సూచికలు ఇలా కూడా రాస్తారు (రాసేవాళ్ళు) అనమాట!

ఒక పుస్తకంలో సూచిక ఇలా కనబడ్డది. పుస్తకం 1859 ప్రాంతాల్లో ఎప్పుడో ప్రచురితమైంది అనుకుంటున్నా మొదటి పేజీలో వివరాలు బట్టి!

ఇది సంజ్ఞా పరిచ్ఛేదము-సంధి పరిచ్ఛేదము-శబ్ద పరిచ్ఛేదము-కారకాది పరిచ్ఛేదము-క్రియా పరిచ్ఛేదమని యైదు పరిచ్ఛేదములుగాను-అందు మొదటి పరిచ్ఛేదము భాషా ప్రకరణము-వణ్ ప్రకరణము-నామ ప్రకరణమని మూఁడు ప్రకరణములుగాను- రెండవ పరిచ్ఛేదము-అచ్సంధి ప్రకరణము-హల్సంధి ప్రకరణము-సముదాయ సంధి ప్రకరణమని మూఁడు ప్రకరణములుగాను- మూఁడవ పరిచ్ఛేదము-అజంత శబ్ద ప్రకరణము-హలంత శబ్ద ప్రకరణమని రెండు ప్రకరణములుగాను- నాల్గవ పరిచ్ఛేదము విభక్తి ప్రకరణము-సమాస ప్రకరణము-మిశ్ర ప్రకరణమని మూఁడు ప్రకరణములుగాను-ఐనవ పరిచ్ఛేదము క్రియాప్రకరణము-కర్తృపురుష ప్రకరణము-కారయితృపురుష ప్రకరణము-కర్మ పురుష ప్రకరణము-విశేష ప్రకరణమని యైదుప్రకరణములుగాను విభాగింపబడి యున్నది.

పుస్తకము – ప్రశ్నోత్తరాంధ్ర వ్యాకరణము
రచన – పుదూరు సీతారామశాస్త్రి

నాకేమీ అర్థం కావట్లేదు కానీ, ప్రశ్నోత్తరాల్లో వ్యాకరణం చెబుతున్నారని అర్థం చేసుకొన ప్రయత్నిస్తున్నా.

Advertisements
Published in: on January 12, 2012 at 9:09 pm  Comments (9)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/01/12/soochikalu/trackback/

RSS feed for comments on this post.

9 CommentsLeave a comment

 1. నా కైతే శుభ్రంగానే అర్ధమైంది. ఈ రోజుల్లో సాధారణంగా నిలువుగా లిష్టువేసి ప్రకటించే విషయసూచికను ఆ పుస్తకంలో యెకవాక్యంగా అడ్డంగా వ్రాసారు. అంతే.

 2. నాకు అర్థం కావట్లేదు అన్నది పుస్తకంలో కొన్ని భాగాల గురించండీ. సూచిక గురించి కాదు. 🙂

 3. నేనే పొరబడ్డానన్న మాట. ఈ పుస్తకం యెక్కడ లభ్యమవుతుందో చెబుతారా? వీలుంటే సంపాదించి చదవాలనుకుంటున్నాను.

 4. Shyamalarao garu: ఇక్కడ చదవండి.

 5. ఈ పుస్తకానికి, అంతకంటే పుస్తక రచయితకు బోలెడు చరిత్రుంది. మొదట పెదబాలశిక్ష ఎడిషన్‌కూడా వీరిదే. పోతే మీకే భాగాలు అర్థం కావటంలేదో చెప్తే ఎవరైనా సహాయపడగలరు. నిజానికి ఈ పుస్తకం సులభంగా రాయబడినట్లు :). చిన్నయసూరి బాలవ్యాకరణం, వావిలికొలను సుబ్బారావుగారి వ్యాకరణం కానీ చూశారా!

 6. @Sreenivas garu: నేను మిగితా వ్యాకరణాలు చదవలేదు కానీ, మీరు అలా అన్నాక వాటి జోలికి వెళ్ళాలంటే భయమేస్తోంది :). ఇది ప్రశ్నోత్తరాల్లో ఉంది కనుక ఈ మాత్రం అర్థమవుతోందని అనుకుంటున్నా. నాకేం అర్థం కాలేదో త్వరలో పోస్ట్ చేస్తా బ్లాగులో, వీలు చూసుకుని.

 7. వావిలికొలను సుబ్బారావుగారి వ్యాకరణం?
  ఇదే వినడం. సరేనండీ దయచేసి ప్రాప్తిస్థానం తెలియజేస్తే సంపాదించుకోవటానికి ప్రయత్నిస్తాను.

 8. సౌమ్య-గారు: చిన్నయ సూరి, వావిలికొలనుల వ్యాకరణాలు మిమ్మల్ని చదవమనే చెప్తాను. భయపడకండి. Whether good or bad – there opinions go apart – they are quite influential, even today.. ఆ రెండు + పూదూరి వ్యాకరణాలు 1850-1870 కాలంలో రాయబడ్డాయి. అప్పట్లో వచనం వేరు. ఆపైన ముగ్గురూ తెలుగువాళ్ళైనా, మద్రాసు పరిసరాల్లో పుట్టి పెరిగిన వాళ్ళు కావటంతో వాళ్ళ వచనంపై తమిళ diglossia ప్రభావం చాలా ఎక్కువ.

  శ్యామలరావుగారు: నేను బళ్ళో వ్యాకరణం (late 70s, early 80s, 6-10th class) వావిలికొలను పుస్తకం నుండే నేర్చుకున్నాను. ఆ పుస్తకం నాకు తెలిసి ఇంకా ఆయన ఆశ్రమంలో (తెనాలి దగ్గర అంగలకుదురులో, ఆయన మద్రాసులో రిటైరైనతరువాత సన్యాసం పుచ్చుకుని అంగలకుదురులో ఆశ్రమం ఏర్పరచుకున్నారని మీకు తెలిసే వుంటుంది.), ఆయన మిగిలిన రచనలతో దొరుకుతుంది.

 9. వావిలికొలను వారి పుస్తకం సంపాదించటానికి ప్రయత్నిస్తాను. పుదూరివారి పుస్తకం (పి.డి.ఎఫ్) పంపినందుకు ధన్యవాదాలు. తప్పక చదువుతాను.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: