“మో”నిషాద పంక్తులు

కొన్నాళ్ళ క్రితం “మో” నిషాదం పుస్తకం చదివేందుకు ప్రయత్నించి ఆ భాషకీ, పోస్ట్ మాడర్నిజానికీ నేను సిద్ధంగా లేనని నిర్ణయించుకుని, వదిలేశాను. అయితే, చదివిన కాస్తలోనే నాకు కొన్ని బాగా గుర్తుండిపోయాయి. అవన్నీ అలా టైపు చేస్కుని సేవ్ చేస్కున్నాను. ఇవ్వాళ ఉన్నట్లుండి మళ్ళీ వాటిని చదువుతూ ఉంటే, పబ్లిగ్గా పంచుకోవాలి అనిపించింది.

గుసగుసల రహస్యాల సరస్సు మనస్సులో
మబ్బుతునక ఒకటి మునిగిపోయినప్పుడు
శుక్ర నక్షత్రం కాలిపోయి
నీ నుదుట విభూది అయినపుడు
అనుమానాలూ, అవమానాలూ అన్నీ
అవజ్ఞ లోకి ఒక్కసారిగా విసిరేసి
నిస్సంకోచంగా నా దగ్గరికి
నడచిరా, నిర్మోహంగానే.

“- ఆహ్వానం.”

అంతర్మథన పర్యంకంపై తిరుగుతున్నా పంకాని
నొక్కిందెవరు, దాని మీట చెక్కిందెవరు?

(హిందోళనారాగం)

“షాక్ ఆఫ్ ది ఫేమీలియర్ లా నువ్వో అదృశ్య స్పర్శ”
(స్వర్గాదపి)

“తలపులూ పిలుపులేనేమో
దరిజేరని గాద్గాదికాలేమో!”

“పోలమారిందేమో
తెలివేకువల
పొలిమేరల
ఎదగడియల
పొద వీడిందేమో”

(ద్రోహి)

“సహవాసుల్ని తన్నేసి
నిద్రారణ్యంలో మేల్కో!”
(విద్రోహి)

నేనసలే దుఖపు లాగూని తిరగేసి
తోడుక్కుంటూన్న వాడిని
తడిపి పిండేసి ఉతికి ఆరేసి మరగేసి
మరో సూర్యోదయానికి ఎండేసుకుంటున్న వాణ్ని.

(“ఇక పునర్నిర్మాణం”)

Advertisements
Published in: on October 12, 2011 at 6:27 pm  Comments (6)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/10/12/%e0%b0%ae%e0%b1%8b%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b7%e0%b0%be%e0%b0%a6-%e0%b0%aa%e0%b0%82%e0%b0%95%e0%b1%8d%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2%e0%b1%81/trackback/

RSS feed for comments on this post.

6 CommentsLeave a comment

 1. ‘మో’ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో మీకు తెలిస్తే, చెప్పగలరు.

 2. @Ramana: I don’t know about others. But, “Nishadam” is available for online purchase, at kinige.com. http://kinige.com/kbook.php?id=120

 3. ఆహా అంత అద్భుతంగా ఉందో! ముఖ్యంగా ఈ వాక్యాలు
  శుక్ర నక్షత్రం కాలిపోయి
  నీ నుదుట విభూది అయినపుడు
  అనుమానాలూ, అవమానాలూ అన్నీ
  అవజ్ఞ లోకి ఒక్కసారిగా విసిరేసి
  నిస్సంకోచంగా నా దగ్గరికి
  నడచిరా, నిర్మోహంగానే.

 4. Who is this writer Sowmya..!! I was surprised to see the lines posted by you. Pls let me know where should I find this book

 5. @Praveen: He is “Mo” or “Vegumta Mohanaprasad”. His books are available..atleast some of them..in major book stores in AP. “Nishadam” e-book can be purchased at kinige.com.

 6. too late for me to know about him, he was passed away on 11th August 2011


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: