గాలీ, నింగీ, నీరు, భూమీ, నిప్పూ మీరు…. (శ్రీరామరాజ్యం)

శ్రీరామరాజ్యం (2011) సినిమాలో “గాలీ నింగీ నీరు..” అని ఒక పాటుంది. సాహిత్యం బట్టి, ఇది లక్ష్మణుడు సీతని వాల్మీకి ఆశ్రమం వద్దకు తీసుకెళ్తున్నప్పుటు వస్తుందనుకుంటున్నాను. పాట వినేందుకు మామూలు సినిమాల్లో విషాద గీతంలాగా అనిపించింది కానీ, ఈ పాట సాహిత్యం మాత్రం ఏమిటో, ఒకటే గుర్తొస్తోంది. లక్ష్మణుడు ఇలా అడిగాడా నిజంగా? అనిపించింది నాకు 🙂

“గాలీ, నింగీ నీరు, భూమీ, నిప్పూ మీరు, రామా, వద్దనలేరా ఒకరూ?
నేరం చేసిందెవరు? దూరం అవుతోందెవరు? ఘోరం ఆపెదవరు? ఎవరు?”

“రారే, మునులు ఋషులు, ఏమైరీ వేదాంతులు, సాగే ఈ మౌనం సరేనా?
కొండా కోనా అడవీ, సెలయేరూ, సరయూ నదీ, అడగండీ న్యాయం ఇదేనా?”
– భలే అడిగాడుగా! కాస్త గట్టిగా అడిగుండాల్సిందసలు!

కానీ ఊరికే రెండు ముక్కల్లో,
“కరుణామయులిది కాదనలేరా కఠిన కార్యమనబోరా.”
“ఇనకులమున జనియించిన నృపతులు ఈ దారుణము సహించెదరా
వినువీధిని శ్రేణులుగా నిల్చి విడ్డూరముగా చూచెదరా…”
-అన్న లవకుశ లక్ష్మణుడికంటే ఈ లక్ష్మణుడు నాకు తెగ నచ్చేసాడు.

అలాగే, కొత్త లక్ష్మణుడిలో నాకు ఇంకోటి కూడా నచ్చింది.
“అగ్నిపరీక్షకె నిల్చిన సాధ్విని అనుమానించుట న్యాయమా
అల్పుని మాటయె జనవాక్యమ్మని …..
అల్పుని మాటయె జనవాక్యమ్మని అనుసరించుటే ధర్మమా”
-అని పాత లక్ష్మణుడు అనేస్తే,

“విథినైనా కానీ, ఎదిరించే వాడే
విధిలేక నేడు విలపించినాడే!
ఏడేడు లోకాలకి సోకేను ఈ శోకం!

అక్కడితో అయిపోకుండా, ఇక్కడ ఆ ఇల్లాలే
రక్కసి విథికీ చిక్కిందా, ఈ లెక్కన దైవం ఉందా?”
-అంటూ, కొంచెం రాముడి పక్షం కూడా చెప్పాడు (విలపిస్తున్నది రాముడు అని అనుకుంటున్నాన్నేను!!)

“ఎండ కన్ను ఎరుగని ఇల్లాలికి ఎందుకో ఈ వనవాసాలు
తరచి చూచినా బోధపడవులే దైవచిద్విలాసాలు”
-అని అప్పటి లక్ష్మణుడు నిట్టూరిస్తే,

“సుగుణంతో సూర్యుని వంశం వెలిగించే కుల సతిని
ఆ వెలుగే వెలివేసిందా, ఈ జగమే చీకటి అయ్యిందా?”
-అని ఆక్రోశించడంలో కూడా నాకు మళ్ళీ ఇప్పటి లక్ష్మణుడు నచ్చేసాడు.

ఎంతనచ్చినా, ఎవ్వరూ సీత రెండో వనవాసం ఆపలేకపోయారు అనుకోండి, అది వేరే విషయం!
ఎస్పీబీ కి ఏడుస్తూ పాడ్డం చేతకాదని నేను నూట తొంభైయ్యోసారి అనుకోవడం కూడా వేరే విషయం!

Advertisements
Published in: on August 17, 2011 at 12:45 am  Comments (9)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/08/17/galiningi-neeru/trackback/

RSS feed for comments on this post.

9 CommentsLeave a comment

 1. బాలు కి ఏడుస్తూ పాడడం రాదు. నిజమే.

 2. Too fast… ఇంతలోపే విశ్లేషణకూడానా? మిగతాపాటలగురించెప్పుడు రాస్తున్నారు?

 3. Very good lyrics.I think this will be a montage song.Iam in love with these songs

 4. ఈ పాట సాహిత్యం అద్భుతం. పాట ట్యూను కూడా చాలా బాగుంది.

 5. ఈ రోజే పాటలు ఒకసారి సావధానంగా విన్నాను. సాహిత్య సంగీత పరంగా ఏదో గొప్పగా చెయ్యాలన్న తపన కన్నా సరళంగా, సామాన్యులు ఆస్వాదించేలా చెయ్యాలనుకున్నట్టు తోచింది. ఐతే సంగీత సాహిత్యాల్లో కొన్ని మెరుపులు లేకపోలేదు. జొన్నవిత్తుల కొంత ఎక్కువ న్యాయం, ఇళయరాజా కొంత తక్కువ న్యాయం చేశాడని నా భావన.

  ఈ పాట విన్నప్పుడు బాలు పాడిన తీరు నాకూ నచ్చలేదు, కృతకత ఎక్కువ ఉంది.

 6. @manikya: “సాహిత్య సంగీత పరంగా ఏదో గొప్పగా చెయ్యాలన్న తపన కన్నా సరళంగా, సామాన్యులు ఆస్వాదించేలా చెయ్యాలనుకున్నట్టు తోచింది.”
  -Yes. I too have the same feeling.

 7. press academy of andhrapradesh website patha pusthakalu vunnai chudandi

 8. http://www.pressacademyarchieves.ap.nic.in

 9. Agree @ SPB ki edusthu padatam chethakaadhu.

  Evaranna edusthu edhanna chepthunnappudu, “mundhu edchesi tarvatha cheppu, ledhante cheppi tarvatha edu” ani anatam alavatu naaku. E paata vintunte adhe cheppalanipinchi “SPB garuu, edchesi padandi, ledhante paadaka theerikaga edavandi”!


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: