(మూడో) ఏట్లో పుస్తకం.నెట్! :)

 ఈ ఏడు నేను చేసిందేం లేదు కదా… కనుక నేను రాయను అన్నా కూడా…ఆనవాయితీ బ్రేక్ చేయకూడదు అని నాకు అల్టిమేటం వచ్చింది కనుక, పుస్తకం.నెట్ కి స్కూలుకి వెళ్ళే వయసు వచ్చినదని చెప్పడానికి సంతోషిస్తూ, ఇందుమూలంగా యావన్మందికీ తెలియజేయునదేమనగా: ఈతలమీద, ఎదురీతలమీద మాకున్న వల్లమాలిన ప్రేమ వల్ల రెండు సార్లు ఏట్లో మునిగింది చాలక, ముచ్చటగా మూడోసారి కూడా మునిగి, ఈ ఏటిని కూడా మింగి…. అంతకన్నా బహు ముచ్చటగా నాలుగో ఏట్లోకి అడుగుపెడుతున్నాం ;). ఎప్పట్లాగే మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి చూస్కుంటూ….

*****

వ్యక్తిగతంగా నేను గత మూడేళ్ళలో పుస్తకం.నెట్ కోసం ఇంత తక్కువ సమయం వెచ్చించింది ఈ ఏడాదే 🙂 ఎక్కువ భాగం దేశం అవతల ఉండడం ఒక కారణం అయితే, మళ్ళీ చదువులో పడ్డం దానితాలూకా పనుల్లో నిమగ్నమవడం ఇంకో కారణం. అన్నింటినీ ఏదో కవర్ చేస్కొడానికి చెబుతున్నా కానీ, అసలు కారణం – బద్ధకం, నిర్లిప్తత 🙂 ఈసారి ఎక్కువమందిని కలవలేదు. రాయమని వేధించలేదు … పోనీ మరియాదగానైనా అడగలేదు. ఇంటర్వ్యూలు చేయలేదు. ఇలా… “లేదు” లు ఎక్కువైనందువల్ల నేను పుస్తకం లో జోరు తగ్గిందని ఫిక్స్ చేశా కానీ, వెనక్కి తిరిగి ఈ ఏడు వచ్చిన వ్యాసాలు చూస్తె, జంపాల చౌదరి గారి పుణ్యమా అని, ఇదివరలో లేనంత వైవిధ్యం ఈ ఏటి వ్యాసాల్లో ఉంది అనిపించింది.

ఈ ఏడు వచ్చిన వాటిలో నాకు వ్యక్తిగతంగా, మంచి వైవిధ్యభరితమైన స్పెక్ట్రం కవర్ చేసాయి అనిపించిన వ్యాసాలు కొన్ని, జనవరి నుంచి డిసెంబరు దాకా వచ్చిన వరుసలో…: (వీటిలో కొన్ని నేను రాసినవి కూడా ఉన్నాయి కానీ…అది వైవిధ్యం చూపడానికి వాడుకుంటున్నా కానీ, అడ్వర్టైజింగ్ కి కాదు అని గమనించగలరు..)

జలార్గళ శాస్త్రము – ఒక పరిచయం
బొమ్మా బొరుసూ: తెర వెనుక కథ, కొన్ని జ్ఞాపకాలు
ఓ “33+2..pass” శాల్తీ కథ – మల్లెపందిరి
కవి సామ్రాట్ నోరి నరసింహశాస్త్రి గారి సాహిత్యవ్యాసాలు
మయూరుని సూర్య శతకం
ఆనాటి గుంటూరు జిల్లా – ప్రొఫెసర్ రాబర్ట్ ఎరిక్ ఫ్రికెన్‌బర్గ్ పుస్తకానికి ఇన్నయ్యగారి అనువాదం
పణవిపణి – తెలుగులో వెలువడిన ప్రప్రథమ సంపూర్ణ గేయకావ్యం; నళినీకుమార్ కవిత్వం
భారత స్వాతంత్య్రోద్యమం: ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు
Interview with Guy Deutscher
కొల్లాయిగట్టితేనేమి?” గురించి రా.రా.గారి విశ్లేషణ – నా ఆక్షేపణ
Producing open source software – Karl Fogel
– ఇలాగ, శాస్త్ర సాంకేతికాలు మొదలుకుని, కవితలు, సినిమాలు, శతకాలు, చరిత్ర, విమర్శ, ఇంటర్వ్యూలు – ఈ విధంగా నా మట్టుకు నేను పుస్తకం.నెట్ లో వైవిధ్యం పెరిగింది అనే అనుకుంటున్నాను. అలాగే, నేరుగా ఒక వ్యాసం లా కాకుండా చర్చలా ఒక పుస్తకం గురించి రాయడమూ, ఫోటోలలో ఒక పుస్తక ప్రదర్శన గురించి చెప్పడమూ : ఇలా ఏవో, మా వంతు ప్రయోగాలూ మేము చేస్తున్నాము : ఇతరులకి కొత్త ఐడియాలు వస్తాయని 😉 అలాగే, ఒక పుస్తకం గురించి ఒక కవిత ద్వారానో, ఒక బొమ్మ ద్వారానో : ఇలా ఎందుకు మన అభిప్రాయాలూ చెప్పకూడదు? అన్న ఆలోచన నాకు మొదట్నుంచి ఉంది కానీ, నాకు ఉన్న సృజనాత్మక పరిమితుల వల్ల నేను ఆ పని చేయలేను. ఎవరికన్నా అలాంటి ఆలోచనలు కలిగితే నిరభ్యంతరంగా పుస్తకం.నెట్ కి పంపొచ్చు.

మధ్యలో వర్డ్ప్రెస్ హాక్ మూలాన సైటు మూతబడ్డప్పుడు థీం మార్చాలి అన్న బ్రహ్మాండం బద్దలయ్యే నిర్ణయం తీసుకుని, అవతల అది బద్దలవుతున్నా కూడా మా పాటికి మేము తాపీగా ఇంకా దాన్ని తీర్చి..దిద్ది…మళ్ళీ దిద్ది…అలా దిద్దుతూనే ఉన్నాము. కొన్నాళ్ళు దారాలు ఊడి వచ్చేదాకా దిద్దుతూనే ఉంటాము అనమాట 🙂 కనుక, మీరు ఇచ్చిన మెయిల్లూ…వాటిలోని సూచనలూ అన్నీ చదివాము, మా “పేస్” లో కొనసాగుతూ, అన్నింటి గురించీ ఆలోచిస్తాము 🙂 వీళ్ళు వినట్లేదు అనుకుని అపార్థం చేస్కోకండి 🙂

అది అటు పెడితే, చివరగా నా విజ్ఞప్తి ఏమిటీ అంటే రాయండి, బాబూ/అమ్మా రాయండి! 🙂
మీరు చదివిన పుస్తకాల గురించి, మీకు నచ్చిన పుస్తకాల షాపుల గురించి, మీ పుస్తక ప్రియత్వం గురించి : అప్పుడప్పుడు పుస్తకంలో కూడా రాయండి. అవును, మీ బ్లాగులో అయితే మీకు తోచినప్పుడు ప్రచురించుకోవచ్చు. పుస్తకంలో అయితే, మూణ్ణాలుగు రోజులు పడుతుంది (అంటే…. మనుషులం కదా!)… నిజమే. కానీ, పుస్తకాలకి సంబంధించిన సమాచారం ఒకచోట ఉంటుంది కదా అని. అంతే.  అన్నట్లు, మరొక్కసారి చెప్పేదేమిటి అంటే – అప్పుడప్పుడు కొందరు “పుస్తకంలో రాయాలంటే భయం” తరహా లో కూడా అంటూ ఉంటారు. ఆ భయానికి కారణం నా మాటతీరైతే, ఇది నా బ్లాగు కాబట్టి ఇలా ఉంటా కానీ, అక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తా 😉 కనుక, ఇక్కడ ఇచ్చిన తరహా పెదసరపు సమాధానాలు నేను ఇవ్వను లెండి అక్కడ. కస్టమర్ ఇస్ గాడ్ టైపు అనమాట … హీహీ.

ఏమైనానూ, జంపాల చౌదరి గారు, మల్లిన నరసింహారావు గారు మొదలైన వారంతా ఇంత స్పూర్తి కలిగిస్తుంటే నా లాంటి నిర్లిప్త బద్ధక్కపు జీవికి కూడా ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహంతోనే మేము నాలుగో సంవత్సరం లోకి అడుగుపెడుతున్నాము :)మీలో పుస్తకం.నెట్ చూసే వారు, చూడని వారు, నచ్చే వారు, నచ్చని వారు : అందరూ మళ్ళీ ఎప్పట్లాగే మీ ఆదరాభిమానాలు, విసుర్లు, వేపకాయలు అన్నీ అందిస్తారని ఆశిస్తున్నాను 🙂
అన్నట్లు, పిల్లని ఏ స్కూల్లో వేయాలి అన్న విషయం పై మాకు ఏకాభిప్రాయం కుదరట్లేదు. అందువల్ల ఇంట్లోనే చదువు చెప్పాలి అని తీర్మానించాము. కొన్నాళ్ళు దేశంలోనూ, కొణ్ణాళ్ళు విదేశంలోనూ ఎల్.కే.జీ చదువుతుందన్నమాట  😉
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!
పూర్ణిమ టపా, తన బ్లాగులో, ఇక్కడ.
Advertisements
Published in: on December 31, 2011 at 11:23 pm  Comments (7)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/12/31/3yrspustakam-net/trackback/

RSS feed for comments on this post.

7 CommentsLeave a comment

 1. మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు 🙂

 2. ఏట్లో పుస్తకం.నెట్ అంటే గాభరా వేసింది. ఏట్లో అంటే నదిలో అని. నవరాత్రులూ దేవి పూజ చేసి, దసరా తరువాత గంగా నిమజ్జనం చేసినట్లు, ఇంతకాలం శ్రద్ధగా పుస్తకం.నెట్ ను నడిపి, అలసి పూర్ణిమ విశ్రాంతి తీసుకుంటే, అప్పుడే సౌమ్య కూడానా, అనిపించింది, ఈ వ్యాస మకుటం చూసాక. కొత్త పుంతలు తొక్కుతున్న పుస్తకం.నెట్ నూతన సంవత్సరం లో మరిన్ని సొగసులు సమకూర్చుకోవాలని అభిలషిస్తాను.

 3. 2012 నూతన సంవత్సర ( ఆంగ్ల ) శుభాకాంక్షలతో…..
  నూతనోత్సాహం ( శిరాకదంబం )

 4. మీరన్నది నిజం పూర్ణిమ గారి బ్లాగ్, మీ బ్లాగ్ లో మీ రాతతీరు ఒకలా ఉంటుంది, పుస్తకం.నెట్ లో మరోలా ఉంటుంది.(అది మాకు తెలుసులే అంటే ఏమీ చెయ్యలేం గానీ)
  happy new year to you and our pustakam.net

 5. @Surampudi Pavan Santosh: 🙂 No comments 😉

 6. ఏట్లోకి అంటే, మళ్ళీ ఏమైనా ఇబ్బందేమో అనుకుని ఆదరబాదరాగా వచ్చా!!
  Happy new year and wishing a wonderful year ahead to you and pustakam too.. 🙂

 7. నీ కార్టూను బాగుంది. కొత్తసంవత్సరంలో కొత్త ప్రయోగాలు బాగున్నాయి. శుభాకాంక్షలు.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: