ఉల్మ్ చర్చి పైన్నుంచి ప్రపంచం ;)

కొన్ని వారాల క్రితం, నేను మా ఊరికి దగ్గర్లో ఉన్న ఉల్మ్ నగరానికి వెళ్ళాను. నా మట్టుకు నాకు అది ఐన్స్టీన్ పుట్టిన నగరంగా మాత్రమే తెలుసు కానీ, ఇక్కడికి (జర్మనీకి) వచ్చాక తెలిసింది ఏమిటంటే, ఉల్మ్ చర్చి ప్రపంచంలోకెల్లా ఎత్తైన చర్చి అని. ఇంతకీ, చర్చి గోపురం ఎత్తు 530 అడుగులు. దాని దగ్గరికి వెళ్ళడానికి 768 మెట్లు. ఇందులో మనల్ని 469 అడుగుల దాకా ఎక్కడానికి అనుమతిస్తారు (లిఫ్టు లేదు…కనీసం నాకు కనబడలేదు). విషయం ఏమిటయ్యా అంటే, మెలికలు తిరిగే మెట్లు రెండు మూడు అంతస్థులు ఎక్కడానికే కళ్ళు తిరిగినట్లు అవుతుంది నాకు. కానీ, ఈ ఆరేడొందల మెట్లూ ఎక్కి, కళ్ళుతిరక్కుండా దిగేసా! అప్పట్నుంచి అనుకుంటే ఇప్పటికి రాస్తున్నా అన్నమాట వివరం 🙂
(అప్పట్నుంచీ ఫొటోలేవీ? అని అడుగుతున్న వారందరికీ ఈ టపా అంకితం 😉 😉 )

ఉల్మ్ చర్చి ఇరవయ్యవ శతాబ్దికి పూర్వమే నిర్మితమైన వాటిల్లో అతి పొడవైన వాటిల్లో ఒకటిట. చర్చిగా ఇంత పెద్దది ఇంకోటి లేదట ప్రపంచంలో. నేను వెళ్ళేనాటికి ఇంకా వసంతాగమనం కాలేదు కనుక, పదకొండైనా కూడా ఇంకా పొగమంచు అలాగే ఉండింది. కనుక, నేరుగా దాని ముందొచ్చి నిలబడేదాకా నాకు రోడ్డు మీద నుంచి మసగ్గా మాత్రమే కనబడుతూ ఉండింది.

ఎదురుగ్గా నిలబడ్డాక కూడా, ఇంకా పొగమంచుల్లో దోబూచులాట కొనసాగింది. ఎక్కాలా? వద్దా? అని ఎంతసేపు ఆలోచించినా ఏమీ తేల్చలేకపోయాను. Freiburg వెళ్ళినప్పుడు ఎక్కలేక చతికిలబడ్డ సంగతి గుర్తొచ్చి భయపడ్డా కూడా.

చివరికి ఎలాగైతేనేం, పైకెళ్ళి కిందెలా ఉంటుందో చూడాలన్న తాపత్రేయం ఆపుకోలేకపోయాను. అందునా, వోల్గా నది తరువాత ఐరోపా ఖండంలో రెండవ అతి పెద్ద నది అయిన డాన్యూబె (Danube) నది తీరన ఉందీ ఊరు. అది ఇక్కడ నుండి ఉక్రెయిన్ దాకా ప్రవహిస్తుందన్న విషయం ఊహించుకుంటేనే నాకు గుండె దడ పుట్టేసింది 😉 అలాంటి నదిని పైకెక్కి చూస్తే నా సామి రంగా… అని మనసు వెర్రి ఉత్సాహాన్ని ప్రదర్శించడంతో తప్పలేదిక ఎక్కడం. నిజానికి నేను ఇక్కడివారితో పోలిస్తే కష్టపడి ఎక్కినట్లే లెక్క కానీ, ఆ సమయంలో నాకు బాగా పైకి వెళ్ళాక కానీ దార్లో ఎవరూ కనబళ్ళేదు. ముప్పావు గంటేమో పట్టినట్లు ఉంది ఎక్కేందుకు. కొంతసేపు ఎక్కాక, కిందకి తొంగిచూస్తే, ఇదిగో, పక్కనే ఉన్న రెండు చర్చి స్తంబాలు నేనున్న ఎత్తుకి సమాంతరంగా కనబడ్డాయ్ .. మనసు శాంతించింది.. చర్చి ఎత్తుకు ఎదిగినందుకు 😉

సరే, వీటి సంగతి అటుపెడితే, రెండు వింత ఆకారపు బొమ్మలు మాత్రం చాలా ఆసక్తి కరంగా అనిపించాయి.

ఈ రెండోది మాత్రం Dragon Gargoyle బొమ్మ అని ఇంటర్నెట్లో వెదికితే తెలిసింది.
పైదాకా ఎక్కేసాక, చివరి అంకం ఎక్కడానికి ఇప్పటిదాకా ఉన్నదానికంటే ఇరుకైన మెట్లున్నాయి. అందులో కాస్త లావుగా ఉంటే ఒక్క మనిషి వెళ్ళడం కూడా కష్టమే. అవి కూడా ఎక్కేసి,ఇంక మనుల్షుల్ని ఎక్కనివ్వరు అని తేలేంత దాకా ఎక్కి, కిందై చూస్తే ఏముందీ? ఈ పొగమంచు అలాగే కొనసాగుతోంది కనుక, నేనూహించినంత అపురూప దృశ్యం కనబడలేదు నాకు 😦

సరే, ఎక్కాక దిగడం అంత ఈజీ పని ఉండదు కనుక, కాసేపు అలా ఆ మసగ వెలుగుల్లోనే కిందకి చూస్తూ ఆనందించి, మధ్యలో ఇంతసేపైనా ఒక్కళ్ళూ పైకి రారేంటీ? అని భయపడి 😉 మొత్తానికి కిందకి దిగేసా.

అటు పిమ్మట Museum of bread culture అని ఒకదానికి వెళ్ళా. బ్రెడ్ చరిత్రా, బేకింగ్ చరిత్రా…గురించి నిర్మితమైన మ్యూజియం ఇది. మ్యూజియంలో చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నవి కానీ, ఆసక్తికరంగా ప్రెజెంట్ చేయలేదు అనిపించింది నాకైతే. అలాగ, ఊర్లో ఇతరత్రా చూడదగ్గ ప్రదేశాలు రౌండేసి, నదీ తీరాన కాసేపు నడిచి, ఐన్స్టీన్ ఇంటిని మాత్రం కన్వీనియంట్ గా మిస్సయి, ట్రెయిన్ ఎక్కాక అర్థమైంది. నేను రెండు ట్రెయిన్లు మారినా మా ఊరికి రెండుగంటల్లో చేరుకుంటా కానీ, ఈ ట్రెయిన్లో నేరుగా మా ఊళ్ళోనే దిగే సౌకర్యం ఉన్నప్పటికీ మూడున్నర గంటల ప్రయాణం అని! ఈ ఏడాది కాలంలో ఎన్నడూ చూడని పల్లెలూ అవీ చూసుకుంటూ, ప్రతి పది నిముషాలకీ ఏదో ఒక స్టేషన్లో ఆగుకుంటూ, ఏదో ఒకలా డస్సిపోయి ఇల్లు చేరుకున్నా ఆఖరుకి ఆరోజు!

Advertisements
Published in: on April 21, 2012 at 1:32 pm  Comments (3)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/04/21/ulmmunster/trackback/

RSS feed for comments on this post.

3 CommentsLeave a comment

  1. బాగుందండి చర్చి ,అలాగే మీ వర్ణన .

  2. పొగమంచులో బొమ్మలు నాకు చాలా చాలా అందంగా కనబడతాయి. అన్ని మెట్లు ఎక్కేవంటే ఆశ్చర్యంగానే ఉంది నాకు. :))

  3. […] వ్యూ ఉంది. ఏమైనా ఇప్పటిదాకా అయితే Ulm చర్చి ని మించి నన్నేదీ ఆకట్టుకోలేదు ఈ వ్యూ […]


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: