“Love in Dubrovnik” అనబడు నా తొలిచూపు ప్రేమ..

అంత ఎక్కువ ఊహించుకోకండీ….నేను చెప్తున్నది ఒక ఊరి గురించి!
క్రొయేటియా దేశంలోని డుబ్రోవ్నిక్ చేరుకున్నా మా కొలీగ్ వాళ్ళతో. ఎయిర్పోర్టు నుండి మా గెస్ఠౌస్ కి వచ్చి చేరేంతలో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయా డుబ్రోవ్నిక్తో. ఆర్య పద్ధతిలో వన్-సైడ్ లవ్ అనమాట. ఇంతాచేసి నేనేం చూసానో అనుకునేరు…. నేను వచ్చింది రాత్రి పదింటికి. ఇప్పుడే, ఇంత చీకట్లోనే ఇలా కేకలు పుట్టిస్తే, ఇక వెలుతురులో ఎలా ఉంటుందో! అని నాకు నిద్రపట్టేలా లేదు!

1) ఆ నార్వే వెళ్ళొచ్చాక ఈ అఫీషియల్ ట్రిప్పులంటే భయం పట్టుకుంది… జేబు చిల్లులూ, కడుపు చిందులూ తల్చుకుని. కానీ, వచ్చిన మొదటి గంటలోనే ఈ ఊళ్ళో ఆ రెండింటి గురించీ గొప్ప అనుభవం అయ్యింది. జేబుకి చిల్లు పడే అవకాశాలు తక్కువే! పైగా, రాత్రి పదిన్నరకి నాకు వెజిటేరియన్ సాండ్విచ్, ఫ్రూట్ జ్యూస్ దొరికింది అంటే ఊహించుకోండి!! 🙂

2) ఊరింత అందంగా ఉందే, కాసేపు నడుద్దాం అంటే, మా ఫ్రెండ్సు నిద్రొస్తోంది అని వాళ్ళ వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోయారు. కింద రిసెప్షన్ లో ఉన్న అతన్ని కాస్త సంకోచిస్తూ అడిగా – ఈ వీథి చివర దాకా నడిచి వద్దాం అనుకుంటున్నానండీ, సేఫేనా ఇక్కడ? అని. ఆయన పగలబడి నవ్వాడు. తర్వాత – “సేఫ్” అన్నాడు. ఒక పావుగంట నడిచొచ్చాక తెల్సింది అలా ఎందుకు నవ్వాడో. పేరుకి పదిన్నర కానీ, ఎక్కడ చూసినా జనం; సందడి. షాపులన్నీ తీసున్నాయి. లైట్లన్నీ వెలుగుతున్నాయ్. అదీ కథ!

3) వెజిటేరియన్ ఏమన్నా ఉందా? అంటే ఆ నార్వేలో లాగా “వాట్?” అన్న చూపు విసరకుండా, అంత రాత్రి సమయంలో ఉత్సాహంగా, ఇది తినొచ్చు, అది తినొచ్చు…అని చెప్పే కొట్టువాడు ఎక్కడ దొరుకుతాడు మనకి!!! (అసలుకే అప్పటికి చాలా సేపు బట్టి ఆకలేస్తూ ఉండింది. ప్రయాణంలో శాకాహారం దొరక్క. పాపం నా కొలీగ్స్ ఫ్లైట్లో వాళ్ళకి ఇచ్చిన బిస్కెట్లు కూడా నాకిచ్చేసారు, బ్యాగులో పెట్టుకుని ఇవ్వాళో, రేపో నీకు ఆకలేసినప్పుడు తిను అని 🙂 ROFL) క్రొయేటియన్ లో థాంక్స్ కి ఏమంటారో అంతకు ముందు రిసెప్షన్లో అడిగి కనుక్కున్నా కానీ, ఇక్కడికొచ్చేలోపు మర్చిపోయా! 😦

కూడలిలో ఒక అరుగు మీద కూర్చుని తింటూ కొన్ని ఫొటోలు తీశా. ఇప్పుడు అవి ఇక్కడ పెట్టేదాకా నాకు మనశ్శాంతి ఉండదు! ఇదిగో, ఆ పైన మసగ్గా కనిపిస్తున్న లైట్లు ఉన్నాయే, అక్కడేదో బిల్డింగ్ ఉంది. ఇక్కణ్ణుంచి అది చూసి మనసు పైకి విసిరేసి వచ్చా. రేపెళ్ళి తిరిగి తెచ్చుకోవాలి అనుకుంటున్నా…చూడాలి!!

నాకు కుడివైపు ఒక కోట ఉంది. ఇంకా మనుషులు తిరుగుతున్నారు అక్కడ! పైన చందూ మామ…

ఇదిగో, నిద్రొస్తోందని చెబుతూ నా సెల్లు చేసిన విన్యాసాలు:

వెరసి, ఇదిగో, నేను కూర్చున్న అరుగు నుండి ఇలా ఉంది రాత్రి పదిన్నరకి.

వెనుక సముద్రం…. ముందు ఉత్సాహం… నాకేమో ఆరాటం – పగలెప్పుడవుతుందా అని!
(Dubrovnik అని గూగుల్ ఇమేజెస్ లో ఇచ్చి చూడండి..నా గోల అర్థమవుతుంది. పగటి గురించి నా ఆత్రం ఎందుకో తెలుస్తుంది)

Advertisements
Published in: on September 18, 2011 at 3:34 am  Comments (9)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/09/18/tolichupuloprema/trackback/

RSS feed for comments on this post.

9 CommentsLeave a comment

 1. శుభం. ఎంజాయ్!

 2. నిజమేనండీ చాలా అద్భుతంగా ఉంది గూగుల్ ఇమేజెస్ లో…నాకయితే మాయాబజార్ లో ఘటోత్కచుడు ద్వారకానగరం మీద వాలిన సీన్ గుర్తొచ్చింది ఒక్కోచిత్రంలో.

 3. wow!!!! ఎంత అందంగా ఉందో!!! No wonder you fell in Love and its obvious that have been waiting for the sun to rise. Get some nice pics of urself tooo and then share them 😀

 4. సౌమ్య గారు..! గూగుల్లో చూశాము ఫోటోస్..సూపర్..చాలా బాగున్నాయి అక్కడి ప్రదేశాలు..! మీరు చాలా అదృష్టవంతులండి..! అక్కడికి టూర్ వేయాలంటే బాగానే చిల్లులు పడునా జేబులకు..?

 5. బానే పడుతుంది కానీ, అఫీషియల్ అన్నా కదా. కనుక నాకేం పర్లేదు… డబ్బెట్టేది నేను కాదుగా!:P

 6. మళ్ళీ వెళితే ఇది ప్రయత్నించండి: http://www.tajmahaldubrovnik.com
  PS: not based on personal experience, no guarantee from my side

 7. ·@Jai: I remember seeing this restaurant on the road. As far as I remember, only the name is Indian. The restaurant is not.

 8. @Sowmya: I have never been to Croatia but planning a visit early next year. I found this restaurant listing in Wikitravel around the same time I saw your blog. Thanks for the update but also glad to see vegetarian food is easily available.

 9. @Jai: Well, I should also add that I have been fortunate to get something vegetarian wherever I went, partly because of our workshop organizers too 😛 But, I guess you will find one or two vegetarian items wherever you go (You might not always feel the taste…or the lack of it…sometimes..hihihi)


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: