాను 🙂 ఇలాంటి పద్యాలు ఎవరన్నా ఆడ కవయిత్రులు మగవారిపై రాసి ఉంటె ఎంత బాగుండేదో! 😉 కానీ, నేను చాలా-అతి మంచిదాన్ని కనుక, అబ్బాయిల సౌకర్యార్థం, ఇది కూడా పంచుకుంటున్నాను. మళ్ళీ “మనుచరిత్రలో మణిపూసలు” పుస్తకం నుంచి తీస్కున్న “మనుచరిత్ర” పద్యమే. మొత్తానికి నాకు ఈ మనుచరిత్ర కథ అంతగా నచ్చలేదు కానీ, ఇలాగ మధ్య మధ్యలో కొన్ని పద్యాలు మాత్రం బాగున్నాయి. ఎప్పుడో, నా తెలుగు బాగుపడ్డప్పుడు మణిపూసలు దాటి ముందుకు వెళతాను ఏమో.

ఒక్కకవేళ- పద్మముఖు లొల్లమి సేయుదు, రొక్క వేళ-పెన్
మక్కువ నాదరింతురు; క్షణక్షణముల్ జవరాండ్ర చిత్తముల్,-
పక్కున వేసరన్ చన, దుపాయములన్-తగు నచ్చకంబులన్-
చిక్కగ చేసి, డాసి, సతి చిత్తము-పట్టి, సుఖింపగా-తగున్.

ఎంత తెలుగురాని తెలుగు వారైనా… ఈ పద్యం అర్థం చేసేస్కుని ఉండొచ్చు అని నా అనుమానం. అయినా…ఇంతకీ అల్లసాని పెద్దన వారు వరూధినిని ఆకర్షించాలని ప్రయత్నిస్తున్న ఒక గంధర్వుడి స్వగతంలా చెప్పిన ఈ పద్యానికి అర్థం:
– ఒక్కొక్కసారి ఛీకొడతారు, ఒక్కొక్కసారి ప్రేమతో ఆదరిస్తారు – ఈ ఆడవాళ్ళ మనసులు క్షణక్షణానికీ మారుతూ ఉంటాయి. అలాగని ఊరికే ఫ్రస్ట్రేట్ అయిపోక, తెలివిగా మాటలు కలిపి, దగ్గరకు చేరి, వారిని ఆకర్షించాలి అని ఉపదేశం అనమాట.

ఇది ఒక అబ్బాయికి చెప్పగానే తక్షణ స్పందన – “టైంలెస్ క్లాసిక్!!” అని. 😛 😛

Advertisements
Published in: on May 9, 2012 at 8:38 am  Comments (2)  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/05/09/javarandrachittamul-manucharitra/trackback/

RSS feed for comments on this post.

2 CommentsLeave a comment

  1. thanks for sharing

  2. “ఎంత తెలుగురాని తెలుగు వారైనా… ఈ పద్యం అర్థం చేసేస్కుని ఉండొచ్చు అని నా అనుమానం”

    Cha!


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: