సినీ జ్ఞానోదయం

“అవునండీ…. అది ఇదివరకటి ఆయన సినిమాల్లా దృశ్య కావ్యంలా లేదు.”
“చెబితే విన్నావూ…. అదేమీ బాగోదు అని చెప్పానా?”
“బాలేదని నేనెక్కడ అన్నాను?”
“అంటే బాగుందా?”
“కొన్ని సీన్లు తెగ నచ్చేసాయి లే”
***************
ఖంగారు పడకండి. నేను “శ్రీరామరాజ్యం” గురించి …. మాట్లాడ్డం లేదు. నేనింకా ఆ సినిమా చూడలేదు. చూసే అవకాశం ఎప్పుడొస్తుందో తెలీదు.

ఇప్పుడూ, దీప గరిమెళ్ళ గారు తన రివ్యూలో అన్నట్లు, మన తాతయ్య ఉన్నారు… ఎనభై ఏళ్ల పైచిలుకు వయసు. మనల్ని చూడగానే కబుర్లు చెప్పాలి అనిపిస్తుందా? దా, కూర్చో, అనేసి, రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఇడ్లీ సాంబార్ రేటు ఎంతుండేది? అని కథ మొదలుపెట్టారనుకోండి…. మీకేమనిపిస్తుంది? నాకు మూడుని బట్టి ఒక్కొక్కసారి తాతయ్యని చూస్తె భలే ముద్దొస్తుంది, చిన్న పిల్లాడి కబుర్ల లా తెగ వినాలి అనిపిస్తుంది. ఒక్కొక్కసారి – అరె, ఈయనకేన్ని విషయాలు తెల్సో? అనిపిస్తుంది. ఒక్కోసారి, ఈయన వదిల్తే నేనెళ్ళి పంజూసుకుంటా – అని కూడా అనిపిస్తుంది. కానీ, ఆయనపై కోపం మాత్రం రాదు. ఒక్కోసారి నవ్వుకుంటూనే వింటాను. ఒక్కోసారి విన్నట్లే అక్కడ కూర్చుని ఉంటాను – నా ఆలోచనల్లో నేనుంటూ 🙂 ఇదీ అంతే. నేనింత వివరంగా చెప్పాల్సి వచ్చింది కానీ, దీప గరిమెళ్ళ చక్కగా ఒక్క వాక్యంలో తేల్చేసింది : “….like how you would indulge a senile grandparent who’s going on and on on no particular topic.” అని. సాధారణంగా ఆమె రాసే రివ్యూలు చాలా బాగుంటాయి. సినిమా చూడాలా వద్దా.. ఆమె రాసిందాన్ని బట్టి నిర్ణయించుకునెంత పరాన్నజీవిని కాను గానీ, మామూలుగా నాకు ఆవిడ శైలి ఇష్టం కనుక ప్రతి రివ్యూ చదువుతా 🙂 ఎప్పుడూ ఇంతగా “ఎంత కరెక్టుగా చెప్పిందీ!!” అనుకుంటూ రెండున్నర గంటల్లో ఇరవై సార్లన్నా అనుకోవడం జరగలేదు.

సమస్త భూమండలాన్నీ నోట్లో చూపించడానికి మనం అందరం శ్రీ కృష్ణులం కాదు అన్న విషయం ఆర్యులకి తెలియకనా? కాదు. ఆర్యులకి తెలుసునని మాకు తెలియకనా? కాదు. పరిణామ సిద్దాంతం అన్నింటా వర్తిస్తుంది.

అసలుకి ఆ బహు-భాష కుటుంబం గోలేమిటో, వాళ్ళు ఎన్ని భాషలు మాట్లాడుకున్నా కథకి సంబంధం ఏమిటో అర్థం కాదు. ఇక, అన్నింటికంటే ఐటెం గా ఉన్నది ఆ విగ్గుల గోల. ముందే అతికించిన బట్టతలలు. వాటిపై అతికించిన ఫుల్-విగ్గులు. అబ్బో, అట్టాంటివి కోకొల్లలు సినిమాలో…. ఐటెం….ఐటెం అని నేపథ్యంలో ఎన్ని పొలికేకలు వినబడ్డాయో!

ఈ సినిమాలో నాకు ప్రతి ఫ్రేములోనూ నచ్చిన ఏకైక మనిషి: మంజరి ఫాడ్నిస్ 🙂 ఆ అమ్మాయికి తెలుగోచ్చో రాదో కానీ, భలే చేసింది. అసలుకి ఆ పాత్రే నాకు తెగ నచ్చేసింది. అక్కడక్కడా మెరుపులు…. వెనుకే నా కేకలు. అదే… అప్పుడప్పుడు “వావ్!” అనిపిస్తాయే తాతయ్య కబుర్లు..అలాగే. ఆ కొన్ని సీన్లు మాత్రం కట్ చేసి సేవ్ చేసుకునే సౌలభ్యం ఉంటే, రోజూ పెట్టుకు చూద్దును ;). కొన్ని పాటలు చెవుల్లో రింగుమంటున్నాయి ప్రస్తుతానికి. మణిశర్మ అంటే విరక్తి పుట్టేసింది ఈమధ్య. ఈ పాటలు విన్నాక, కాస్త మళ్ళీ ఆసక్తి కలిగింది.

ఇంతకీ నే చెప్పొచ్చేది ఏమిటంటేనండీ – సుత్తేసినా, నసపెట్టినా : మా తాతయ్య చెప్పేది నాకు బోరు కొట్టినా, పంచాయితీ పెట్టి రివర్సు హామరింగ్ చెయ్యను నేను. ఆయనలా పది క్లాసులు తీస్కున్నా వెళ్లి కూర్చుంటా. విననీ, వినకపోనీ: అది మీకు, నాకు, ఆఖరుకి తాతయ్యకి కూడా అనవసరం అనమాట. ఎవరైనా తాతయ్య గురించి అడిగితే – తాతయ్య రాక్ స్టార్ అని చెప్తాం గానీ, ఈమధ్యా…ఆయనలో ఒకప్పటి చార్మ్ లేదండీ… తెల్ల వెంట్రుకలు వచ్చేసాయీ…పళ్ళు ఊడుతున్నాయీ…. కాళ్ళు నొప్పులంటారు…. పట్టుమని పది కిలోమీటర్లు కూడా నడవలేరు…అదేం పాడో…. అని పంచాంగం విప్పుతామా చెప్పండి?

ఏమైనా అర్థమవుతోందీ?

అన్నట్లు, నేను రాసింది చదివి ఈ సినిమా చూడకూడదు అనుకునే ఆ పదిమందేవరో గానీ – నేనేదో నా మానాన నా అభిప్రాయం చెప్పుకుంటున్నాను. మీ ఇష్టం ఉంటే చూస్కోండి, లేకుంటే లేదు. ఇక, హీరోకో, హీరోయినుకో, దర్శకుడికో ఉండే అభిమానులకు: మీ సినిమా కేకండీ. ఏదో, నాకు కాస్త చేతి దురద, బోలెడంత అజ్ఞానం… అంతే.. 🙂

అన్నట్లు, ఇదేం సినిమానో కనుక్కున్న వాళ్ళకి బహుమానాలేం లేవు. హీరోయిన్ పేరు చెప్పాక ఎంతసేపు చెప్పండీ? వందలకొద్దీ సినిమాల్లో చేస్తారా ఏమీటీ పరభాషా తెలుగు హీరోయిన్లు? 🙂

Advertisements
Published in: on December 27, 2011 at 6:00 am  Comments (2)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/12/27/cinegnanodayam/trackback/

RSS feed for comments on this post.

2 CommentsLeave a comment

  1. shubhapradam anukuntunna correctenaa andee?

  2. 🙂 🙂


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: