గుర్తుకొస్తున్నాయి..కాంచన

నాకు పాతతరం నటి కాంచన అంటే చిన్నప్పుడు ఒక విధమైన ఫాసినేషన్. చిన్నప్పుడు సినిమాలో కాంచన ఉంది అని చెప్తే చాలు, చూసేసేదాన్ని. అందునా, ఆమె ఎయిర్ హోస్టెస్ గా ఉండి నటి అయ్యిందని మా అమ్మ చెప్పాక, ఫాసినేషన్ మరింత పెరిగిపోయింది. పెద్దయ్యేకొద్దీ కూడా, అలాగే ఉండింది కానీ, రాన్రాను సినిమాలు చూడ్డమే తగ్గింది కనుక, వదిలేశా. ఆమధ్యెప్పుడో మొదట పేపర్లో ఆవిడిప్పుడు పరమ బీదరికంలో ఉన్నారని వార్త రావడమూ, ఆ తరువాత కొన్నాళ్ళకి దాన్ని ఖండిస్తూ ఆమె వివరణ ఇవ్వడమూ చూశాను. అంతే కానీ, ఆవిడ గురించి పెద్దగా ఏమీ తెలియదు.

ఇవ్వాళ ఒక సైటు చూస్తూ ఉంటే, కాంచనతో “గుర్తుకొస్తున్నాయి” అనే ప్రోగ్రాం వీడియో కనబడింది. కెవ్వుమని కేక పెట్టింది మనసు! చూడ్డం మొదలుపెట్టేశాను. మహదానందపడిపోయాను.

1) “మీరు మొదట ఎయిర్ హోస్టెస్ అంటారు, నిజమేనా?”, “మిమ్మల్ని మొదట దర్శకుడు శ్రీధర్ గారు చూసి, కాదలిక్క నేరమిల్లై సినిమాలో అవక్శాం ఇచ్చారంట కదా, నిజమేనా?” అన్న యాంకర్ మొదటి రెండు ప్రశ్నలకి విరక్తి పుట్టింది.

2) “నాగేష్వరరావు గారికి మీరు షాపం ఇచ్చే వేషం కదండీ” – అన్నప్పుడు ఆ యాంకర్ ఎవరో గానీ, నమస్కారం పెట్టాలి అనిపించింది. ఈ మాత్రానికి “శ”, “ష” రెండు అక్షరాలు దేనికి తెలుగులో? అనిపించింది.

3) వెనుక సత్యసాయిబాబా పెద్ద ఫొటో, కాంచన గారి మొహాన నామం చూశాక, నిజానికి నాక్కాస్త భయమేసింది, ఎలాంటి ఇంటర్వ్యూనో అని..కానీ, బ్రతికించారు.

4) కాంచన గారేదో సీరియస్ గా తన బీదరికం గురిచి వాచ్చిన వార్తల గురించి చెబుతూ ఉంటే, “అలా మీరు గుడిలో కూర్చుని ఉండటం ఎవరు చూశారండీ?” అని ఒక “అమాయక” వెధవ ప్రశ్న వేసిన ఆంకరమ్మ తెలివి అనితరసాధ్యం.

5) “పడ్డాను నేను” అని కాంచన అనగానే, ఠక్కుమని “అంటే లేవలేకపోయారాండీ” అని భలే అడిగేసింది యాంకర్ :)) వీళ్ళకంతా కనీసం ప్రాథమిక శిక్షణన్నా ఇవ్వరా??

ఏమైనా, మొదట ఏమిటీ, ఆవిడ అడిగే వెధవ ప్రశ్నలకి కూడా అలా వివరంగా జవాబిచ్చేస్తోందేంటీ? అనుకుంటూ ఉండగా, నాకేమిటో మాట్లాడుతున్న కాంచన గారిని చూడ్డం చాలా బాగా అనిపించింది. అలా, ఆవిడేం మాట్లాడుతోంది అన్న విషయం వదిలేసి ఆవిడ ఉత్సాహాన్ని, కళ్ళలోని మెరుపునూ చూస్తూ ఉండిపోయాను. బాగా జ్ఞాపకం ఉన్నట్లు ఉన్నాయి చాలా సంగతులు. అలాగే, చాలా ఉత్సాహంగా కూడా ఉన్నారు. కొంతమంది పెద్ద వాళ్ళు కదిలిస్తే కబుర్లు మొదలుపెట్టేస్తారు. అలా ఎంటర్టెయిన్ చేస్తారు. ఈ ఎపిసోడ్ సరిగ్గా అలానే ఉంది. కాంచన గారు ఒక తరహా గ్రాంథిక తెలుగును ఇంగ్లీషుతో కలిపి మాట్లాడ్డం నాకు మహా సరదాగా అనిపించింది 🙂

కాంచన గుడిలో నేల ఊడుస్తోంది, ప్రసాదం తిని బ్రతుకుతోంది – అంటూ వచ్చిన వార్తల గురించి యాంకర్ అడిగినప్పుడు ఇచ్చిన వివరణ ఉంది చూశారూ – నాకు తెగ నచ్చింది. అసలు మామూలుగా ప్రోగ్రాం మొత్తంగా కాంచన గారి ముఖ భావాలూ, కళ్ళల్లో పలికిన మాటలూ, మామూలుగా మనిషిలో ఉత్సాహమూ – వర్ణించడం నా తరం కాదు!! ఇంటర్వ్యూలో కూడా ఎక్స్ప్రెషన్స్తో కేకలు పుట్టించొచ్చు అని ఇవ్వాలే అర్థమైంది :))

కాంచన రాకింగ్!!

(నేను లంకె ఇవ్వను. మనతెలుగుమూవీస్.నెట్ సైటులో వెదకండి, దొరికేస్తుంది)

Advertisements
Published in: on October 1, 2011 at 1:32 am  Comments (5)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/10/01/kanchana/trackback/

RSS feed for comments on this post.

5 CommentsLeave a comment

  1. ఇష్టంగా మీ రు ఒక ఫోటో పెట్టాల్సింది కదా ….

  2. ఎక్కణ్ణుంచి పెట్టేది? నేనేం ఫొటో తీయలేదు తెరని. ఎక్కణ్ణుంచో తీసుకొచ్చి బ్లాగులో ఫొటోలు పెట్టడంపై ఈ మధ్య ఆట్టే ఆసక్తి ఉండట్లేదు.

  3. bhale baagundi..I also love Kanchana..and her elegant beauty..I would like to remember her as she was..but I enjoyed your post. Thank you,for not posting any recent photo of Kanchana.

    vasantham.

  4. కాంచన అనగానే నాకు గుర్తొచ్చే పాట”అందెను నేడే అందని జాబిల్లి”. ఆ పాటలో ఆవిడ డాన్స్. నాకు చాలా ఇష్టమైన నటీమణుల్లో ఒకరామె. మీరు చెప్పాక ఇంటర్వ్యూ వెతక్క మానుతానా? థాంక్స్. 🙂

  5. hahahhaha..anchor ni inkonnni matalu ante nenu inkasepu navvukunedaanni 🙂 😛


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: