క్రిస్మస్, ఇంటావిడా

నాకూ, మా హౌసోనర్ కి మూణ్ణెల్ల క్రితం మాటా-మాటా అయ్యాక, చిరాకేసి ఆవిడని పలకరించడం మానేశా. రెంటు అకౌంట్ లో వేసినప్పుడు ఏమెయిల్స్ చేస్తున్నా అంతే. ఆమె కూడా ఆట్టే మాట్లాడలేదు. హమ్మయ్యా అనుకుని వదిలేసా. రెండ్రోజుల క్రితం -మెర్రీ క్రిస్మస్ అని ఒక ఈమెయిల్ వచ్చింది. పాపం అందులో బీ హ్యాపీ వగైరా అంతా రాసేసరికి, నాకు కొంచెం ప్రేమ కారిపోయినా కూడా, తమాయించుకుని పరమ సీరియస్గా…”థాంక్స్. విష్యూ ది సేం. రెంటు ట్రాన్స్ఫర్ షెడ్యూల్ చేసేసాను….” ఈ తరహాలో కట్టె, కొట్టె తెచ్చే టైపు ఈమెయిల్ పంపాను.

క్రిస్మస్ కి నా స్నేహితులు పిలవడంతో వాళ్ళింటికి వెళ్ళి, మళ్ళీ వెనక్కి వచ్చేసరికి ఇంటి బయట ఏదో పేపర్ బుట్ట పెట్టి ఉంది. దానిలో చాక్లెట్లు, పళ్ళూనూ. నేనాశ్చర్యపోయాను. నాకిక్కడ గిఫ్టులు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారో! అనుకుని లోపల చూస్తే, ఒక గ్రీటింగ్ ఉంది. మా ఇంటావిడే! నాకాశ్చర్యమేసింది. వెంటనే ఫోన్ చేశాను. థాంక్స్ చెబుతూ ఉంటే, “దానిదేముందిలే, ఇక్కడ అలా చుట్టుపక్కలాళ్ళకి క్రిస్మస్ నాడు ఏదన్నా ఇవ్వడం మా సంప్రదాయం. నువ్వు ఇక్కడి దానివి కాదు కనుక నీకు తెలియదంతే” అన్నారు. నాకు భయమేసింది – “నువ్వు మీ పక్కింటోళ్ళకి కనీసం విష్ కూడా చేయలేదు – పనికిమాలిన దానా!” అని మరియాదగా చెబుతున్నారేమో అని. “కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, కొంతమంది వృద్ధులు పుట్టుకతో యువకులు” అని ఆమెకి చెబ్దామా? అంటే ఆవిడకి తెలుగు రాదాయె!! ఏదో కష్టపడి, మరోసారి థాంక్స్ చెప్పి, వాళ్ళింటికి ఫలానా రోజుకని డిన్నర్ కి పిలిస్తే, సరే వస్తానని మళ్ళీ థాంక్సు చెప్పి పెట్టేసా…కానీ, గుండె పీచుమంటూనే ఉంది…వెళ్ళాక చుట్టుపక్కల వాళ్ళతో కాస్త ఆ మాటా-ఈమాటా మాట్లాడాలి, మరీ అంత సైలెంటుగా బతక్కూడదు అని చెప్పి నా బుర్ర తింటారేమోనని. అసలుకి లేకపోతే – నేనేదైనా చేశానేమో…అందుకని ఇల్లు ఖాళీ చేపీడానికి మరియాదగా చెబుదామని పిలుస్తున్నారేమో? అని కూడా అనుమానం వచ్చీంది.

ఆవిడకి కాస్త జాత్యహంకారం. నాకు ఇండియాలో జాత్యహంకారులంటేనే చిరాకు. ఇంక ఇంకో కొత్త దేశం వాళ్ళొచ్చి మన గురించి కామెంట్లేస్తే మండదూ? ఆ తరహాలో మాట్లాడినందుకే నేను స్నేహంగా ఉండడం మానేశా అనమాట ఫ్లాష్బ్యాక్ లో… అదివరలో ఆవిడపై చాలా గౌరవం ఉండేది. డెబ్భై ఏళ్ళ వయసులో కూడా కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు, కొత్త చదువులు చదువుతున్నారు అని. ఇప్పుడు కూడా ఉంది కానీ, మొదట్లో ఉన్నంత కాదు.

ఈ నేపథ్యంలో డిన్నర్ కి పిలవగానే ఏదేదో ఊహించుకున్నా. రేపీవిడ ఖాళీ చేయమంటుందా? అని ఇళ్ళు చూడ్డం కూడా మొదలుపెట్టేశా :)). సరే, ఆఫీసు నుండి తిరిగి వెళ్తూ, ఒక థాంక్స్ కార్డ్ (జర్మన్లో) కొని పట్టుకెళ్ళా. ఆవిడ జర్మన్ కార్డు చూసి చాలా సంతోషించింది. నిజంగానే అది క్రిస్మస్ స్పూర్తితో పిల్చిన డిన్నర్ కానీ, చెడు ఆలోచనలతో కాదు అని కాసేపట్లోనే అర్థమై “అయ్యో! అనవసరంగా ఆవిడ గురించి అలా అనుకున్నానే!” అనుకున్నా.

దాదాపు రెండు గంటల సేపు కబుర్లతో డిన్నర్. ఈ డెబ్బై ఐదేళ్ళ దంపతులతో నేనింత సేపు కూర్చోడం ఏమిటో! అనుకున్నా కూడా. అక్కడక్కడా భలే చిరాకేసింది….వీళ్ళకి ఇండియా – అన్న ఎంటిటీ గురించి ఉన్న అపోహల గురించి. కానీ, నేను గెస్టుని…గెస్టులా ఉండాలి కదా 🙂 అలాగే, వయసు పెరిగే కొద్దీ అంత తేలిగ్గా డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్ ఎలాగో ఒప్పుకోరు కనుక… మీకు ఫారినర్ గా కొన్ని విషయాలు అర్థం కావు లెండి అని కట్ చేశా ;). దారుణం ఏమిటంటే – “ఇప్పుడు ఇండియాలో డెమోక్రసీ ఉందంటావా?” అని అడగడం. నేను అవాక్కై – “నా మట్టుకు నాకు ఇక్కడి కంటే అక్కడే డెమోక్రటిక్ గా అనిపిస్తుంది” అనబోయి…. “ఇట్ ఈజ్ ఆజ్ డెమోక్రటిక్ ఆజ్ ఎనీ అదర్ డెమోక్రసీ” అన్నా 🙂 ఆమె హర్ట్ ఐపోయి – “కానీ, ఇండియా చైనా ఇక్కడ అంతా ఇలా అరాచకాలు అవీ…” అనుకుంటూ మొదలుపెట్టింది. “చైనా డెమోక్రసీ కాదు” అన్నా.
****
“…అయినా, చైనా ఇండియాకంటే అభివృద్ధి చెందుతోంది ఏమో కదా…” – మరి కొద్ది నిముషాల తరువాత ఆవిడ భర్త గారు.
“…చైనా డెమోక్రసీ కాదు…” మళ్ళీ అదే సమాధానం ఇచ్చా 😉

****
“ఐ గెస్ సంటైంస్ యూ ఆర్ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఇండియన్?”
“నాట్ సం టైంస్. ఆల్మోస్ట్ ఆల్ టైంస్” ఠక్కుమని అసంకల్పిత ప్రతీకార చర్యలా దూసుకొచ్చింది నా జవాబు.
-నాలో ఇంత దేశభక్తి ఉందని ఊహించలేదు సుమా! 😛 “అయినా, ఇది మరీ బాగుంది. పర్ఫెక్ట్ దేశాలూ, పర్ఫెక్ట్ మనుషులూ ఎక్కడుంటారు? మనకి ఒకళ్ళు నచ్చితే, వాళ్ళ తప్పులతో సహా స్వీకరించమూ? దేశాలు కూడా అంతే… అమ్మ చేసిన పని నచ్చకపోతే అమ్మని ద్వేషించి వదిలి వెళ్ళిపోతామా ఏంటీ?” ఇలా అంతరాత్మ ఘోష పెడుతూ ఉండగా, “ఎవరికి ఇష్టం ఉండదండీ వాళ్ళ దేశం అంటే?” అని మాత్రం అనగలిగా మరియాద కోసం 🙂
****

ఇక, ఇక్కడికి ఆపేస్తున్నా.

మొత్తానికి, ఆవిడే చివర్లో ఒప్పుకున్నట్లు – ఆవిడ కొంచెం పాతకాలం నాటి సమాజంలో పెరిగిన మనిషి కనుక, అంత తేలిగ్గా మారడం కష్టం. ఆవిడకి జర్మనీలోనే “దిగువ తరగతి” నుండి వచ్చి బాగా చదువుకుని, గొప్ప వాళ్ళు కావడం మింగుడు పడదట! కానీ, ఒకందుకు ఆవిడపై గౌరవం కలిగింది. ఈ విషయాన్ని ఎంత మంది ఒప్పుకుంటారు??

….. అదనమాట నా క్రిస్మస్ అనుభవం.

Advertisements
Published in: on December 28, 2011 at 1:37 pm  Comments (10)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/12/28/christmasday/trackback/

RSS feed for comments on this post.

10 CommentsLeave a comment

 1. హ్మ్మ్.. బాగుందండీ..
  >>
  “నాట్ సం టైంస్. ఆల్మోస్ట్ ఆల్ టైంస్” ఠక్కుమని అసంకల్పిత ప్రతీకార చర్యలా దూసుకొచ్చింది నా జవాబు.>> సూపరు…

  నూతన సంవత్సర శుభాకాంక్షలండీ

 2. రాజ్ గారూ: థాంక్యూ. మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు

 3. parlede…baane raasaaru …:):)

 4. @ameer: ఏదో మీ దయ వల్ల, ఆ కనకదుర్గమ్మ దయవల్ల…అలా నెట్టుకొస్తున్నానండీ. 😛

 5. బాగుందండీ… నిజమే ఆవిడ అలా ఒప్పుకోవడం అభినందించదగ్గ విషయం..
  మీరన్నట్లు ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు వాళ్ళ దేశమంటే…

 6. 🙂

 7. మాక్స్ ముల్లెర్ ఎందుకంత పడి చచ్చేవాడు ఇండియా గురించి వాళ్ళని అడగలేక పోయారా..?

 8. 😀

 9. nice post

 10. athreya garu ‘

  you must read kancha ilaiah gari” why iam not a hindu?”


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: