మంచాయన మహాప్రసంగం – 2

నిన్న ఏదో ఆవేశంలో మంచాయన మాట్లాడగానే నేను వచ్చి బ్లాగేసా కానీ, తదుపరి చూసిన వీడియో క్లిప్పింగులూ, జరిగిన సంగతులు, ఆపై, మంచాయన నా మదిలో మెదిలి వెళ్లబోసుకున్న ఆత్మఘోష, మంచమ్మాయి నా అద్దంలో కనబడి చేసిన హితోపదేశమూ – ఇదంతా కలిపి,నాచేత ఆ మహాప్రసంగం గురించి మరొక్కసారి పునఃపరిశీలన చేయిస్తున్నాయి. ఏమైనానూ, అన్నివైపుల నుండీ విమర్శలు కలెక్ట్ చేస్కునే కింగులు అంటే నాకు మహా వల్లమాలిన జాలి ఉండడం వల్ల కూడానూ, ఈ ప్రస్తావన తెచ్చి క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వస్తోంది. ముందు నేను కేవలం మంచమ్మాయి ని తీర్చిదిద్దిన వ్యక్తిగా మాత్రమే ఈయన్ని గౌరవించినా, ఈ ఉదంతం..దాని తరువాత పైన అన్న ఆత్మఘోషా, అద్దోపదేశమూ (అద్దం నుండి వచ్చిన ఉపదేశము) కలిపి ఈయన తరపున వకాల్తా పుచ్చుకునేలా చేస్తున్నాయి నన్ను:

ఇప్పుడూ, మంచాయన ఎందుకండీ లేజెండూ?
౧) ఎన్టీఆర్ తర్వాత నేనే అని ఈయన చెప్పి ఎన్టీఆర్ కి ఆ టాప్ పొజిషన్ ఇయ్యబట్టీ సరిపోయింది కానీ, లేకుంటే ఎన్టీఆర్ ఎక్కడ?? ఎక్కడున్డేవాడు? టెల్ మీ ఐ సే!
౨) ఎఎన్నార్ ని అన్నా, తన తరువాత మాత్రమే ఆయన అని చెప్పబట్టి ఏయన్నార్ అంటే ఎవరో ప్రపంచానికి తెలిసింది కానీ, లేకుంటే ఏయన్నార్ పరిస్థితి ఏమిటి? టెల్ మీ ఐ సే!
౩) ఈయనలా చేతి వేళ్ళు తిప్పుతూ, కనుబొమ్మలెగరేస్తూ మాట్లాడ్డం ఏసీపీ ప్రద్యుమ్న ఇంకా బా చేస్తాడు. కానీ, ప్రద్యుమ్న ఎంతమందికి తెలుసు? మంచాయన ఎంత మందికి తెలుసు? దటీజ్ లెజెండ్రీ.
౪) మంచాయన లేకపోతే మన విద్యావ్యవస్థ అంతా భ్రష్టు పట్టిపోయేది అని మంచంమాయ్ ఊరూ వాడా దండోరా వేసినా ఒక్కరైనా పట్టించుకున్నారూ? అది ఎంత లెజెండ్రీ పనో తెలీదూ? (అప్పుడే పట్టించుకుని ఉంటె, తన గురించి తాను మళ్ళీ మళ్ళీ ఇలా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చేదా?? అని అడుగుతున్నాను అధ్యక్షా!)
౫) అవతలి వాళ్ళు మనలని గుర్తించకపోతే మనం వాళ్ళు మనల్ని గుర్తించేలా చేసుకోవాలి…అన్న వ్యక్తిత్వ వికాస సూత్రాన్ని ఇవ్విధముగా ఏళ్లతరబడి విసుగూ విరామం లేకుండా పాటిస్తున్న కమిట్మెంట్ ఎంత మందికి ఉందండీ? లెజెండ్రీ కదూ!
౬) మంచంమాయ్ చాలాసార్లు అన్నట్లు – భూప్రపంచికంలో గాని, మరి, దేవలోకంలో గాని, పాతాళంలో గాని, ఏడు కాదు…పద్నాలుగు కాదు…వెయ్యి లోకల్ల్లో కాని…ఇంత క్రమశిక్షణ గల వారు ఉన్నారా అని? అది లెజెండ్రీ కాదా??
(ఇంతకీ, ఈయన సెలెబ్రిటీ అవ్వడానికి కూడా ఇవే కారణాలు. లెజెండ్ ఉన్న చోట మార్చుకు చదువుకోండి!)
-ఇంత గొప్ప విద్యావేత్తను, మహానటుడిని, కళామతండ్రినీ, శ్రమజీవిని, పట్టుకుని అందరూ ఇప్పుడు విమర్శించడం ఏమన్నా బాగుందీ?

మంచాయన ఎందుకండీ అలా మాట్లాడాడూ?
౧) ఇందాక అన్నట్లు, వ్యక్తిత్వ వికాస సూత్రాలు ఫాలో అవుతున్నాడు. అంతే. ఇదే ఎవడో వ్యక్తిత్వ వికాస గురువుగారూ గొంతు చిన్చుకునో, కాగితాలని కరాబు చేసో చెబితే మాత్రం మెచ్చుకుంటాం. ఆచరణలో చూపిస్తే తుచ్చులంటే ఎలా??
౨) మంచాయన భోళా మనిషి అని ఆర్కే లాంటి కొందరైనా అనుకోవాలంటే ఇలా మాట్లాడక తప్పదు మరి. ఇదే భోళాతనం అని కొందరు అనుకుంటే, ఆ కొందరికోసం తప్పదుగా..ఏకొందరినో అయినా మన పక్క ఉంచుకోవాలి అంటే?
౩) అయన ఎంతమందిని తన ప్రతిభతో ఆకర్షించాడో మీకెలా తెలుస్తున్దండీ ఆయన చెప్పకపోతే మరి?? అన్నపూర్ణమ్మ గారు ఏమనుకున్నారో ఇప్పుడు మనకి తెలిసే అవకాశం ఉందా? లేదు. మరి అది అయన మనకి కల్పించి మనకా అదృష్టం కలిగించాడా లేదా? ఎందుకండీ మరి ఆడిపోసుకోవడం? మనకి లేని అవకాశాలు ఎంతో శ్రమ తీసుకుని గుర్తు చేసుకుని మరీ మనకి కల్పిస్తూ ఉంటే??
౪) పోతే… ఇదంతా జాతి జనోద్దరణ కోసం చేస్తున్న కృషిలో భాగం. ఏమిటీ? అంటారా? అదే …ఎవరికన్నా పక్కన ఇలాగ మధురవాక్యాలు పలికేవారు ఉంటే, వారి స్పందనలు బట్టి వారి హుందాతనం బయటపడుతుంది. అలాగా అవతలి వారిని ఎలివేట్ చేయడం కోసం ఆయన ఇలా చేస్తున్నాడే కానీ… మరొక కారణం వల్ల కాదు. ఇంత గొప్ప లోకకళ్యానుడినా అందరూ అపార్థం చేస్కుని విమర్శించేది? కళ్లుపోతాయ్!

…అలాగా చెప్పుకుంటే ఎన్ని కారణాలైన చెప్పి డిఫెండ్ చేయొచ్చు మా మంచాయన ని. ఆ ఒక్కొక్క కారణమూ ఒక్కొక్క పూవై మీ మనసులో మంచుపూలవాన కురుస్తుంది అప్పుడు.
అయినా, అసలిదంతా ఎందుకు? మా మంచాయనకి సవాలక్ష కారణాలండీ ఇలా బజార్న పడ్డానికి. కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు అంటే ఎం చెబుతాం? అలాగే మా మంచాయనకి కూడా. అయన పిచ్చి మనసును ఆయన్ని తిట్టేవాళ్ళు ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. ఏయన్నార్ అర్థం చేస్కున్నారు అని ఆయన స్పందనే చెప్పింది. మేము మంచంమాయి ద్వారా ఏర్పడ్డ కుటుంబ అభిమానులం కనుక, ఒక కుటుంబం లాగ. కొట్టుకుంటాం తిట్టుకుంటాం కలిసిపోతాం. కానీ, బయటి వాళ్ళు ఎమన్నా అంటే ఊరుకుంటామా? వెనకేసుకురామూ?? మాది కిందపడినా పైచేయి అనం మేము. కిందపడితే కింద నుంచి చూస్తె మాదే పైచేయి అవుతుంది అంతే. మా మంచాయన ఇప్పుడు “En Folkefiende“లో హీరో మాదిరి అనమాట మా అభిమాన జనులకి.

Advertisements
Published in: on April 10, 2012 at 12:30 pm  Comments (2)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/04/10/manchayana-2/trackback/

RSS feed for comments on this post.

2 CommentsLeave a comment

  1. soumya garu, curiosity perigi perigi, vamanamurty laga ayyipondi, enduka prasangam? ema katha? ye sandharbham lo nidi? manchammayi enduku ledu?
    denikade cheppukovali, mee manchu durabhimanamunaku eevve naa joharllu.. diniki veerataadu veskundi!!!!!

  2. 🙂


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: