ఉరుమి – సినిమా, పాటలూ, కత్తీ, చరిత్రా!

మొన్న వారాంతంలో ఉరుమి సినిమా చూశాను. ఆ తరువాత ఉరుమి పాటలు అదే పనిగా విన్నాను. ఆ తరువాత “ఉరుమి ఎందుకు చూడాలి?” అని ఒక వ్యాసం చదివి ఆవాక్కయ్యాను. అటుపై, ఉరుమి ఎందుకు చూడకూడదు? అని కౌంటర్ వేద్దామనుకున్న వారి అభిప్రాయాలు విన్నాను. ఇన్నీ వింటూ ఉండగా, మదీయ మానసం అంతర్ఘోష మొదలుపెట్టెన్ – నా మాటలూ బయటపెట్టు అని.

నాకు సినిమా నచ్చింది. ఎందుకూ?
1) చందమామ కథలా భలే ఉంది
2) హీరో పృథ్వీరాజ్ కూడా భలే చేశాడు. భలే కాదులే…. భలే భలే భలే.
3) మొదటిసారి అక్కడ జెనీలియా కాకుండా, ఆమె నటించిన పాత్ర కనబడ్డది
4) పాటలు డబ్బింగ్ అయినా కూడా నాకు నచ్చాయి. మార్చి మార్చి ఒక నాలుగు పాటలే మళ్ళీ మళ్ళీ వింటున్నా.
5) సినిమటోగ్రాఫర్లు సినిమా తీస్తే చెప్పేందుకేముందీ, ఫ్రేము ఫ్రేమూ అందంగా ఉంది.
6) మంత్రి పాత్రధారి జగతి శ్రీకుమార్, ఆయనకి డబ్బింగ్ చెప్పిన గాత్ర ధారి – ఇద్దరూ అద్భుతంగా చేశారు
7) సినిమాలో పైకి కనబడకుండా ఒక్కోచోట హాస్యం ఉంది. ఉదాహరణకి – నిత్య మీనన్ వాళ్ళని దుండగులు అటకాయించినపుడు ఆమె పెద్ద ధీరవనిత లెవెల్లో మీరు నన్నేం చేయలేరు అన్నట్లు స్టేట్మెంట్ ఇస్తుంది. మనం అక్కడ ఏదో జరిగిపోతుంది, ఆవిడొచ్చి యుద్ధం చేస్తుంది అనుకుంటాం. కానైతే అక్కడ ఆవిడేం చేయదనమాట… ఇలాంటివి చూసి భలే నవ్వుకున్నా. ఐనా కూడా సినిమా నాఖు నచ్చింది. 🙂

ఇంక సినిమాలో “ఐటెం” అనిపించే మనుషులు, సన్నివేశాలూ కూడా ఉన్నాయి కానీ, ఏదీ మరీ ఈ సినిమా ఎందుకు చూస్తున్నాం రా బాబూ! అనిపించేంత విసిగించలేదు.

ఇకపోతే, ఈ సినిమా చూసి మన చరిత్ర గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళంత అమాయకులు, అభాగ్యులు మరొకరు ఉండరు. నాకు అర్థమైనంతలో ఈ సినిమాలో చారిత్రక వాస్తవాలు ఏమిటంటే –

1) వాస్కోడిగామా మరీ అంత మా చెడ్డ మంచోడేం కాదు
2) అతగాడికి ఎస్టావియో అని ఒక కొడుకున్నాడు
3) అరక్కల్ అనీ, చిరక్కల్ అని రెండు రాజ్యాలు ఉండేవి. ఒకటి ముస్లిం, ఒకటి హిందూ రాజ్యం
4) ఉరుమి అని ఒక తరహా కత్తి ఉంది
5) కొందరు రాజులు/మంత్రులు/అధికారులు వాస్కో తాలూకా మనుషులకి సహకరించారు

ఇవి తప్పిస్తే మిగితా అంతా చందమామ కథే అని నా అనుమానం. అలాంటప్పుడు మనం మరుస్తున్న మన సంస్కృతి గురించో, ప్రపంచీకరణ వల్ల దెబ్బతిన్న ఆదివాసీ జీవన వ్యవస్థ గురించో, ఆంగ్లేయులు వక్రీకరించిన భారత దేశపు చరిత్ర గురించో, వాస్కోడిగామా నిజ స్వరూపం గురించో మనం ఒక అంచనాకి రావడానికి ఈ సినిమా సరైన మార్గం కదని నా అభిప్రాయం.

ఇక పోతే, కాలక్షేపానికి కూడా సినిమాలు చూడొచ్చు- సినిమా అన్నది మన కాలక్షేపం కోసం ఉన్న మీడియా అన్న ఆలోచన కూడా ఒకటి మనసులో ఉంచుకోవడం మంచిది, ఆరోగ్యానికి 😉 అన్నట్లు, ఇలాంటి కథల్లో – మనుషులు మంచోళ్ళు, చెడ్డోళ్ళు అని రెండు రకాలే ఉంటారు, చెడ్డోళ్ళు మంచోళ్ళౌతారు కానీ, రివర్సు జరగడం దాదాపు అసంభవం అన్నది అన్నింటికంటే ముఖ్యమైన చారిత్రక సత్యం.

Advertisements
Published in: on December 15, 2011 at 6:06 am  Comments (12)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/12/15/urumi/trackback/

RSS feed for comments on this post.

12 CommentsLeave a comment

 1. very nice

  ivalo repo zee telugu lo vasthundani promo chusanu

  ?!

  bye bye (katte kotte tecche commentry)

  🙂

 2. నాకు నచ్చిన సినిమాలల్లో ఇదొకటి. సంతోష్ శివన్ కోసం ఈ సినిమా చూడటం మొదలుపెట్టినా, ముద్దొచ్చే పృథ్వీ రాజ్ ని ఈ రకంగా చూడలేకపోయాను కాని బాగా చేసాడు. జెనిలియా పాత్ర చెప్పక్కర్లేదు తన సినేమాలన్నిటిలోను ఇది అద్భుతం. మొదటిసారి అక్కడ జెనీలియా కాకుండా, ఆమె నటించిన పాత్ర కనబడ్డది ఇది వాస్తవం. ఇందులో చాలా లోటు పాట్లున్నా కొన్నిటి కోసం చూడచ్చు.

 3. హ్మ్ బాగా చెప్పారు. నేను ఈ సినిమా రివ్యూలు చదివి చెప్పింది విని ఉరిమి గురించి కళల గురించి బోల్డు చెప్పారు కాబోలునని ఆశించి వెళ్తే అసలు ఆ కత్తి గురించి ఎక్కువ ఏమీ లేదు. కొందరు కొన్ని సినిమాలకి బాగా కనెక్ట్ అవుతారు ఇతరులకు వాళ్ళు చెప్పినంతగా అనిపించదు.

 4. some of the pionts abt vasco da gama are true,

  ” Da Gama continued north on his return path. Once he had reached the northern parts of the Indian Ocean, da Gama waited for a ship to return from Mecca and seized all the merchandise on it. He then ordered the hundreds of passengers be locked in the hold and the ship – named Mîrî, and which contained many wealthy Muslim merchants — to be set on fire”

  http://en.wikipedia.org/wiki/Vasco_da_Gama

 5. @Sravan: That is what I meant to when I said, Vasco is not exactly a “good” guy.

 6. గ్రాఫిక్సూ, హీరో లారీడు జనాలను చితక్కొట్టడమూ, చేయి విదిలిస్తే నలుగురు గాలిలో తేలుతూ వెళ్ళి కారు అద్దాలకు కొట్టుకోవడమూ, హీరో ప్రగల్భాలూ, ఇలాంటివి లేకుండా కొంత రెఫ్రెషింగ్ సినిమా కింద చూడవచ్చు.

 7. లెస్స పలికితిరి.

  నేనూ కొన్నిరోజులు మలయాళం పాటలు ఎట్టుకుని విన్నాను. ఉరుమి గురించి గూగిలిస్తే కొన్ని విషయాలు తెలిసాయ్.

 8. ’సినిమాలను సినిమాలానే చూడాలి.’, ’సినిమా కాలక్షేపం మాత్రమే’, ’సినిమా చూసి నచ్చినది మాత్రమే గ్రహించి, నచ్చనిదాన్ని విసర్జింజాలి’ మార్కు స్టేట్మెంట్స్ వల్ల ఒక సాధారణ సినిమాను వెనకేసుకురావచ్చేమో గాక! తప్పులేదు. కానీ అవ్వన్నీ నిజమైతే, ఎంచక్కా ’మాదో కాలేక్షప సినిమా, చూసి రండి’ అని చెప్పుకోకుండా, ’భూతభవిష్యత్త వర్తమానాల్లో కనివిని ఎరుగని సినిమా’ అంటూ బిల్డప్‍లు ఇచ్చుకోవడం దేనికి? ’భోజనం తయారు’ అన్న బోర్డు చూసి లోపలకెళ్ళినవాడు వడ్డించేదానితో కడుపు నింపుకొని వస్తాడు. అదే ’ఇంద్రభవనపు సెట్టింగ్‍లో పంచభిక్షపరమాన్నాలు పెడుతున్నామహోచ్’ అని ఊదరగొట్టి, చివర్న మాత్రం ’సినిమాను సినిమాలా..’ అంటూ మొదలెడితే నాబోటి వాళ్ళకు మండుతుంది.

  అయినా ఒక సినిమాను అనేక పదార్థాలు కలిపి వండిన వంటకంగా తలచి, స్పూనుడు నోట్లో పెట్టుకొని బాగుందో, లేదో చెప్పకుండా, ’కూరగాయ ఉండకకపోయినా, గ్రేవీ బాగుంది. కొంచెం ఉప్పు తక్కువైనా కారం సరిపోయింది. అయినా నాలుక మనది కాదనుకొని తినేయొచ్చు.’ అని అంటే మరి, ఏం చెప్తాం? జిహ్వకో రుచి అని ఊరుకోటం తప్పించి.

  పై రెండు పేరాలు, పోస్టులో చివరి పేరాకు సమాధానం.

  ఇక, ఉరుమి నాకు నచ్చని కారణం.

  ౧. కథలో కొత్తదనం లేదు. పాతకథే అనుకున్నా, కథను గ్రిప్పింగ్‍గా చెప్పటంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. A story teller should *know* the story he’s telling and then tell it effectively. ఈ రెండు విషయాల్లోనూ దర్శకుడు నన్ను ఇంప్రెస్ చేయలేకపోయాడు. కథ అత్యంత సామాన్యం. అందమైన ఫొటోగ్రఫీ కొద్దిగా ఆదుకున్న కథను పూర్తిగా కాపాడలేకపోయింది. కాపాడలేదు కూడా. సహజసౌందర్యం లేని చోట ఎంత మేకప్ కొడితే ఏంటి లాభం?

  అదే ’ది ఫాల్’ అనే హాలివుడ్ చిత్రం తీసుకుంటే, అది కూడా visually grand movie. కానీ ఆ ఫ్రేమ్స్ ను అవరేజ్ టెకింగ్‍తో చూపించినా, కథ అంతే బాగుంటుంది. అందానికి అలంకారాలు గానీ, అలంకారాలే అందాలు కావు. కాలేవు.

  ౨. అనవసరపు కారెక్టర్లు ఎక్కువ అనిపించారు. ప్రభుదేవా పాత్ర ఎందుకో అర్థం కాలేదు. Tabu was wasted. Vidya was not used to the fullest.

  ౩. ’కథ ఒక్కప్పటిది అని చెప్తాం. అప్పటి కొన్ని చారిత్రక పేర్లనూ వాడుకుంటాం. కానీ మిగితావేవీ ఆ వాతావరణానికి అనుకూలంగా మల్చం. అవ్వన్నీ మాకు అనుకూలంగా ఉంటాయే తప్ప, కథకు కాదు’ అన్నట్టుగా ఉంటాయి పాత్రల భాషా, వేషధారణ.

  ౪. కొందరి నటీనటుల విషయంలో మనం కాంప్రమైజ్ అవుతున్న తీరు నాకు చాలా ఆశ్చర్యాన్ని, కొంత చిరాకునీ కలిగిస్తున్నాయి. ఒక పాత్రను బాగా చేసారా, లేదా? అని కాకుండా, ఇప్పటి వరకూ సినిమాల్లో ఇదే నయం, ఇంతకన్నా ఆశించలేం అనే మాటలెందుకు వినిపిస్తున్నాయో అర్థం కాదు నాబోటి వాళ్ళకు.

  పృద్వి బా చేశాడా? చేశాడు. పీరియడ్.

  జెనిలియా చేసిందా? నో. చేయలేదు. ఆమె హావభావాలుగానీ, శరీర భాష గానీ, మాటలు పలికే తీరు గానీ ఏ మాత్రం వేరుగా లేవు. కొంచెం ఒళ్ళు దగ్గరపెట్టుకొని చేసుండచ్చుగాక, కానీ అది నటన అనిపించుకోదు. She was just average, despite her best efforts.

  ఒక మగధీర, ఒక ఉరుమి కారణాంతరాల వల్ల మంచి వ్యాపారం చేసుండచ్చు, డబ్బు గడించుండచ్చు, పేరు తెచ్చుకొని ఉండచ్చు. వాటిని ఏమన్నా అంటే కోపం తెచ్చుకునేంతటి అభిమానులూ ఉండచ్చు. అంతమాత్రం చేత అవి గొప్ప సినిమాలు అయిపోవు. కేవలం ఆయా సమాయాల్లో ఒకసారి చూసే కాలక్షేప సినిమాలుగానే మిగిలిపోతాయి. అంతకు మించి వాటికి సీన్ లేదు. వాటిని ఆకాశానికెత్తేసే జనాభా ఉన్నట్టే, వాటిని చీల్చిచెండాడే వాళ్ళూ ఉంటారు. మధ్యన హంసలూ ఉంటారు, పాలు మాత్రమే తాగుతూ, నీళ్ళను విడిచిపెడుతూ. 🙂 ఒక్కోరిది ఒక్కో తరహా!

 9. 😀

 10. వాటిని ఆకాశానికెత్తేసే జనాభా ఉన్నట్టే, వాటిని చీల్చిచెండాడే వాళ్ళూ ఉంటారు. మధ్యన హంసలూ ఉంటారు, పాలు మాత్రమే తాగుతూ, నీళ్ళను విడిచిపెడుతూ. 🙂 ఒక్కోరిది ఒక్కో తరహా!

 11. 😀 😀
  నీవెవరో చెలిమివో.. కనులకు కల నీవో..

 12. mitrulara meerandaru shivapuram ane movie chusara leda


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: