నా Osterhasen కథ

ఇవ్వాళ మా మెస్సులో లంచ్ తో పాటు, కుందేలు ఆకారం చాక్లెట్లు కూడా ఇచ్చారు. ఒస్టర్హాసెన్ అనబడు ఈస్తర్ కుందేళ్ళు. అందరికీ చేరోకటే ఇచ్చారు కానీ, మా దగ్గర ఆల్రెడీ ఇంకోళ్ళు ఇచ్చినవి కూడా ఉన్నాయి అని నా కొలీగ్స్ ఇద్దరు నాకిచ్చేసారు – నేను మొదటి దాన్ని చూసి మురిసిపోతూ ఉంటే 😉 (అదీ తెలివంటే. ఒకే దెబ్బకి మూడు కుందేళ్ళు…హీహీహీ). ఇదిగో, ఇలా ఉన్నాయండీ అవి:

సరే, వాటిని చూడగానే, ఎప్పట్లాగే నాకు క్రియేటివిటీ పొంగి, పొర్లి – వాటి చుట్టూ ఒక కథ అల్లడం మొదలుపెట్టా. అక్కడ రెండు మగ, ఒక ఆడ కుందేలు ఉండడం వల్ల లవ్ స్టోరీ, Darr సినిమా రేంజిలో చెప్పడం మొదలుపెట్టా. అలాగే, కాసేపు మేము తింటూ ఉంటే వాటికీ ఇవ్వట్లేదని దిష్టిపెడతాయి అని చెప్పి వెనక్కి తిప్పడమూ … ఇలా ఏవో మా పాటికి మేము చేసుకుని నవ్వుకుంటూ ఉన్నాం (నాన్సెన్స్ ని నాన్సెన్స్! అనుకోకుండా… నాన్సెన్స్ ..:-)! అని సరదాగా తీసుకునే కొలీగ్స్ ఎక్కడికెళ్ళినా దొరకడం నా అదృష్టం అనే చెప్పాలి.). ఇంతలో మా సెక్రెటరీ వచ్చింది. ఆవిడ అందర్లోకీ పెద్దావిడ..మనవళ్ళు గట్రా కూడా ఉన్నారన్నమాట. ఆవిడకి ఏమిటో మేమిలా బొమ్మలతో ఆడుకోవడం నచ్చలేదు. కాసేపు “ఎందుకు వాటి పిచ్చి పట్టుకుంది నీకు?” అదీ ఇదీ అన్నా కూడా, చివరికి అందరం వీటి గురించి అబ్సేస్ అయినట్లే కనిపించి…ఇక వదిలేసింది అనమాట 😉 😉

అంతా బానే ఉంది కానీ, ఇవన్నీ పట్టుకుని నడవాలంటే : నేను మెస్సు వాళ్ళ దగ్గరనుంచి చాక్లెట్లు కొట్టేసా అనుకుంటారేమో అని భయం వేసింది నాకు. ఏదో, ఒకటి కోటు జేబులో, రెండు చేతిలో..ఆ చేయి కూడా కోటు జేబులో పెట్టేసి … (అదే…అన్నీ కోటులో అని భావము)…అలా నా ఆఫీసు గదికి వచ్చేసా 😉 కానీ, కుందేళ్ళకి రిప్రోడక్షన్ రేట్ ఎక్కువ… జాగ్రత్త… నీ ఇల్లంతా ఈస్తర్ బన్నీ చాక్లెట్లతో నిండిపోగలదు … అని భయపెట్టేస్తున్నారు ఇక్కడ 😉 కనుక, కుందేళ్ళ విక్రయ కేంద్రం పెట్టుకుంటా ఏమో వచ్చే వారం నుండి 😛

అన్నట్లు నాకిప్పుడు సందేహం కలిగింది… మన దేశంలో చేసుకునే ఈస్తర్ కి కూడా ఈ గుడ్లు పట్టుకొచ్చే కుందేలు ఉంటుందా? కాస్త తెల్సినవారు ఎవరైనా చెప్పగలరు.

Advertisements
Published in: on April 5, 2012 at 1:01 pm  Comments (4)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/04/05/osterhasen/trackback/

RSS feed for comments on this post.

4 CommentsLeave a comment

  1. మీ “గమనిక – Notice” కూడా “”(ప్రత్యేకించి ఆంధ్రప్రభ దినపత్రిక వారికి)”” ?

  2. @Nagesrav: ప్రత్యేకం ఎవర్నీ ఉద్దేశించలేదండీ. కొన్నిచోట్ల అలాగ కాపీ చేసేయడం చూసి అలా పెట్టానంతే.

  3. cute rabbi(t)s

  4. Thanks a lot for the post that rekindled my memories.

    I don’t travel in Europe much during Easter/Summer/Christmas as businesses are closed. During a rare trip, someone gave me an Easter bunny. I did not realize what it was. When I returned home, my daughter (then hardly 3 years) asked “Dad, why did you bring this chocolate?”

    నాకు అర్ధం కాని విషయం మూడేళ్ళ కూతురు దగ్గర నేర్చుకోవడం ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉండింది. ఔరా పిల్లలకు ఇన్ని తెలివితేటలు ఎక్కడివి అనిపించింది.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: