ఇది ఉబంటూ నవ్వు ;)

అదొక హాలు. ఒక నలభై మందిమి దాకా వింటున్నాము ఒక ట్యుటోరియల్. ఇస్తున్న మనిషి కాసేపటికి ఫలానా కోడ్ డౌన్లోడ్ చేసుకుని, మీ సిస్టంస్ లో రన్ చేసుకుని కొన్ని ప్రయోగాలు చేయండి అన్నాడు. అందరం దాన్ని డౌన్లోడ్ చేస్కున్నాం. అక్కడ నుంచి నాకు సాడిస్టు ఆనందం కలిగించే సంఘటనలు మొదలయ్యాయి.

అక్కడ సగం మంది మాక్ సిస్టంస్ వాడుతున్నారు. కొంతమంది విండోస్ వాళ్ళు కూడా ఉన్నారు ఆశ్చర్యకరంగా. నాలాగ కొంతమందిమి లినక్సు వాళ్ళం అనమాట. ఈ డౌన్లోడ్ చేసిన కోడ్ రన్ కావాలంటే ఫలానా ప్యాకేజీ ఉండాలి. అది కావాలంటే మరో ఫలానా ప్యాకేజీ ఉండాలి..ఇలా చైన్ రియాక్షన్ లా ఉన్నాయి అనమాట అవసరాలు. నేను ఎంచక్కా ఒక్క లైనులో అవన్నీ ఇన్స్టాల్ చేసేసుకున్నా…నాది ఉబంటూ కనుక. కానీ, నా వరుసలోనూ, వెనుక వరుసలోనో అందరూ మాకింతోష్ వాడే వాళ్ళు. పాపం వాళ్ళకి ఒక పట్టాన ఇన్స్టాల్ అవడం లేదు ఏదీ… సోర్స్ కోడ్ కంపైల్ చేస్తూ ఉంటే ఎర్రర్స్ వస్తున్నాయి వాళ్ళకి. నేనేమో అలాగే ఎర్రర్లు వస్తే, ఉబంటూ ఇన్స్టాలర్ తో ఇన్స్టాల్ చేసేసా. మాక్ లో మాక్-పోర్ట్స్ వాడతారు… వాళ్ళకి ఎందుకో గానీ, దానితో కూడా దాదాపు గంట పట్టింది ఇన్స్టలేషన్ పూర్తి చేసేసరికి.

నాకు మరీ సాడిస్టుగా కిందపడి దొర్లి నవ్వాలి అనిపించింది ;). ఆ నవ్వబోయి నవ్వని నవ్వుకే నేను ఉబంటూ నవ్వు అని నామకరణం చేసాను! కానీ, దీని వల్ల సమస్య ఏమంటే, నా పని త్వరగా అయిపోయి మా ఫ్రెండ్సు ఇంకా ఇన్స్టాలర్ తో కుస్తీ పడుతూ ఉంటే నాకు బోరు కొట్టేసింది! 😦 తరువాత విరామంలో ఉబంటూ వాడుకరులంతా గుమిగూడి ఒకటి తీర్మానించాము.
ఉబంటూ రాక్స్! అని 🙂

(అన్నట్లు ఇది నా బ్లాగులో 501వ టపా అట. ఇప్పూడే గమనించా!)

Advertisements
Published in: on February 13, 2012 at 5:02 pm  Comments (7)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/02/13/ubuntulaugh/trackback/

RSS feed for comments on this post.

7 CommentsLeave a comment

  1. ఉబంటూ నవ్వు అని నామకరణం చేశావా.. అసలు నీ క్రియేటివిటీకి హద్దూ పద్దూ లేకుండా పోతోందీ మధ్య.. 😀 😀

  2. Congratulations.. 501 కి నాకు పార్టీ ఇవ్వాల్సిందే.. 😛

  3. congratulations for the occassion

  4. Hahaha.. 🙂

  5. 🙂

  6. ఉబంటూ నవ్వు బాగుందండీ పేరు :):) హమ్మో! అన్నీ వ్రాశారా? హృదయపూర్వక అభినందనలు! ఇలా త్వరలోనే సహస్రం పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ……

  7. pch….pch……hu hu


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: