బగమంతుడి మీద పగ (విశ్వనాథ వారిది కాదండోయ్, నాది!)

ఈ డీ.ఎల్.ఐ. వాళ్ళకి ఇంత అరవీర భయంకరమైన స్పెల్లింగులు ఎలా తడతాయా! అని నాకు ఎన్నాళ్ళ బట్టో సందేహం. ఇవ్వాళ నేను ఏదో వెదుకుతూ ఉంటే, జాషువా రచనలు అన్న పుస్తకం కనబడ్డది. ఎడిటర్: హేమలత లవణం. ఇక్కడి దాకా బానే ఉంది. కానీ, పుస్తకం స్పెల్లింగ్: jaashhuva rachanalu ren’d’ava san’put’an’. ఇదే కొంచెం టూ మచ్ గా ఉంది అనుకుంటూ ఉంటే, హేమలత లవణం అన్న పేరు:shrii mati heimalata lavand-an’ (కాఫీ స్పెల్లింగ్ కే.ఎ.యూ.పీ.హెచ్.వై అన్నట్లు లేదూ!)

వీళ్ళలాగే తెలివిగా ఆలోచించి “శ్రీదేవి” ని shrii deivi అని కూడా అనొచ్చు అని కనిపెట్టి మురిసిపోతూ ఉండగానే,
Title: shrii shat’ha koopa vinnapamulu
Author: chaaryulu krxshhnd-aamaa shriimaan deiviiem ei
అని కనబడ్డది. ఇంక నేను హడలెత్తిపోయాను. ఆ రచయిత పేరేమిటో..పలికేందుకు కూడా అవ్వడం లేదే! అని.విషయం ఏమిటంటే, అవి “శ్రీ శఠకోప విన్నపములు”…అది రాసిన వారూ – శ్రీ దీవి కృష్ణమాచార్యులవారు – టటటటఠా!! చార్యులు కృష్ణమా శ్రీమాన్ దైవీఎం ఐ. అంటే..దీవి కృష్ణమాచార్యులు అని ఏ ఊర్లో అర్థమో కొంచెం తెలిసినవారు ఎవరన్నా సెలవివ్వగలరు.

బగమంతుడు నా మీద పగబట్టాడేమో అని అప్పుడప్పుడు తరుచుగా అనిపిస్తోంది గత కొన్నేళ్ళుగా. ఇలాంటివి కనబడ్డప్పుడల్లా ఆయన పగ వల్ల నాకేమైనా చిత్తభ్రాంతి కలిగిందా? అన్న సందేహం కూడా జనియిస్తూ ఉంటుంది. బగమంతుడి పగ కాస్తా బగమంతుడి మీది పగలా భగ్గున మండేలా ఉంది ఇలాంటీ చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ నా కంటబడేలా చేసి, నా కంట నీరు తెప్పిస్తున్నందుకు.

Advertisements
Published in: on March 21, 2012 at 9:52 pm  Comments (9)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/03/21/bagamantudu-dli/trackback/

RSS feed for comments on this post.

9 CommentsLeave a comment

 1. Hahahaha!! soumyaa garu hilarious!!! :)))))))) Office lo unnaa kaabattii gattigaa navvalekapotunnaa!! Toomuch kadandi babu 3much :))))))))))

 2. మరి సౌమ్య పేరు ఎలా రాశారో ఓ సారి చూసి చెప్పండి

 3. హహహ! బాబోయ్ పొరపాటున కూడా వాళ్లకి నా పేరు చెప్పకండి ప్లీజ్!

 4. @Sesha Vadapalli: Thanks. కానీ, ITRANS తో నైనా, అలాగ దీవి కృష్ణమాచార్యులు అనే పేరు అష్ట వంకర్లతో రాయడం మానవమాత్రులకి తట్టగలిగే ఆలోచనే అంటారా? 🙂

 5. Umm. Honestly, I don’t find the above post funny. For a newbie it may be confusing, but if one has spent some time searching for books on DLI and Ulib then a system’d be visible. The only problem I personally have is if the name/title is entered wrongly, i.e. a typo.

 6. Sreenivas garu:

  Firstly, I am surprised that you actually thought that I am talking about the whole episode…for fun…or because iam having fun. Its another thing that someone who read might have found it funny. But, then:

  1) I should tell you that…there are people like me…who despite using the site for sometime..did not notice the mapping…. and hence…in the ignorant bliss. Nowhere on the site did they mention that they use ITRANS…and so and so is its mapping. The spellings are not consistent either…sometimes ITRANS, sometimes normal spelling..sometimes something else.

  2) At any rate, despite the fact that I dont know what Deevi Krishnamacharyulu wrote or what he did, “chaaryulu krxshhnd-aamaa shriimaan deiviiem ei” to me, is inexcusable.

 7. ITRANS??

 8. Sesha garu: Sorry, OM. Since it is derived from ITRANS… i kept using ITRANS.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: