డుబ్రోవ్నిక్లో ఈ ఆదివారం: Bulletin

ఒక రోజు గడిచింది. నా ప్రేమ ముదిరి పాకాన పడింది. 🙂

ఇవ్వాళ్టి నా కథ – బొమ్మల్లో.

పొద్దున్నే కాసేపు రోడ్ల మీద నడుస్తూ ఉన్నానా… ఈ ఊరులో పాతా, కొత్తా భలే కలిసిపోయాయే…అనుకుంటూ ఉండగా, ఇదిగో ఈ ఇంటి గేటుకి ఇరువైపులా కుక్క విగ్రహాలు నన్ను ఆపేశాయి. ఇదే మొదటిసారి ఇలాంటిది చూడ్డం. :))

సరే, తర్వాత మేము ఇక్కడికి దగ్గరలో ఉన్న లోక్రం అన్న ద్వీపానికి వెళ్ళాము. ఫెర్రీలోంచి చూస్తే, లోక్రం ద్వీపం ఇదిగో, ఇలా అడవిలా కనిపించింది.

దానికి వెళ్ళే దారిలో వెనక్కి చూస్తే, డుబ్రోవ్నిక్ ఇలా ఉంది. (నిజానికి వ్యూ ఇంకా కేకలు పుట్టిస్తుంది కానీ, నేను ఫోన్ తో ఫొటోలు తీసే రకం కదా. నా పరిమితులు నావి!)

మనుషులకు భయపడకుండా తమ పని తాము చేసుకుపోయే నెమళ్ళను లోక్రం ద్వీపంలోనే మొదటిసారి చూశా!!

లోక్రంలో తిరుగుతూ ఉండగా, డుబ్రోవ్నిక్ ఇలా కనబడ్డది.

ఇంకా చాలా కథుంది కానీ, బేసికల్లీ, అక్కడ చాలాసేపు నడిచి, సముద్రం తీరాల్లో కాసేపు కలలుగని…అంతా అయ్యి వెనకొచ్చాము. సాయంత్రం తిండిగింజల వేటలో ఉన్నప్పుడు డుబ్రోవ్నిక్ పాత నగరంలో అన్నీ ఇదిగో, ఇలాంటి రోడ్లే!

ఇక, ఒక వెరైటీ సంగతి: ఈ ఊళ్ళో రెస్టారెంట్ల వాళ్ళు మనం వాళ్ళవైపుకి చూస్తే చాలు, వాళ్ళ రెస్టారెంట్ మిగతా వాటితో పోలిస్తే ఎందుకు నయమో ఊదరగొట్టేస్తున్నారు!!! నాకు కోఠీ పుస్తకాల షాపులు గుర్తొచ్చాయ్!! అయినా, మంచాళ్ళు. ప్రతిచోట కనీసం రెండు శాకాహార వంటకాలు ఉంటాయట ఇక్కడ!

మరో వెరైటీ దృశ్యం – ఒకతను డుబ్రోవ్నిక్ సావనీర్లు అని చెప్పి నగర కూడలిలో ఇలా అమ్ముతున్నాడు 🙂

అన్నట్లు, పుస్తకాలని ఇక్కడి భాషలో – “knjige” అంటారట. నాకు వెంటనే కినిగె.కాం గుర్తొచ్చింది!

ఇతి ఇవ్వాళ్టి వార్తాహ!

Advertisements
Published in: on September 19, 2011 at 1:18 am  Comments (3)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/09/19/dubrovnik-sunday/trackback/

RSS feed for comments on this post.

3 CommentsLeave a comment

  1. Cool.. seems amazingly beautiful city!

  2. chaala chakkaga undi

  3. chala bagundi mee ooru 🙂 cel pics ayinaa baga teesaru 🙂


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: