ప్రస్తుతానికి నేను తన్మయి అభిమానిని :)

మొన్న రాత్రి “గంగపుత్రులు” సినిమా చూసాను (కొందరి రికమెండేషన్ ముదిరి). నాకు సినిమా కథా పరంగా, డైలాగుల పరంగా విపరీతంగా నచ్చింది….ఇతరత్రా నచ్చని అంశాలు చాలా ఉన్నప్పటికీ. సినిమాలో ఉన్న పాత్రల్లో నూకాలు పాత్ర కొన్ని చోట్ల చాలా నచ్చింది. ముఖ్యంగా విలేఖరితో నూకాలు సంభాషణ, నూకలు వెళ్లి తమపై కామెంట్ చేసిన వాడి కార్ మీద వాడికి తెలీకుండా గీతాలు గీకేసి వెళ్ళడం… ఇలాంటి చోట్ల ఆ అమ్మాయి బాగా చేసింది అనిపించింది. అసలుకి మామూలుగా ఆ అమ్మాయి (తన్మయి) బాగా చేసింది లెండి. ఇదిలా ఉండగా, అనుకోకుండా, యూట్యూబులో తన్మయి ఇంటర్వ్యూ కనబడ్డది. అది చూసేసరికి ఫ్యాన్ అయిపోయా అనమాట.

నేనింకా ఈ అమ్మాయికి ఆ ప్రాంతపు నేపథ్యం ఉంది ఉంటుంది అనుకున్నా….ఆ మాట తీరు, శరీర భాషా చూసి. ఆమె హైదరాబాదులో పెరిగిన అమ్మాయంట. ఈ ఇంటర్వ్యూలో తను ఆ జాలరిపేటలో గడిపిన తొలిరోజుల గురించి, అక్కడి మనుషుల జీవన విధానం స్టడీ చేయడం గురించీ చెబుతూ ఉంటే నాకు తెగ నచ్చేసింది🙂. పైగా, పాత్రోచితంగా కనబడేందుకు నెలరోజులు ఎండలో తిరిగి టాన్ అవ్వమంటే, అయ్యింది కూడానూ!🙂
ఇదిగో, ఇంటర్వ్యూ రెండు భాగాలూ ఈ కింద చూడండి.

Published in: on February 3, 2012 at 3:14 pm  Comments (6)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/02/03/tanmayi/trackback/

RSS feed for comments on this post.

6 CommentsLeave a comment

  1. “కొందరి రికమెండేషన్ ముదిరి”

    Who? Who? Who?
    Me? Me? Me?😛

  2. Wow !!! Thanks for the link. నేనా అమ్మాయి అంత సహజంగా చేయడం చూసి జాలరిపేటలోనే ఎవర్నో సెలక్ట్ చేసుకుని ఉంటారులే అనుకున్నాను ఇలాంటి నేపథ్యముండచ్చేమో అన్న ఆలోచన కూడా రాలేదు అసలు.

  3. @Halley: Yes. You. You. You.
    @VenuSrikanth: అదే కదా! అసలదే కదా!😛

  4. cinema nativityki daggara ga untundi…tanmayi baga chesindi.

  5. ma “manchammai” gurinchi e madhya rayadam ledu meru, idemantha manchiga ledu. malli manchiga rayandi pls.
    – o pichhi manchodu.

  6. మీ పోస్ట్ ఈరోజే చూడటం అండీ… ఇప్పుడే ఈ సినిమా చూశాను..
    సూపర్.. మీ బ్యాచ్ లో నేనూ జాయినయ్యాను.
    మీ రివ్యూ కి బింగో..


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: