నీరాజనానికి ఒక అశ్రు నీరాజనం

నీరాజనం పాటలన్నా, వాటి సాహిత్యం అన్నా నాకు వల్లమాలిన వెర్రి వ్యామోహం. వరుసగా అలాగే పెట్టి రోజుల తరబడి వినిపించినా, వినడానికి సిద్ధపడిపోగలను. ఎస్పీబీ ఏద్చినా కూడా ఏడ్చినట్లుంది అనుకోకుండా భరించగలిగిన పాటలు ఇవేనేమో నాకు బహుశా! (“మనిషికి వలపే వరమా… మది వలపుకు వగపే ఫలమా…అది పాపమా విధి శాపమా…ఎద ఉంటె అది నేరమా” అంటూ నిజాలు చెబితే ఎవరికి నచ్చవూ అంట!)..సరే, విషయానికొస్తే, చిన్నప్పట్నుంచి నాకు నీరాజనం సినిమా ఎలా ఉంటుందో చూడాలని మహా కుతూహలం. ఇంత గొప్పగా పాటలు రాయబడ్డ ఆ సన్నివేశాలు ఎలా ఉంటాయో కదా! అని. అప్పట్లో నా తమ్ముడే అనుకుంటా – నువ్వూహించుకున్నట్లు ఉండదు అని వార్నింగ్ ఇచ్చినా కూడా నేనీ వెర్రి ఊహలు మానలేదు. తెలుగు వన్ వారి పుణ్యమా అని, ఇన్నాళ్టికి ఈ సినిమా చూడగలిగాను.

ఏం చెప్పేది కథ గురించి?? ఏం చెప్పేది? ఏం చెప్పకుండా ఉండేది?? ఎలా చెప్పేది? ఎలా చెప్పి చచ్చేది? చస్తూ చెప్పాల్సిందే…చెప్పి చావాల్సిందే…చెప్తే చావాల్సిందే! నహీ…నహీ…
ఆ పాటలు, సంగీతానికి – ఆ కథ ఎలా రాసుకున్నారో, ఆ నటుల్ని ఎలా ఎంపిక చేసుకున్నారో : చిదంబర రహస్యం అని వినడమే కానీ, అంటే ఏమిటో, ఆ భావన అనుభవంలోకి రావడం ఇదే ప్రథమం!

“నేనే సాక్ష్యమూ, ఈ ప్రేమయాత్రకేది అంతమూ” పాట వింటున్న ప్రతిసారీ నాకు వెన్నులోంచి చలి పుట్టుకొస్తుంది. చూస్తూ వింటూంటే మాత్రం- ఏడుపొచ్చింది. ఆ మాహానటుల నటన నాపై ప్రభావం చూపడం మూలాన కళ్ళొత్తుకుంటూ, “నేనే సాక్ష్యమూ… ఈ పిచ్చి ప్రేమకేది అంతమూ!” అని పాడుకుంటూ….. మొత్తానికి ఎలాగో గట్టెక్కాను.

సినిమాలో హీరో లాగా – నాకూ ఫిక్సేషన్ సిండ్రోం పట్టుకున్నట్లు ఉంది. సినిమా చూశాక కూడా నా మనసులో చిత్రించుకున్న నీరాజనాన్నే ఊహించుకుంటూ… అక్కడంత సీన్ లేదు అని తెలిసాక కూడా ఆ విషయం పట్టకుండా ఉండడాన్ని “ఫిక్సేషన్ సిండ్రోం” అంటారు ఆ సినిమాలో డాక్టర్ భాషలో!

“వేచి వేచి పాడుతున్న పాటకు
పాటలోన కరుగుతున్న జన్మకు”
అంటూ జానకి పాడుతూ ఉంటే, నాకు-
“వేచి వేచి ఆడుతున్న ఆటకూ
ఆటలోన అంతమవ్వు ఆశకూ”
-అంటూ విధి ఆడే వింత నాటకం గురించి అంతర్వాణి ఘోష కూడా వినబడ్డది.

ఏమైనా, కొన్ని చోట్ల సంభాషణలు ఎంత అద్భుతంగా ఉన్నాయో… అవి వచ్చే సన్నివేశాలూ, మహానటుల నటనా చూస్తూ… హతోస్మి అనుకున్నా.
చివరకి, సినిమాలో గొప్ప సింబాలిజం ఉంది… నాకే అర్థం కాలేదు : అనుకునే స్థాయికి వచ్చేసా నా నయ్యర్/జానకి వెర్రిలో.

నేపథ్య సంగీతం కూడా మిస్సవ్వకూడదు అనేసి, అసలు క్షణమైనా ఫాస్ట్-ఫార్వర్డ్ చేయకుండా చూసి,
“అంత అందమైన మొహమేమిటి…ఆ మొహానికి ఆ పేరేమిటి” అని రుద్రవీణలో చిరంజీవిలా… “అంత అద్భుతమైన పాటలేమిటి..ఆ పాటలున్న ఆ సినిమా ఏమిటి”….. అనుకుంటు వెర్రి చూపులు చూస్తూ మిగిలిన నన్ను అర్థం చేసుకునే అభాగ్యులెవ్వరు? ఎచ్చోటనున్నారు??

“మరచిన మమతొకటి..మరి మరి పిలిచినది.
తొలకరి వలపొకటి…తలపుల తొలచినది
గత జన్మలా…అనుబంధమై….”
-ఇలా పాడుకుంటూ నేనూ, హీరోలా జలపాతం మధ్యలో డైల్యూషన్ చింతలేకుండా, బాటిల్ పట్టుకు తాగుతూ కూర్చోవాలో ఏం ఖర్మో!! అన్నట్లు, ఈ సినిమాలో సోమయాజులు డైలాగు ఒకటి ఈ సందర్భంలో గొప్ప నిజం అనిపిస్తోంది- “ఖర్మకు అందరూ లోకువే”…..

అందుకే…. అశ్రు నీరాజనం…. ఏం రాస్తున్నానో కూడా తెలీనంత ఏడుపులో రాలుస్తున్న ఆశ్రువులు…అవే అక్షరాలు అనమాట.

“మర్చిపోవడం నీకు నేను నేర్పించాను. నేర్పించిన నన్ను మర్చిపోవడం నీకంత కష్టం కాదు. బై” – అన్న శరణ్య డైలాగు గుర్తు తెచ్చుకూంటూ….. రంగస్థలం నుంచి ఈసారికి రిటైర్ అవుతున్నాను.

Advertisements
Published in: on December 8, 2011 at 1:09 am  Comments (10)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/12/08/nirajanam-movie/trackback/

RSS feed for comments on this post.

10 CommentsLeave a comment

 1. 1989లో అనుకుంటా నీరాజనం విడుదలైంది. ‘అభినందన’ వంటి సూపర్ హిట్ సినిమా తీసిన సినిమాటోగ్రఫర్ కె. అశోక్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన రెండవ సినిమా ఇది. అప్పటికే పాటలు విడుదలై ఆంధ్రదేశాన్ని ఓ ఊపు ఊపాయి. (అదే ఏడాదొచ్చిన ‘గీతాంజలి’తో పోటీ పడి ఈ సినిమా ఉత్తమ సంగీతం విభాగంలో నంది అవార్డు ఎగరేసుకుపోయింది. ఇప్పట్లా కాకుండా, అప్పట్లో నంది అవార్డులకి బానే విలువుండేది లెండి). ఒ.పి.నయ్యర్ చేసిన ఒకే ఒక తెలుగు సినిమా. పాటలు ఇప్పుడు విన్నా బాగుంటాయి – పాటలే కాక వాటికి చేసిన ఆర్కెస్ట్రైజేషన్ సైతం.

  సినిమా పాటల గురించి ఇంతగా చెప్పటం దేనికంటే, మీరన్నట్లు ఈ సినిమాలో పాటలు తప్ప మరేమీ లేదు. “ఆ పాటలు, సంగీతానికి – ఆ కథ ఎలా రాసుకున్నారో” అని మీరు తెలిసన్నారో తెలీకన్నారో కానీ, ఈ సినిమాకి నిజంగానే ముందు పాటలు రాయించి, రికార్డ్ చేయించి తర్వాత వాటికి తగ్గ కథ రాసుకున్నామని సినిమా నిర్మాణంలో ఉండగా దర్శక నిర్మాతలు గొప్పగా చెప్పుకునేవాళ్లు. సినిమా పూర్తయ్యాక ప్రేక్షకుల కన్నా ముందే చూసిన పంపిణీదారులు లబోదిబోమంటూ పారిపోవటంతో ‘నీరాజనం’ ఏడాదికి పైగా బాక్సుల్లోనే మగ్గి, చివరాఖరికి ఆంధ్రప్రదేశ్ మొత్తమ్మీద ఐదంటే ఐదు సినిమా ధియేటర్లలో విడుదలయింది. (వాటిలో విజయవాడ ఒకటి).

  మళ్లీ పాటల దగ్గరికొస్తే, నీరాజనం పాటల కేసెట్లో బోనస్‌గా ఎమ్మెస్ రామారావు గారితో ప్రత్యేకంగా పాడించి రికార్డు చేసిన ‘ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో’ పాట ఉంటుంది. సినిమా పాటల కన్నా కూడా ఇది ఇంకా బాగుంటుంది.

 2. అన్నట్లు – ఉత్తమ నేపధ్య గాయకుడి విభాగంలో ఎస్పీ బాలుకే అవార్డు ఖాయమని ముందే అందరికీ తెలిసినా (అప్పట్లో ఐతే బాలూ లేకపోతే జేసుదాసు – వీళ్లిద్దరికే కదా అన్ని అవార్డులూ), గీతాంజలిలో ‘ఓ పాపా లాలి’ కి వస్తుందనుకునేవాళ్లం. అనుకున్నట్లు బాలూకే వచ్చింది కానీ అది నీరాజనంలో ‘మమతే మధురం’ పాటకి.

 3. అబ్రకదబ్ర గారికి: వివరాలకు ధన్యవాదాలు. ముందు పాటలు రాయించుకుని కథ అనుకున్నారేమో అని నాకు అనుమానం వచ్చిందంతే. అంతకు మించి నాకేం తెలీదు. ఎమ్మెస్ రామారావు గారి పాట మా ఇంట్లో ఉన్న ఆడియో కేసెట్ లో ఉండేది. చిన్నప్పుడు నచ్చేది కాదు కానీ, పెద్దయ్యాక వింటే నచ్చడం మొదలుపెట్టింది.

 4. “ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో’
  That’s an awesome song! ఎన్ని సార్లు విన్నానో, ఇన్ని ఈయర్స్ లో!!

  నేనూ ఆ సినిమా చూసిన తర్వాత, పక్క కాలవ లో మునిగి ఆత్మహత్య చేసుకొని, మళ్ళీ కొత్త జీవితం గడుపుతున్నాను :-))

 5. నీరాజనంలో ప్రతీపాటా బాగుంటుంది.

  అయితే సినిమా గురించి (సినిమా చూడొద్దని) ముందే హెచ్చరిస్తున్నారన్నమాట.

  ఇంతపెద్ద సమీక్షలో నీరాజనం కథని పిసరంత కూడా బయటపెట్టకుండా బాగా వ్రాశారండీ…

  • ఇంతా చెప్పాక కూడా కథ గురించి ఆలోచించగలుగుతున్నారంటే…. 😉
   అయినా వాళ్ళకే తెలీదండీ కథ…మనకేం చెబుతారూ…చోద్యం కాకపోతే…వాళ్ళలో వాళ్ళు రెడీలో బ్రహ్మానందంలా..”నేను అపర బ్రహ్మనంటావా?” అనుకుంటూ తీసి ఉంటారు. కుమార్ గారు అన్నట్లు, ఆ సినిమా చూస్తే, మీ చుట్టుపక్కల్లో ఏదో ఒక కాలవలో మునిగి, తర్వాత కొత్త జీవితం గడపాల్సిందే!

 6. హయ్యో చెప్పకండి…నేనూ ఒకసారి బలయ్యాను. నాకు ఈ “విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో” పాట చాలా చాలా చాలా ఇష్టం. రేడియో లో వస్తే చేస్తున్న పనులన్నీ ఆపేది వినేదాన్ని. కేసెట్ లో రికార్డ్ చేసుకుని పదే పదే వినేదాన్ని. ఎన్నిసారు విన్నా బోర్ కొట్టదు పైగా అంతకు అంత ఆస్వాదిస్తాను. ఆ పాట కోసమని ఒకసారి టీవిలో ఈ సినిమా వస్తే మొత్తం చూసాను. ఎంతకూ ఆ పాట రాదు….ఎంతకూ సినిమా అవ్వదు. శరణ్య కొంచం ఫరవాలేదుగానీ ఆ హీరోని భరించడం నా వల్ల కాదు. ఆ కథేంటి, ఆ జలపాతం దగ్గర ఆ హీరో కూర్చుని ఆ విలపించడం ఏంటి…బాబోయ్ తలుచుకుంటే ఇప్పటికీ సన్నగా వెన్నులో వణుకు పుడుతున్నాది.

 7. hello, sowmya gaaru neeraajanaaniki neenu balayyanandi. kaanee daanilo songs vallee mally bratikaanu.

 8. bhale bhale .. *claps*
  bhale bhale .. *claps*

  nenu ee cinema ffwd chestu kuda choodalekapoya 😛

 9. ఈ పోస్ట్ నేను ముందే ఎందుకు చూడకపోతిని హతోస్మీ…
  నేను కూడా బలయ్యేవారి లిస్టులో చేరకపోదును…నిన్ననే..చూశా ఈ సినిమా బుర్ర బద్దలై..నా మీద నాకే ఓలాంటి జాలి కలిగింది…పాటల మాయలో సినిమా ఇంకెంత అపురూపంగా ఉంటుందో అని చూసి బోల్తా పడ్డా….ఇంత ఘోరంగా…చెత్తగా కూడా సినిమా తీయవచ్చని నిరూపించిన దర్శక నిర్మాతలకు హాట్సాఫ్ చెప్పాలనిపించింది…హీరోతో పోల్చుకుంటే హీరోయిన్ కాస్త నయం…ఓ.పీ.నయ్యర్ పుణ్యమా అని సినిమా ఇంకా జనాల నోట్లో నానుతుంది…అశ్రు నీరాజం బాగుంది…అక్షరం అక్షరం నాది కూడా అదే ఫీలింగ్…


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: