మంచు… మంచమ్మాయి కాదు!

సాయంత్రం యూనివర్సిటీ ప్రాంతాల నుంచి ఇంటికి బయలుదేరుతూ ఉంటే సన్నగా వర్షం మొదలైంది. గొడుగు నా బ్యాగులోనే ఉందన్న విషయం స్ఫురించలేదు నాకు. దానితో, అలా కొంచెం తడుస్తూనే, బస్ స్టాపు దాకా వెళ్ళి బస్సెక్కా. ఎక్కిన రెణ్ణిమిషాలకి కిటికీలోంచి బయటకు చూస్తూ ఉంటే, వర్షం పడుతూనే ఉన్నా, మధ్యలో తెల్లగా ఏవో రాలుతున్నాయి. నేను వడగళ్ళనుకుని ఖంగారు పడిపోయా… చిన్నప్పుడు కర్నూల్లో ఒకసారి వడగళ్ళ వానలో రెండు మూడు వడగళ్ళు ఫెడేల్,ఫెడేల్మని నన్ను కొట్టిన విషయం గుర్తొచ్చి.

ఒక మూణ్ణాలుగు నిముషాల తరువాత తట్టింది – ఆ వడగళ్ళ శబ్దం రావడం లేదే అని. అప్పుడే, బహుశా అది మంచేమో? అన్న ఆలోచన వచ్చింది. ఆసరికే అందరూ నాలాగే కిటికీల్లోంచి బయటకు చూస్తున్నారు. స్టాపు రాగానే దిగి గొడుగు తీశానా… నాకు భలే నచ్చేసింది ఆ పది నిముషాల నడకా… 🙂

అవి అలా కోటు మీద పడ్డం – పడీ పడగానే కరిగిపోవడం. నాకు ఒక ఆటలా ఉండింది 🙂
అసలుకే ఇదే మొదటిసారి నాకు మంచు అన్న దాన్ని చూడ్డం. అక్టోబరు నెల్లో ఒక రోజు మరీ ఉదయాన్నే జాగింగని వెళ్తే, ఆ వేళ నా షూస్, ప్యాంట్ అంతా తెల్లగా మారిపోయాయి – దానికే అబ్బురపడిపోతే, అప్పట్లో “ఇంకా నువ్వు మంచు చూడనేలేదుగా” అని జవాబు వచ్చింది. మంచంటే – విడిగా వస్తుందేమో అనుకున్నా. పాపం నాకోసం ఇలా వర్షంలోనే వచ్చేసింది 😛

అది నిజంగా “ఆశ” అన్నదాన్ని పునరుజ్జీవితం చేసింది (దేని మీద?? దేనిమీదైనా!) అని నేననను కానీ, ఏదో, “బావర్చి” సినిమాలో రాజేశ్ ఖన్నా అన్నట్లు – “జీవితంలో పెద్ద స్థాయిలో ఆనందం కలిగించే సంఘటనలు పదో ఇరవయ్యో జరుగుతాయి. వాటి వేటలో వేలకొద్దీ చిన్న చిన్న ఆనందాలు మిస్సయిపోతూ ఉంటాము” అనుకుని, “లివింగ్ ఇన్ ది మొమెంట్” అనమాట….

అందుకే, నిన్నట్నుంచి కనబడ్డ ప్రతి స్నేహితుడి/రాలికి, ఇంట్లో అందరికీ చెబుతూనే ఉన్నా … నిన్నటి అనుభవం గురించి 🙂

Advertisements
Published in: on December 7, 2011 at 12:36 pm  Comments (10)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/12/07/%e0%b0%ae%e0%b0%82%e0%b0%9a%e0%b1%81-%e0%b0%ae%e0%b0%82%e0%b0%9a%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%be%e0%b0%af%e0%b0%bf-%e0%b0%95%e0%b0%be%e0%b0%a6%e0%b1%81/trackback/

RSS feed for comments on this post.

10 CommentsLeave a comment

 1. మంచు.. మంచు.. మంచు.. నేను నీకు బోల్డంత మంచుని చూపిస్తాలే! 😉 😀

 2. meeru malla manchu laxmi gaari gurinchi cheptunnaranukunna……

  nice post.

 3. same nenu alane anukunna haram lo chusi

  ?!

 4. నిజంగా మొదటిసారి మంచు పడడం చూస్తే కలిగిన అనుభూతి మరువలేనిది. నేను మనాలి లో ఉన్న మూడు రోజులూమంచు కురిసింది…ఎంత excite అయ్యానో! మీరే పరిస్థితిలో ఉండి ఉంటారో నేనూహించగలను 🙂
  enjoy the moment!

 5. meeru malla manchu laxmi gaari gurinchi cheptunnaranukunna……

 6. మీ టైటిల్ మంచు వారమ్మాయి మంచి అమ్మాయి కాదన్నట్టు భ్రమపడ్డాను

 7. hmm,disappointed.

 8. అయ్యో! మీరంతా ఇంత మిస్సవుతున్నారా మన మంచమ్మాయిని!!
  ఉండండి, మీ అందర్ని మించి నేనెంత మిస్సయ్యానో చెబుతాను త్వరలో. ప్రేమలో దెబ్బతిన్న వాళ్ళు మళ్ళీ ఎలా కొత్త జీవితం మొదలుపెట్టాలో ఎవ్వరికీ పనికిరాని చిట్కాలు చెబుతా అందులో …. హీహీహీ….

 9. మనసు నిన్నే తలంచు .. కురవనీలే మంచు .. Let it snow పాటకి నా సొంత తర్జుమా 🙂

  తనివితీరా మంచానంద (మంచు + ఆనంద) ప్రాప్తిరస్తు

 10. Waiting for the moment here 🙂


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: