ఇక్కడ ఇవ్వాళ ఒక ఇండోనేశియన్ అమ్మాయి కలిసింది. రాత్రి అందరం డిన్నర్ కి వెళ్ళినప్పుడు మా టేబుల్ వద్ద నేను, ఈ అమ్మాయి, ఒక స్పానిష్ అమ్మాయి, మరొక అమ్మాయి – డేనిష్ అనుకుంటా బహుశా…నలుగురం కూర్చుని ఉన్నాము. ఆ డేనిష్ అమ్మాయి ఈ అమ్మాయిని – “మీ దేశంలో డచ్ మాట్లాడతారా?” అని అడిగింది. ఈ అమ్మాయి – “లేదు. ఇప్పుడెవరూ అలా లేరు. పెద్దవాళ్ళలో ఎవరన్నా కనబడొచ్చు కానీ, మామూలుగా కనబడరు” అన్నది. “అయితే, మీరంతా ఎక్కువగా ఏం మాట్లాడతారు?” అంటే “ఇండోనేషియన్” అన్నది. నేను ఇంకా ఇండోనేశియాలో ఇండోనేశియన్ కాక ఏం మాట్లాడతారు? అనుకుంటూ ఉండగా, ఇండియాలో ఇండియన్ మాట్లాడతారా? అని ఆ మధ్య ఒక చైనీస్ అమ్మాయి అడిగిన ప్రశ్నకు నవ్విన విషయం గుర్తొచ్చి నాలిక్కరుచుకున్నా.
అదిగో, ఆ తరువాత అక్కడ జరుగుతున్న చర్చలో ఆసక్తికరమైన సంగతి తెల్సింది. ఇండోనేషియన్ భాష అంటూ అధికారికంగా ఇప్పుడు ఉన్న భాషా మాలే భాష ఆధారంగా “తయారు” చేసారట…1920లలో ఎప్పుడో!! ఈ తరం వారిలో ఈ భాష మాతృ భాష కలవారు పెద్ద సంఖ్యలో ఉన్నారట. అంటే, ఇండోనేశియాలో రకరకాల స్థానిక భాషలు ఉన్నాయంట కానీ, చదువుకునేది అంతా ఈ “ఇండోనేశియన్” భాషలో అంట!! నాకు అసలు అలా ఎలా చేసారో అని మహా అబ్బురంగా ఉంది. భాష సృష్టించడం ఏమిటో, వందల మిలియన్ల జనం అది పాటించేలా చేయడం ఏమిటో… సహజ భాషల్ని కూడా “పుట్టించ” వచ్చని ఇప్పుడే తెలిసింది నాకు!!
“అయితే, ఇప్పుడు ఎంతమంది ఉంటారు ఈ భాష మాట్లాడే వాళ్ళు?” అంటే “రెండు-రెండున్నర వందల మిలియన్లు ఉంటారు” అని జవాబు వచ్చినప్పుడు నేనూ, నా స్పానిష్ కొలీగ్..ఇద్దరు మొదట “వాట్?” అని నోరెళ్ళబెట్టాము. ఆనక “వావ్!!” అని ఆశ్చర్యపోయాము. అదీ కథ!!
ప్రస్తుతానికి ఆట్టే వివరాలు సేకరించలేదు… కానీ, ఈ లంకెలో కొంత సమాచారం దొరికింది దీని గురించి. మరిన్ని వివరాలు తర్వాతెప్పుడన్నా తెలిస్తే రాస్తాను.
బాగుంది. 🙂
కొన్ని ఇండోనేషియన్ వాక్యాలు:
తేరి మా కాషీ = Thank you అనుకుంటా
సెలామత్ బాగీ = Good morning
సెలామత్ షియా = Good afternoon
సెలామత్ మలామ్ = Good night..
జకార్త లో నాకు అవి ఉపయోగపడ్డాయి. వాళ్ళభాషలో మన సంస్కృతపదాలు చాలా ఉన్నాయి.
quite interesting…thanks for the info
పూర్తిగా కొత్త భాష సృష్టించలేదనుకుంటాను.
మన హిందీలానే పలు మాండలికాలను, క్రియోల్ లను కలిపి ఇంకొంచెం మెరుగు పరిచి – ఇదే మన అధికార భాష అని తాంబూలాలిచ్చేసినట్టున్నారు.
@Chavakiran: అవును. చెప్పాను కదా. ప్రధానంగా మాలే భాషను ఆధారం చేసుకున్నారంట. దానితో పాటు రకరకాల ప్రాంతీయ భాషల పదాలు అవీ కలుపుకున్నారట. అయినా కూడా, భాష సృష్టించినట్లే కదా. ఇలా చేశారు కనుకే “సహజ” భాషని కూడా సృష్టిస్తారా? ఔరా! అనుకున్నా. పూర్తి కొత్త భాష వస్తే, అది సహజ భాష అవ్వదుగా. సృష్టింపబడ్డ భాష (Invented Language) అవుతుంది. 🙂
ikkada malay bhasha ante lipi english lone untundi
మనక్కూడా అలాంటి భాషలున్నాయండీ .. ప్రస్తుతం భారత దేశములో ముస్లిములు మాట్లాడే ఉర్దూ కూడా అలానే తయారయ్యింది.
మీరు చెప్పిన మలయ్ బాష సౌత్ ఈస్ట్ ఆసియా లో ఉన్న దేశాల ప్రజలు మాట్లాడతారండి.
malaysia లో bahasa malaysia అని, indonesia లో bahasa indonesia అని అంటారు,
thailand , brunei , సింగపూర్ లో కూడా మాట్లాడతారు. రాయడం మాత్రం latin script లోనే రాస్తారండి.
ఈ బహాస భాషకు సంస్కృతం కూడా ఒక మూల భాష అని విన్నాను.
The language we call Hindi today is also a manufactured language.
Interesting!