శేఖర్టూన్స్

చాలా రోజుల క్రితం (నెలల క్రితం), కినిగే.కాం సైటులో కార్టూనిస్టు శేఖర్ కార్టూన్ సంకలనాలు కొన్ని చూసాను. కొన్ని కార్టూన్లు, కొన్ని చోట్ల కార్టూన్ల కంటే కింద ఉన్న క్యాప్షన్లూ భలే నచ్చాయి. ఇవ్వాళ పొదున్న ఎందుకో మూణ్ణాలుగు గుర్తొచ్చాయి – బొమ్మలు మీ ఊహకి వదిలేస్తున్నా😉.

“నైస్ టు మీట్ యూ. బై ది వె, మీరు ఏ రాష్ట్రంలో ఓడిపోయి గవర్నరు అయ్యారు?” (ఇద్దరు గవర్నర్ల మీటింగ్)

“మంట తగ్గుతోంది..ఇంకో మేనిఫెస్టో వెయ్యండి రా!” (ఎలెక్షన్ మేనిఫేస్తోలతో చలి కాచుకుంటున్న జనం)

“ఎంతో కష్టపడి మీ అబ్బాయిని లాకప్ డెత్ చేసాము. యూజర్ చార్జీలు ఇస్తేనే వాడి బాడీ ఇచ్చేది” (పోలీసులు)

“మనిద్దరి మధ్యా విభేదల్లెవని ప్రెస్ వాళ్లకి నేను చెబుతా…ఊహూ, నేను చెబుతా” (…అనేసి కొట్టేసుకుంటున్న ఇద్దరు ప్రముఖులు)

“ఏం, మనం బాలల సిన్మాలు తీయలేమా? టైటిల్స్ రెడీ చేశా వినండి. బాలసింహ రెడ్డి, బాలనాయుడు, బాల రౌడి, బాల ప్రేమ, బాలాద్రి…” (అంటున్న డైరెక్టర్)

….
ఇలాగ… ఆసక్తి ఉన్న వారు శేఖర్ గారి కార్టూన్లను కినిగే.కాం లో కొని/అద్దెకి తీసుకుని ఇక్కడ చూడవచ్చు.

(అన్నట్లు, నాకేం కినిగే వాళ్ళు కమిషన్ ఇవ్వలేదండీ, ఏదో గుర్తోచ్చాయని అలా బ్లాగేస్తున్నా, అంతే!)

Published in: on March 16, 2012 at 11:37 am  Leave a Comment  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/03/16/shekartoons/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: