మంచాయన మహాప్రసంగం

మరేమో నాగేశ్రావ్ గారి ప్లాటినం జూబిలీ వీడియోలు చూస్తూ, అయన అందులో పరమ యాక్టివ్ గా కనబడడం చూసి ఆయన్ని ఫిట్నెస్ విషయంలో ఆదర్శంగా తీస్కోవాలీ…అని నేను అనుకునేసి, తక్కిన వాళ్లకి ఆ ఆలోచన అంటించేసి… చూస్తూ ఉన్నానా, మొదట్నుంచీ చూస్తున్నా…. మంచాయన ఏమిటో మొహం పరమ సీరియస్ గా పెట్టుకుని కూర్చొని ఉన్నాడు. మా మంచమ్మాయి తండ్రిగా పెద్దాయన నాకు మంచాయన అయిపోయాడు లెండి.

అక్కడ అందరూ ఏదో ఉన్నంతలో నవ్వుతూనే ఉన్నారు. ఒక్కొక్కళ్ళు చాల కష్టపడి మాట్లాడడం… ఇవన్నీ సాగుతూ ఉన్నాయి. ఆ సందర్భంలోనే తేట తెలుగు మాధుర్యాన్ని తన అద్భుతమైన ఉచ్చారణతో నాకు మొదటిసారి రుచి కూడా చూపించారు మన న.కి.కు. గారు. ఇలాగ అంతా జరుగుతున్నా కూడా, మంచాయన మొహం చూస్తె నాకు ఏకకాలంలో కోపం, చిరాకు, జాలీ…అన్నీ కలెక్ట్ అయ్యి, కింగ్ ఏదో తేల్చుకోలేకపోయాను. ఇంతలో, ఆయన మాట్లాడ్డం మొదలైంది. కెవ్వు! ఎంతైనా, ఆయన లేజేండో, సేలేబ్రిటీనో, టామో, జెర్రీనో ఏదో తెలీదు కానీ, చెవుల తుప్పు వదలగొట్టాడు. మంచు-వాయగొట్టాడు…సార్థక నామధేయుడు అనిపించుకున్నాడు.నా మాటలు ఎందుగ్గానీ, యూట్యూబులో ఉంది వీడియో..చూడండి.

విషయం ఏమిటంటే –
ఇప్పుడు గానీ మా భానుమతి గారు ఉండి ఉంటే, మంచాయనని దులిపెద మంచోడో! అనేసి దులిపేసి, బాగా సాఫుగా కడిగిపారేసి ఉండేది. అప్పుడు టక్కుమని మంచమ్మాయి వచ్చి మంచి టర్కీ టవలుతో కడగబడ్డ వాళ్ళ నాన్న కన్నీళ్ళూ, కాళ్ళూ తుడిచి, పాదధూళి తలపైన చల్లుకుని, తక్కిన పార్టులు ఆరెందుకు ఫ్యాను వేసి, ఎన్టీయార్ తరువాత అంత డైలాగులు చెప్పగలిగే ఏకైక వ్యక్తీ అని అన్నపూర్ణ గారు పొగిడేసారూ అని ప్రస్తుతం ప్రచారం చేయబడ్డ వార్తని అనుసరించి సదరు డైలాగ్ డెలివరీ అనుకరించే ప్రయత్నం చేస్తూ, సాంత్వన వాక్యాలు పలికేదేమో!!

అన్నట్లు, ఈ మంచమ్మాయి లేని లోటును వీళ్ళంతా ఇతోధికంగా తీరుస్తున్నారు నాకు. నా జీవితంలో పలు దినాలు చేస్తున్నారు. పవిత్ర శుక్రవారం తర్వాత వచ్చిన శనివారం కాస్త మంచ్సనివారం అయ్యిన్దిక్కడ. ఎందుకంటే, నా కరువు చూడలేని నా స్నేహితురాలు “వస్తాడు నా రాజు” చూపించి విశ్నుబాబు కి నన్ను అభిమానిని చేయడమే కాక, తానూ రెండోసారి చూసి తనలో పైకి ఇన్నాళ్ళూ కనబడని అభిమానం ఇక్కడే కనిపెట్టుకుని, వాళ్ళూరు వెళ్ళిపోయింది 😉

Advertisements
Published in: on April 9, 2012 at 8:57 pm  Comments (8)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/04/09/peruloemundi/trackback/

RSS feed for comments on this post.

8 CommentsLeave a comment

 1. నేనిక్కడ లేను.. 😛

 2. నిన్న జరిగిన ప్రోగ్రామేనా? సాఫ్ట్ వరు కంపనీలో ప్రాజెక్ట్ లాగా ఏ మాత్రం coordination కు తావివ్వకుండా చక్కగా నిర్వహించారు. మంచమ్మాయి ఈ ఏంగిల్ ను కూడా తనలో కలుపుకుంటే ఆమెకు తిరుగుండదు.

  • అవునండీ…అదే!

 3. >>ఇప్పుడు గానీ మా భానుమతి గారు ఉండి ఉంటే, మంచాయనని దులిపెద మంచోడో! అనేసి దులిపేసి, బాగా సాఫుగా కడిగిపారేసి ఉండేది. అప్పుడు టక్కుమని మంచమ్మాయి వచ్చి మంచి టర్కీ టవలుతో కడగబడ్డ వాళ్ళ నాన్న కన్నీళ్ళూ, కాళ్ళూ తుడిచి, పాదధూళి తలపైన చల్లుకుని, తక్కిన పార్టులు ఆరెందుకు ఫ్యాను వేసి, ఎన్టీయార్ తరువాత అంత డైలాగులు చెప్పగలిగే ఏకైక వ్యక్తీ అని అన్నపూర్ణ గారు పొగిడేసారూ అని ప్రస్తుతం ప్రచారం చేయబడ్డ వార్తని అనుసరించి సదరు డైలాగ్ డెలివరీ అనుకరించే ప్రయత్నం చేస్తూ, సాంత్వన వాక్యాలు పలికేదేమో!!<<

  నాకీ పేరా బానచ్చింది….ఆయన గారి స్పీచ్ విన్నాక నాకెలా అనిపించిందంటే

  ఏ రెండు వాక్యలకూ పొంతన లేకుండా భలే మాట్లాడాడు :))

  న.కి.కు. కౌను???

  • అయ్యో! మన ము.మంత్రండీ!

 4. Haha 🙂 Mee manchu durabhimaanam pogottukunnaru kaadu!! 😉

  Mee Gamanika/Notice: naku baga nahcindandi 🙂

 5. అకటకటా.. ఇంత గొప్ప విషయం నా దృష్టిన పడకుండా ఎలా తప్పించుకుపోయిందబ్బా.. :O

  మీకు నా మంచుదురభిమానాభినందనలు. 😉
  యూట్యూబ్లో నా అదృష్టం పరీక్షించుకుని వచ్చి మలిభాగం చదివెద. 😀

 6. ఆ వీడియో కాస్త ఇక్కడ ఇద్దురూ.. దీనికోసరం వెతుకుతోంటే వజ్రోత్సవం స్పీచీ చూసి ఒక లెజెండరీ వాక్యం నేర్చేసుకున్నాను.
  Film industry is not for onebody


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: