మంచమ్మాయి అయస్కాంత సన్నిధిలో మరి కాసేపు

ఇక మంచమ్మాయ్ మాయ నుంచి బైట పడిపోయా అనుకున్నా. సింబాబు వచ్చాడని, పంట పండిందనుకున్నా కానీ, మరీ అంత ఎర్రగా పండిన పంటని భరించడానికి నేను కంయూనిస్టుని కాను కదా…కనుక ఆ దారి ఒగ్గేసా. ఇంతలో, ఉన్నట్లుండి చెమట్లు కక్కే ఎండల మధ్య మాడడం మొదలుపెట్టా. ఓ పక్క ఎండలకి పని చేయాలి అనిపించదు (ఇక్కడ ఫ్యాన్లూ, ఏసీలు వాడరు!). ఉక్కపోతకి రాత్రుళ్ళు నిద్ర పట్టదు. పగలేమో నిద్ర వల్ల పని అవ్వదు. సాయంత్రమయ్యేసరికి ఇవ్వాళ వృథా అయ్యిందని చిరాకు. ఇలా బ్రతుకు అతలాకుతలం అవుతూ ఉండగా, మళ్ళీ నన్ను గాడిలోకి పెట్టింది – మంచమ్మాయి.

“జీన్స్” అన్న ప్రోగ్రాంలో తన జగన్మోహనాకారం గురించి అందరూ పొగుడుతూ ఉంటే, చూడ్డం మొదలుపెట్టా. ఒక్క పదినిముషాలు చూశానేమో – కట్టేశా. మంచమ్మాయిని ఆ షోలో పిల్లల్ని పెద్దలకి మ్యాచ్ చేయడం వంటి రొటీన్ పనిలో చూడలేకపోయాను. అందులోనూ, అక్కడ మాట్లాడేది తక్కువ! జగన్మోహనాకారమైనా, జగత్తుకు భీతి పుట్టించే ఆకారం అయినా, నాకు అనవసరం. నాక్కావలసింది అమృతం. అదే, మాట. ఆ తేనెలూరే యాస కోసం, ఆ యాసలో జాలువారే బాస కోసం మంచమ్మాయిని వేలసార్లు చూడొచ్చు కానీ, నోరు కట్టేస్తే ఎలా? సుమ పై దాడి చేసిన మంచమ్మాయి అభిమాని అని పేపర్లో పడి ఉండేది నేను హైదరాబాదులో ఉండి ఉంటే.

అక్కడ్నుంచి మళ్ళీ మంచమ్మాయ్ నా జీవితంలోకి రావడమూ, నాకు కొంచెం కొంచెంగా జీవితం పై విసుగు తగ్గడమూ ఒకేసారి మొదలయ్యాయి. కొన్ని చెదురుమదురు ఎపిసోడ్ల తరువాత, మళ్ళీ రెండు మూడు పూర్తిగా చూశాను. అర్థరాత్రి మెలుకువొస్తే, నాకు మొదట తట్టింది మంచమ్మాయే! మోహన్ బాబు తో ఒక ఎపిసోడ్ ఉండింది. మంచమ్మాయ్ ఇప్పటితో పోలిస్తే చాలా నయం. ఉన్నంతలో కష్టపడి బానే మాట్లాడింది. కానీ, అబ్బో, ఆ ఎపిసోడ్లో డైలాగులు ఎవర్రాశారో గానీ, ఒక్కొక్కళ్ళూ భలే మాట్లాడారు. “ఏమండీ, మీరు స్క్రిప్టుకి ప్రశ్నలు అడుగుతారా? ప్రశ్నలకి స్క్రిప్టు రాసి భట్టీయం వేయిస్తారా?” అని అడగాలి అనిపించింది. కానీ, మంచమ్మాయిని అడగాలా? మంచమ్మాయ్ వాళ్ళ డైరెక్టర్ ఎవరన్నా ఉంటే వాళ్ళని అడగాలా? అని సందేహం కలిగి ఆగిపోయాను.

నానితో ఒక ఎపిసోడ్ ఉండింది. ఆ ఎపిసోడ్ చివర్లో తెర వెనుక గొంతుకలు అంటూ డబ్బింగ్ ఆర్తిస్ట్ శిల్ప ని పిలిచారు. ఆవిడేగా అప్పట్లో కొన్ని సినిమాల్లో, సీరియల్స్ లో కూడా వేసింది? అనుకున్నా మొహం చూడగానే. విషయం ఏమిటంటే, చాలా సినిమాల్లో సౌందర్య కి డబ్బింగ్ చెప్పింది ఈవిడే. “సౌందర్య ఆంటీకి మీరే చెప్పారా” అని అమాయకంగా ఆమె అడిగినప్పుడే తట్టింది నాకు మంచమ్మాయ్ తండ్రికి ఇచ్చే గౌరవం. తండ్రి మూలాన సౌందర్య ఆంటీ అయిపోయిందన్నమాట. బాలకృష్ణ శ్రీదేవి ని ఆంటీ అంటాడా? నాగార్జున జయప్రదని ఆంటీ అంటాడా? మహేష్బాబు ఇంద్రజ ని ఆంటీ అంటాడా? నాగచైతన్య ఆశిన్ ని ఆంటీ అంటాడా? చరణ్ గానీ, అర్జున్ గానీ, కరిష్మా కోటక్ ని ఆంటీ అంటారా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చెప్పొచ్చు. ఒక్కరన్నా అంత గౌరవభావంతో పబ్లిక్ గా పిలిచిన దాఖలాల్లేవు. దటీజ్ మంచమ్మాయ్.

ఎలాగో తనకి ఛార్మీ కూడా ఆంటీ కనుక, ఛార్మీ తో ఒక ఎపిసోడ్ చేసి, ఆమె తెలుగుతో తన తెలుగు పోలుస్తూ, ఆ పింక్ కాఫీ కప్పులకేసి తల కొట్టుకుని, ప్రేమతో మీ లక్ష్మి క్షమించమని అడుగుతొంది అని తెలుగు భాషకి నీరాజనం అర్పించి ఉంటే బాగుండేది. ప్చ్! నాకు సంతాపం వ్యక్తం చేసేందుకు కూడా మాటలు రావట్లేదు – లక్స్మి మళ్ళీ ప్రీమతో మన ముందుకు రాదంటే. అప్పుడెవరు నా గుండెమంటలని చల్లార్చేది? ఎవ్వరు నాలో జీవనోత్సాహం కలిగించేది? ఎవరు నాకు బ్లాగోత్సాహం పుట్టించేది? ఏ మూర్తి? ఏ మూర్తి? ఏ మూర్తి? అనగానే నేపథ్యంలో రామదాసు సినిమా పాట వినిపిస్తే ఏం చేస్తాం! వింటాం!

Advertisements
Published in: on August 27, 2011 at 2:37 am  Comments (3)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/08/27/manchammai-again/trackback/

RSS feed for comments on this post.

3 CommentsLeave a comment

 1. really chala chalA bavundi. navvu aapukoleka poyanu

 2. “అయస్కాంత సన్నిధిలో”..ఢాం..
  “సుమపై దాడి చేసిన మంచమ్మాయి అభిమాని” .. మళ్ళీ ఢాం..
  “చెదురుమదురు ఎపిసోడ్లు”.. ఢాం ఢాం ఢాం..
  “..ఆంటీ అంటాడా?” ధాడ్డ్.. దఢ్..
  “పింక్ కాఫీ కప్పులకేసి తలకొట్టుకొని”.. ఢమేల్.. ధాడ్.. ఢాం..
  “ఏ మూర్తి? ఏ మూర్తి?” సాహో.. నాయకీ.. సాహో!!

  మీకీ జన్మలో తప్పక మంచమ్మాయ్ తో ఇంటర్వ్యూ దొరికాలని, పింక్ కాఫీ కప్పుతో తలబాదుకున్నాక బ్లాగు రాసేందుకు మీ ప్రాణాలకు మా అభిమానమే శ్రీరామ రక్షగా నిలిచి ఉండాలని, ఆ అద్భుత అనుభవాలను మా కళ్ళు చెమ్మగిల్లేలా మీరు పంచుకోవాలని ఆశిస్తూ .. మీ మంచమ్మాయి మరో అభిమాని.

 3. మీ అభిమానం చూడ ముచ్చటేస్తున్నది. పైన కొత్తావకాయ్ గారి శుభాకాంక్షలే నానుండి కూడా. BTW, she does grow on you.
  మొన్న జూ ఎంటీయార్ వచ్చాడు. ప్రశ్న అడగడం ఆలస్యం వీడు ఇంక హైలెవెల్ ఫిలాసఫీ – పాపం ఆ అమ్మాయిని మళ్ళీ నోరెత్తకుండా వాయించి వొదిలాడు. అతన్ని గెస్టుగా పిలవాలని ఐడియా ఇచ్చిన స్టాఫ్ ఎవరో ఆ రోజు బర్తరఫ్ అయిఉంటారు.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: