ఉపేంద్రుడి హాలీవుడ్

ఒకప్పుడు ఉపేంద్రకి ఎవరైనా ఎందుకు వీరాభిమానులవుతారు? అన్నది అర్థం అయ్యేది కాదు. ఆ అయోమయపు రోజుల్లో, కొన్నేళ్ళ క్రితం ఒకరోజు అప్పటి తేజా టీవీలో ఒక రాత్రి “ఉపేంద్ర” వచ్చింది. అందులో ఆయన పేరు “నేను”. సినిమా ముగింపు దాకా బలవంతంగా కూర్చోబెట్టాడు నా తమ్ముడు – “నాకు నిద్రొస్తోందిరా…వదిలెయ్యిరా నన్ను” అని బ్రతిమాలినా కూడా వినకుండా. సినిమా శుభం కార్డులో మెసేజ్ చూశాక మొదటి సైకిక్ వైబ్రేషన్ కలిగింది. దాని నుండి తేరుకోవడానికి కొన్నేళ్ళు పట్టింది. మధ్యమధ్యలో ఇతరత్రా అతని సినిమాల సీన్లు కొన్నీ, బెంగళూరుకి వచ్చాక సినిమా పోస్టర్లు కొన్నీ చూసినా కూడా కె.ఎస్.ఆర్.టీ.సీ వాడు పునీత్ రాజ్ కుమార్ అభిమాని కావడం వల్ల, ఇంకో వైపు నుంచి అదృష్టం నన్ను వెంటాడిందే కానీ, మనసును తాకే వైబ్రేషన్ కలగలేదు.

అప్పుడే నా జీవితంలోకి “సూపర్” సినిమా ఎంటరైంది. ఏ కళనున్నానో, మా కజిన్ ని బలవంతంగా ఒప్పించి ఈశ్వరీ థియేటర్ కి వెళ్ళి తెగించి కన్నడలోనే చూశేశాము ఆ సినిమా. ఉపేంద్ర మార్కు వెరైటీ కాస్ట్యూములూ, వాటితో పాటు పరమ వెరైటీ హెయిర్ స్టయిళ్ళూ, రంగులూ, “ఇటెం..ఇటెం” అని పొలికేకలు పెట్టదగ్గ దృశ్యాలూ ఉన్నా కూడా, వీటన్నింటినీ మించి ఉపేంద్రుడి క్రియేటివిటీ నా మనసులో అలా నిలిచిపోయింది. ఆ తరువాత ఈ సినిమా చూడమని చాలా మందికి రికమెండ్ చేసా ఈ కారణం చేత కొంచెం, సాడిజం వల్ల కొంచెం. ఆ సినిమాలో మీరేం చూసినా చూడకపోయినా, మొదటి పదిహేను నిముషాలు, ఆ తరువాత, చివరి పదిహేను నిముషాలు, ఆ తరువాత మధ్యలో ఉపేంద్ర నయనతారని ఇంప్రెస్ చేయడం కోసం వేసే మేకప్పుల కథ మరో పది నిముషాలూ మాత్రం తప్పకుండా చూడాలి…. చూసి నాకు ఇక్కడికి వచ్చి థాంక్సులు చెప్పుకోవాలి. ఇది నా రెండో సైకిక్ వైబ్రేషన్. దీని నుంచి తేరుకోవడానికి దాదాపు రెండేళ్ళు పట్టింది.

మూడో వైబ్రేషన్ కి టైం ఇవ్వాళే మొదలు. హాలీవుడ్ సినిమా వచ్చినప్పుడు టీవీలో ప్రోమోలు చూడ్డం, రోబో సినిమా వచ్చినప్పుడు “హాలీవుడ్” సినిమా దానికి స్పూర్తి అని అనడం- రెండూ గుర్తున్నాయి నాకు. రోబో నాకు నచ్చింది కూడా. ఎట్టకేలకు ఇవ్వాళ చూశా. ఫ్లాట్ అయిపోయా.

రోబో కి హ్యూమన్ కి మధ్య ప్రేమే పదేళ్ళ క్రితం నాటికి మనకి ఒక నోవెల్టీ అయితే, రోబో ని మనిషి నుంచి డిస్ట్రాక్ట్ చేయడం కోసం ఆ మనిషిలా ఉండే మరో ఆడరోబో ని సృశ్టించడం ఇంకో నోవెల్టీ. అప్పట్లో, ఈ సినిమాకి – రోబోలు మనిషిలా డిజైన్ చేయలేరనీ, క్లోనింగ్ ద్వారానే చేయగలరనీ – ఇలా ఏవో చెబుతూ, ఐదుకి 0.5 రేటింగ్ ఇచ్చారు ఐడిల్ బ్రెయిన్ లో. అదే సైటువారు దాదాపు పదేళ్ళ తరువాత ఇంచుమించు ఇందులోని ఐడియాలే వాడుకున్న రోబో కి 4/5 ఇచ్చారు. కనుక, ఈ లెక్కన ఈ సినిమా నావెల్టీ అప్పట్లో మన వాళ్ళకి అర్థం కాలేదు అనుకోవాలేమో! ;). అంటే, నాక్కూడా ఈ సినిమాకంటే రోబోనే నచ్చింది కానీ, దానికి ప్రధాన కారణం రజనీకాంత్, ఆ సినిమాలో క్లైమాక్సు దృశ్యాలు. ఇంత వెరైటీ ఐడియాలు రావడంలో మాత్రం హాలీవుడ్ కే ఎక్కువ మార్కులు వేస్తా 😉

“An identical man could be made only by cloning and not by designing a robot. Funniest thing about this robot is that it is programmed to listen to all languages in this universe including that of a monkey.”
-అన్న ఐడిల్ బ్రెయిన్ వ్యాఖ్య తలుచుకుంటూ ఉంటే, నాకు ఇంకా నవ్వు ఆగడం లేదు. సాధ్యాసాధ్యాల మాటకి వస్తే, అవన్నీ అన్ని రివ్యూల్లోనూ న్యాయంగా ప్రస్తావించే పనైతే …. ఎందుకులెండి.. ఏవన్నా అంటే అన్నామంటారు మళ్ళీ!! ఏదో మా ఉప్పి బాబు మీద పగ బెట్టుకున్నట్లు ఉంది ఈ రివ్యూ మాత్రం. 😛
“Story by Upendra for this film is weird. ” అంట. రోబో మాత్రం “I find that 90% of the movie is orginal and imaginative and 10% is inspired” అంట. ఇంతకన్నా దారుణం ఇంకోటుందా!!

కోతి చేత అంత బాగా ఎలా ఆక్ట్ చేయించారో మరి… కానీ, నాకు దాని డైలాగులు భలే నచ్చేశాయి. బాగా నవ్వుకున్నా. ఎలాగైనా, మామూలుగా కూడా, ఉపేంద్రా తిక్క వేషాలు, నటన, ఆ మొరటు సంభాషణలు ఉన్నా కూడా, కామెడీ డైలాగులు కూడా బానే ఉన్నాయి. యూట్యూబులో మధ్యలో కొంత భాగం మిస్సయింది కానీ, అయినా కూడా తప్పకుండా చూడాల్సిన సినిమా! నా మూడో సైకిక్ వైబ్రేషన్ మాత్రం బాగా ఎంటర్టెయినింగ్ వైబ్రేషన్. తరువాత్తరువాత మేళా ఉంటుంది కదా ఉప్పి సారుది..అప్పుడు చెబుతా నేనేమయిపోతానో! 😉 ఉపేంద్ర ఈ సినిమాకి కథని మాత్రమే అందించాడు. డైరెక్టు కూడా చేసి ఉంటే మా ఊళ్ళో ఈ ధాటికి భూకంపం వచ్చేసేదేమో!!

Advertisements
Published in: on March 12, 2012 at 9:06 pm  Comments (8)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/03/12/upendrudi-hollywood/trackback/

RSS feed for comments on this post.

8 CommentsLeave a comment

 1. హాలీవుడ్ ప్రోమో లీలగా గుర్తొస్తోంది. ఇలాంటి ఆత్మాహుతి సినిమాలకి ఇంట్లో వాళ్ళు తీసుకెళ్ళకపోవడం వల్ల ప్రోమో చూసి సరిపెట్టుకున్నాను. 😦 ప్చ్.. అయినా రోబో అనే పేరే పెట్టొచ్చు కదండీ.. హాలీవుడ్ అనే టైటిల్ వల్ల మన జనాలు సైకిక్ వైబ్రేషన్స్ ని మిస్ అయ్యారని నా అనుమానం. 😉 అద్సరే.. మీరు ఉప్పీ దాదా ఎం బీబీఎస్ చూసారా?

  అన్నట్టు వచ్చే సోమ వారం “పాడుతా తీయగా” లో గెస్ట్ మంచమ్మాయండోయ్.. 😀 శ్రీమద్రమారమణ గోవిందో హరి.

 2. మీరు ఇంకా ఉప్పి నటించిన “A”, “ఓం” సినిమాలు చూడండి నాలుగు, ఐదో సైకిక్ వైబ్రేషన్‌లు కూడా వస్తాయ్, తేరుకోవడానికి కనీసం పదేళ్ళు పడుతుంది.

  ఇలాక్కూడా కథ చెప్పవచ్చా అనిపిస్తుంది 🙂

  నాకు మాత్రం ఉప్పి, భారతదేశంలోని అత్యుత్తమ దర్శకులలో ఒక్కడు.

 3. మీరు ఎన్నైనా చెప్పండి..ఎన్నైనా తిట్టండి కాని మిగతా సినిమాల గురించి అయితే నాకు తెలియదు… చూడలేదు గాని.. ఉపేంధ్ర నటించి దర్శకత్వం వహించిన “A” సినిమా మాత్రం నా దృష్టిలో ఒక అద్భుతమైన చిత్రమే..! బహుశ కొందరి దృష్టిలో అదొక సైకిక్ అవ్వొచ్చేమో గాని..వాస్తవిక మనుషుల లోపల మనిషిని బాగా చూపించిందది.

 4. mi uppi sir illu, eeshwari theatre daggarane… Kathriguppe big bazar venuka undi… kalavandi oka saari.

 5. @కొత్తావకాయ్ గారు: మంచి ఇన్ఫో అందించారు 😉 అవునండీ “హాలీవుడ్” అన్న పేరు కొంచెం మిస్-లీడింగ్. ప్చ్. గొప్ప సినిమా మిస్సయ్యారు అందరూ. ఉప్పీ దాదా ఎం.బీ.బీ.యస్ ఆ…అది కూడా వచ్చిందా?? అయినా, ఉపేంద్ర కథ/దర్శకత్వం లేకుండా ఊరికే నటన మాత్రం చేస్తే ఆ సినిమాల్లో “కిక్” ఉండదండీ 😉

  @నవీన్ గార్ల: అవునండీ, మన దేశంలో ఉత్తమ దర్శకుల్లో అతనొకడు. సందేహం లేదు నా మట్టుకు నాకు (అవును, అతగాడి సకల వెధవ, వెకిలి వేషాల తరువాత కూడా నాకు ఇదే అనిపిస్తుంది)

  @కమల్: నేనెక్కడ తిట్టాను? అసలు అమ్మాయిల్లో ఉప్పి ఫ్యాన్స్ ఉన్నారని సంతోషించాలి కానీ (ఆయన సినిమాల్లో అమ్మాయిల మీద డవిలాగులు చూస్తె ఒళ్ళు మండదూ!) ఇలా అపార్థం చేస్కుంటే ఎలా 😉

  @మహి: తెలుసండీ. కానీ నేను బెంగళూరులో ఉండట్లేదు ఇప్పుడు 😦

 6. “Isucon :International Society for Upendra Consciousness” that is the name of the fb group 😛

 7. మీరు ఏమనుకుంటే అది అనుకొండి..
  నా దృష్టిలో ఉపేంద్ర బెస్ట్ డైరెక్టర్…
  వాస్తవికంగా సాధ్యం కాని దాన్ని సినిమాగా తీస్తే చాలా మంది జనాలకి నచ్చుతుంది…
  కాని మనలో అంతర్లీనంగా ఉన్న విషయన్నే సినిమాగా తీస్తే దానిని సైకిక్ గా వర్ణిస్తారు జనాలు…
  నిజం చేదుగాను, అబద్దం తియ్యగాను ఉంటుందంటారు పెద్దలు… ఇది కూడా అంతే…

 8. ఉపేంద్రకి నేను వీరాభిమాని. అతని సినేమాలు చూసిన వన్ని నాకు తెగ నచ్చాయి. ఏ అమ్మయి ఎమనుకొంటే , ఉప్పికి పోయేదేముంది, అతని భార్య ప్రియాంక త్రివేది కన్నా అందమైన వారా ఆ విమర్శించే అమ్మాయిలందరు.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: