నేనూ, విధి, చెస్ – చస్!

ఇవ్వాళ అనూహ్యంగా ఎక్కువసేపు ఆఫీసులో ఉన్నాను. రేప్పొద్దున్నలోపు ఇంట్లో చేయాల్సిన పనులు బోలెడు ఉండగా – ఆఫీసులో ఎందుకు కూర్చున్నా? అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఎదురుగ్గా రోడ్డవతల జింలో చెమటోరుస్తున్న జీవులు – ఆకురాలు కాలానికి సాక్ష్యాలు. బయట నేను అనుకున్నంత చలి లేదు.

ఈ పరిస్థితుల్లో, రాలుతున్న ఆకులని, రాలనంటున్న కాలాన్ని తలచుకుంటూ, బస్సెక్కి ఇల్లు చేరానా, నోరు మూసుకుని ఇంటికొచ్చిన దాన్ని వచ్చినట్లు ఉండక, “అబద్ధం” సినిమా చూడ్డం మొదలుపెట్టాను. అబ్బో! ఇంత చిత్ర విచిత్రమైన సినిమాలు మనవాళ్ళు తీస్తారని ఊహించలేదు సుమండీ! ఒకదానికొకటి సంబంధం లేకుండా, అలా ఎలా తీస్తారో ఏమిటో, ఎంత బాలచందర్లైనా కూడా!!! ఈ సినిమా మొత్తానికి సంగీతం మాత్రం బాగుంది. డబ్బింగ్ అయినా అక్కడక్కడా లిరిక్స్ బాగున్నాయి.
అలాగే, సీనరీలూ, బుద్ధ భగవత్ దర్శనాలు అద్భుతం.

విథి-కల్పిత పాత్రా వైకుంఠపాళి ఆడుతూ ఉంటే, నేను ఒక ఇండియన్ సెవెంత్ సీల్ ని ఆశించాను. విధి నాతో కూడా వైకుంఠ పాళీ ఆడుతోందని సినిమా చివరి దాకా నాకు అర్థం కాలేదు. ప్రతి చోటా ఏదో గొప్ప సంఘటన జరుగుతుంది అనుకోవడం, భంగపడ్డం – అచ్చం జీవితం లాగే అనిపించింది “అబద్ధం” నాకు!

ఆ పాత్రలేమిటో, వాటి భాషలేమిటో, అన్నింటికీ మించి ఆ తమిళ యాస ఏమిటో, అమృతం కురిసిన రాత్రి అనేసి, తమిళ పుస్తకం ఇవ్వడం ఏమిటో…. మరో తమిళ పుస్తకాన్ని త్వమేవాహం చేయడం ఏమిటో…పిచ్చి వెర్రి కల… జీవితం…అబద్ధం. ఆ హీరోయిన్ సంజ్హే సంజ్హే అని మాటకి రెండుసార్లు అరుస్తూ ఉంటే, నాకు జంబలకిడిపంబ సినిమాలో జయలలిత వెనుక “ఝే ఝే ఝే…” అని అరుస్తూ తిరిగిన ఆమె ఫాలోయర్స్ లాగ అరవాలి అనిపించిందంటే, మీరు నమ్మాలి. తప్పదు. విధి బలీయమైనది కదా! ఇక, రైలు పట్టాలు కాక, పిచ్చి ఉల్లు కా పట్టాలు, మగ పట్టాలు, ఆడ పట్టాలు కూడా ఉంటారని…ఈ సినిమా చూసాకే తెలిసింది. పాపం, ఆ డబ్బింగ్ ఆర్టిస్టులని తలచుకుంటూ ఉంటే, జాలి పొంగి పొర్లి ఈ సినిమాలో చూపిన అందమైన సముద్రం అంత జోరుతో ముంచబోతోంది నా జీవితాన్ని!

ఇది ఎందుకు నా “కంట పడెనే” …. అని పాడుకుంటూ, నాకు చెస్ చేతకాదు అని తెలిసినా, చస్! అని మెదడుని విదిల్చి కొట్టి, విధి తో నేనూ చెస్ ఆడడానికి సిద్ధపడుతూ…….

Advertisements
Published in: on October 18, 2011 at 3:21 am  Comments (6)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/10/18/%e0%b0%a8%e0%b1%87%e0%b0%a8%e0%b1%82-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a7%e0%b0%bf-%e0%b0%9a%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%9a%e0%b0%b8%e0%b1%8d/trackback/

RSS feed for comments on this post.

6 CommentsLeave a comment

  1. హహహ మీ రివ్యూ బాగుందండీ! మొన్నా మధ్యన ఈ సినిమా చూద్దామని పెట్టి అయిదు నిమిషాలు చూసాక ఛి అని కావాలంటే తమిళంలో చూడటమే మంచిదని చూడకుండా బ్రతికిపోయాననిపిస్తోంది మీరు వ్రాసినది చదువుతుంటే!

  2. 😀 😀 😀

  3. Promise Soumya gaaru naalife lo ee movie chuudanu. Thanks for saving me.

  4. Oh Yes. Appatlo ee movie gurinchi athruthaga eduru chusa. Kaani eppudu vachi vellipoindho theliledhu :P… Mothaaniki bagundhi annamata 😛

  5. I agree … intha vichitra cinemaalu teestharu ani neenu kooda anukoledu… ayithe antha kante vichithramayina blogulu kooda raastarani ippude telisindhi…

  6. 😀 😀 😀


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: