శ్రీరామరాజ్యం ఆడియో – నా అభిప్రాయాలు

నాకు రాముడంటే ఏ భావమూ లేదు కానీ, రాముడిపై రాసిన పాటలంటే ఇష్టం. బాపు గారంటే ఇష్టం. రాజా అంటే ఇష్టం. ఆ ఇష్టంలో భాగంగా, నిన్న ఆడియో రిలీజ్ వీడియోలు చూసి -“అయ్యో! ఏమిటీ పరిస్థితి” అని నిట్టూర్చాక, పొద్దున్న ఆఫీసుకి వస్తే, రాగా లంకె తో ఒక మెసేజ్…రామరాజ్యం పాటలు మొత్తం రాగా.కాం లో పెట్టేసారు విను అని. విన్నాను. నాకు దాదాపు అన్నీ నచ్చాయి. అయితే, సంగీతానికి, కథకి మధ్య ఏదో గ్యాప్ ఉన్నట్లు అనిపించింది. ఆ సంగీతం చూస్తే “అమ్మ రాజీనామా” మొదలుకుని “ఆవకాయ బిర్యాని” దాక రకరకాల తరహా చిత్రాలకు సూట్ అయ్యేలా ఉంది కానీ, పౌరాణికంలో ఊహించుకోలేకపోతున్నాను. ఆ అయోమయావేశంలోనే ఈ టపా.

(మీకీ టపా మరీ పట్టపగ్గాల్లేకుండా అనిపిస్తే క్షమించండి. ఎవ్వరినీ అగౌరవ పరచడం నా ఉద్దేశ్యం కాదు. పై ఇద్దరూ నా లోకపు దేవుళ్ళు. కనుక, వాళ్ళని ఒక్క మాట అనే ఆలోచన నాకు కల్లో కూడా రాదు!)

జగదానంద కారకా : పాటలో భక్తి పారవశ్యం లేదు కానీ, “ఊపు” ఉంది. నామట్టుకు నాకు వినేందుకు బాగుంది.

శ్రీరామ లేరా: ఏమిటో, బొత్తిగా ఇప్పటి సినిమాల తరహా సంగీతం. “శివమణి” సినిమాలో “రామా..రామా..రామా..” అంటూ పాట పెడితే బాగుంటుంది కానీ, ఒక పౌరాణిక చిత్రంలో ఈ సంగీతం ఏమిటి? అనిపించింది. కానీ, సినిమాలో మిగితా పాటలు కూడా అలాగే అనిపించడంతో, బహుశా మరో తరహాకి అలవాటు పడిపోయి, ఇది కొత్తదనం వల్ల ఇలా అనిపిస్తుందేమో అనిపించింది వినేకొద్దీ!!

ఎవడున్నాడు: వాల్మీకి చెప్పే కథగా వస్తుంది పాట (లవకుశులతో కాబోలు!). రాముడి పొగడ్త. బాగుంది. 🙂

సీతారామ చరితం: బాగుంది. ఇప్పటి పిల్లలకి రాముడి కథ క్లుప్తంగా, చక్కటి తెలుగులో, విజువల్ గా చెప్పేందుకు పనికొస్తుందనుకుంటాను.

దేవుళ్ళే మెచ్చింది : మళ్ళీ, ఈకాలం పాటలా ఉంది.అద్భుతంగా పాడారు అనిపించింది. సినిమాలో లవకుశుల కథని కొంచెం ఆధునికంగా చెప్పబోతున్నారని అనిపిస్తోంది, ఈ పాటల ధోరణి చూస్తూ ఉంటే. (వినుడి వినుడి రామాయణ గాథా..పాట బదులు ఈ పాటేమో ఈ సినిమాలో..)

గాలీ, నింగీ నీరు..భూమీ నిప్పూ మీరు..రామా వద్దనలేరా ఒకరూ : “ఏ నిముషానికి ఏమి జరుగునో” సందర్భం అనుకుంటా. సాహిత్యం నాకు బాగా నచ్చింది, పౌరాణికాలకి వెరైటీ సాహిత్యమే…నేను విన్నంతలో. పాట సంగీతం కూడా… గాయం-2 సినిమాలో “కలగనే కన్నుల్లో…” అన్నట్లు, మాడర్న్ విషాద గీతంలా ఉంది 🙂

రామాయణము : మళ్ళీ రామ గాథ. నాకు పౌరాణికం ఫీలింగ్ రాలేదు కానీ, పాట బాగుంది. దృశ్యం కళ్ళకు కట్టించింది.

దండకం: హమ్మయ్య, ఒక్కటి పౌరాణికంలా అనిపించిందోచ్!!

సీతా సీమంతం: “మావయ్య అన్న పిలుపు” అన్న ఒకప్పటి బాలకృష్ణ పాట మాడరన్ వర్షన్ లా ఉంది :). మైథలాజికల్ లా లేదు. వినడానికి బానే ఉంది కానీ, రామాయణం సెటప్ లో ఊహించడం కష్టంగా ఉంది!! సాహిత్యం బాగుంది.

రామ రామ రామ అనే రాజమందిరం: జానపదం లా ఉంది. బహుసా సినిమాలో కూడా అదే సీన్ లో వస్తుందేమో. నాకు చాలా నచ్చిన పాటల్లో ఇదొకటి, ఈ ఆల్బంలో. ఇందులో ఆ “పారవశ్యం” ఎలిమెంట్ ఇందులో అనుభవించాను, ఇది జానపదం తరహాలో ఉన్నప్పటికీ.

ఇది పట్టాభి రాముని ఏనుగురా, శంకు చక్రాల..: ఊపు ఉంది పాట(ల)లో. నాకు నచ్చింది. సినిమాలో ఎక్కడ వస్తుంది అన్న దాన్ని బట్టి ఉంటుంది ఇంపాక్ట్. కానీ, నాకు ఈ పాట చాలా నచ్చింది. అర్జెంటుగా ఈ పాట మాత్రం కోనేస్కుని లూప్ లో పెట్టుకుని వినాలి అనిపించింది.

ఇవి కాక, ఒకట్రెండు బిట్ సాంగ్స్ ఉన్నాయి.

ఈ సినిమా సంగీతానికి నేను “కన్ఫ్యూజ్ద్ మ్యూజిక్” అని పేరు పెట్టదలుచుకున్నా. పాటలు నాకు చాలా నచ్చాయి కానీ, అవన్నీ ఒక పౌరాణిక చిత్రంలో ఊహించలేకపోతున్నాను. మన పౌరాణిక సంగీతం ఒక విధమైన పారవశ్యం కలుగజేస్తుందే… అలాంటి పారవశ్యం నాకు కలగలేదు. కానీ, పాటలుగా వినడానికి బానే ఉన్నాయ్. నా స్నేహితుడితో అంటూ ఉంటే అతను ఇలా అన్నాడు – “ట్యూన్స్ బాగున్నాయి కానీ, సౌండ్స్ డల్ అనిపించట్లేదూ?” అని. ఇక్కడ నేనూ ఏకీభవించాను. “సౌండ్స్ డల్” అనడంలో మా భావం – ఆ పారవశ్య భావనే. ఒక “నాన్ కడవుళ్”లో “ఓం శివోహం” లాగా పూనకం పుట్టించడం కానీ, ఒక “షిర్డీ సాయిబాబా మహత్యం”లో “మా పాపలు తొలగించి…”పాటలో లాగ (రెంటికీ ఇళయరాజానే), భక్తీ పారవశ్యం కలిగించడం గానీ, ఈ పాటలు చేయలేదు. కానీ, ప్రతి పాటా వింటూంటే లవకుశులు కథ చెప్పడం, మామూలు జనం తల ఊపుతూ విని ఆనందించడం మాత్రం కనబడ్డది నా మనోఫలకమ్లో. అందుకే జానపదం అన్నది.

నాకు చివరిగా చెప్పాలి అనిపిస్తున్నది ఏమిటి అంటే – నేను ఈ పాటలు చాలా మట్టుకు, పల్లెల్లో పాడుకునే జానపద పదాల్లా ఊహించుకుంటున్నాను. ఈ పిల్లలు – అదే లవకుశులు ఒక ఎనభైల నాటి మాములు పల్లె జనాలకి రాముడి కథ చెప్తున్నట్లు ఊహించుకుంటే, అంతా కళ్ళకి కట్టినట్లు కనిపిస్తుంది. అలా కాకుండా రామాయణకాలంలో రామకథ గానం లా ఊహించుకుంటే, కాస్త కొత్తగా (కొండకచో వింతగా) అనిపిస్తే అది మీ తప్పు కాదు. ఆపై మరో మాట – ప్రతిసారి ఇళయరాజా తన బెస్ట్ ఇవ్వాలి అని ఆశించకూడదు. ఆయన కూడా మనిషి అన్న విషయం కూడా దృష్టిలో ఉంచుకోవాలి.

నేనూ సాహిత్యం పై ఎక్కువ ధ్యాస పెట్టలేదు కానీ, పట్టించుకున్నంతలో నాకు చక్కగా అనిపించాయి కొన్ని భావనలు. బహూశా కొన్నాళ్ళాగాక మళ్ళీ రాస్తానేమో.

Published in: on August 16, 2011 at 3:34 pm  Comments (30)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/08/16/ramarajyam-audio/trackback/

RSS feed for comments on this post.

30 CommentsLeave a comment

 1. Have to wait and see if the songs sync well with the movie.

 2. Songs are really good.Balayya should have done this movie atleast 10 before.Now wrinkles are showing up in his face.May be they will correct them digitally.

  Can’t wait to watch this movie.

 3. same feeling soumya garu

 4. ilayaraja lost his magic touch long back. keeravani would have done a better job.

 5. Thanks for the writeup. ippude oka saari sample vinnaanu. E paaTaa anta naccaledu. maLLii vini chuustaanu.

 6. Some songs are ok. As you said they do not sound like mythalogical. I think this could be contemparary story based on ramaayanam.

 7. మీ రివ్యూ చదివాక వినాలనిపించి పాటలన్నీ విన్నాను. బానే ఉన్నాయి. ఈ సినిమా గురించి నాకు మొదట్నుంచీ పెద్ద అంచనా లేదు – కాబట్టి ఏమాత్రం బాగున్నా బాగున్నట్టే (I am a pessimist, you know!). పాటలు కూడా బాగున్నట్టే.

  సౌండ్స్ డల్ గా ఉండడం గురించి – ఇళయరాజా సంగీతం పాతబడిపోయింది. రెహమాన్ వచ్చినతర్వాతనుంచీ ఇళయరాజా పాటల్లో సౌండ్స్ డల్ గానే అనిపిస్తున్నాయి. అయినా కొన్ని పాటలు చాలా మెలొడియస్ గా, కాచీగా చేస్తూనే ఉన్నాడనుకోండి. (నేనూ ఇళయరాజాకి వీరాభిమానినే.)

  మొత్తానికి ఈ పాటలు ’బాగున్నాయి’, ’మెల్లిగా ఎక్కుతాయి’ అనే అనిపిస్తూంది నాకు. సాహిత్యం మాత్రం అన్ని పాటల్లోనూ చాలా బాగుంది.

 8. శ్రీరామరాజ్యంలో మంచమ్మాయికి ఒక ’తగిన’ పాత్ర ఇచ్చి ఉంటే ఈ సినిమాని మొదటిరోజే, లేదా కనీసం మొదటివారమే హాలుకి వెళ్ళి మరీ చూసి ఉండేవాణ్ణి. మరి అలా జరిగినట్టు లేదు.

  మంచమ్మాయి అభిమానిగా మీరు ఈ విషయం గురించి నిరసన తెలియజెయ్యాల్సిందే.

 9. నాగమురళి గారూ: ఈ సినిమా షూటింగ్ అదీ మొదలయ్యి చాలా రోజులు అయ్యింది అనుకుంటాను కదా. బహుశా అప్పటికి మంచమ్మాయ్ గురించి ఇంఆ వీళ్ళకి తెలీదేమో నండీ…పాపం క్షమించేద్దాము. శూర్పణఖ పాత్రక కి చక్కగా సూట్ అయ్యేది. మన తెలుగు రామాయణాల్లో అత్యంత విలక్షణమైన శూర్పణఖ ను చూసి ఉండేవాళ్ళం! ప్చ్!

 10. :)) @ Manchammai as Surpanaka, Perfecto!

 11. […] ఇది ఆడియో రివ్యూ కాదు. నాకు సంగీతం గురించి బొత్తిగా తెలియదు, కేవలం ఆస్వాదించడం తప్ప. రివ్యూ కావాలంటే సోదరుడు కార్తీక్ ఎంతో చక్కగా రాసిన ఈ టపా చదవండి – కార్తీక్ రివ్యూ . సౌమ్య ఈ సినిమా పాటల గురించి రాసిన టపా ఇక్కడ- సౌమ్య రివ్యూ […]

 12. […] ఇది ఆడియో రివ్యూ కాదు. నాకు సంగీతం గురించి బొత్తిగా తెలియదు, కేవలం ఆస్వాదించడం తప్ప. రివ్యూ కావాలంటే సోదరుడు కార్తీక్ ఎంతో చక్కగా రాసిన ఈ టపా చదవండి – కార్తీక్ రివ్యూ . సౌమ్య ఈ సినిమా పాటల గురించి రాసిన టపా ఇక్కడ- సౌమ్య రివ్యూ […]

 13. హెచ్చరిక: శ్రీరామరాజ్యం పాటలు వినని వాళ్ళూ, ఇళయరాజా వీరాభిమానులూ యీ నా కామెంటుని చదవకపోవడం మంచిది.

  కష్టపడి ఈ సినిమా పాటలన్నీ విన్నాను. ఆ తర్వాత చెవి తుప్పు వదించుకోడానికి మళ్ళీ లవకుశ పాటలు విన్నాను.:-) లవకుశతో పోలిక న్యాయం కాదని కొంతమందికి అనిపించవచ్చు. అది న్యాయమే అని నేననుకుంటాను. ఒకే కథ ఆధారంగా వచ్చిన రెండు సినిమాలలో పాటల మధ్య పోలిక చాలా సహజంగానే వస్తుంది. తప్పదు. అందులో అన్యాయవేమీ లేదు.

  మంచి గురించి ముందుగా చెప్పుకోవాలి. శ్రీరామరాజ్యం పాటల్లోని సాహిత్యం బాగుంది. సినిమా పాటల్లో అసలు సాహిత్యమంటూ చాలా అరుదుగా కని(విని)పించే రోజుల్లో, సినిమా మొత్తం అన్ని పాటల్లోనూ సాహిత్యం వినిపించడం, అది చక్కగా ఉందనిపించటం చాలా గొప్పగా చెప్పుకోవలసిన విషయమే. ఇచ్చిన బాణీకి కట్టిన పాటలని స్పష్టంగా తెలుస్తునే ఉన్నప్పటికీ, ఉన్న పరిమితుల్లో రచయిత మంచి సాహిత్యాన్నే అందించారు. కనీసం ఈ సినిమాలోనైనా ముందు పాట కట్టి ఆ తర్వాత సంగీతం సమకూర్చి ఉంటే బాగుండేదని అనిపించింది.

  అంతే, అంతకుమించి పాటల గురించి మంచి చెప్పడానికి నా దగ్గరింకేమీ లేదు. సంగీతమైతేనేం, దాన్ని పాడిన విధానమైతేనేం – అబ్బే, నా చెవులకి అస్సలే మాత్రం ఇంపుగా అనిపించలేదు. ఇంచుమించు పాడినవాళ్ళ అందరి నోళ్ళలోనూ తెలుగు కసాబిసా ఖూనీ అయిపోతూ ఉంటే, పాపం ఆ రాసినాయన ఎంత నొచ్చుకొని ఉంటాడో అని నాకు బాధనిపించింది. జానపదయాస కూడా పాడినవాళ్ళ గొంతుకల్లో కృతకంగా వినిపించింది.
  గొంతుకలు కూడా ఏవిటో నూతిలోంచి వచ్చినట్టుగానే ఉన్నాయి తప్ప జీవం పెద్దగా కన(విన)పడలేదు. బాలూగారి గళం కూడా నన్ను పెద్దగా ఆకట్టుకోలేదు. లవకుశలో ఘంటసాలగారి గొంతుతో పోల్చను కాని, అన్నమ్మయ్యలో అతని గొంతుకతో పోల్చుకున్నా, అందులో ఉన్న brightness ఇక్కడ జారిపోయినట్టుగా అనిపించింది.

  ఇక సంగీతం విషయానికి వస్తే, పాటల్లో “పౌరాణిక” బాణీ లేకపోవడం నాకు పెద్ద సమస్యగా తోచలేదు. నాకు బాగా చిరాకు కలిగించిన విషయం, చాలా వరసలు ఇంతకుముందెక్కడో విన్నట్టుగానే ఉండడం. బహుశా ఇంతకుముందు ఏ సినిమాల్లోనో, ఇళయరాజా చేసిన పాటలే అయ్యుంటాయేమో. కాస్త ఇళయరాజా పాటల మీద పట్టున్నవాళ్ళెవరైనా కూర్చుని పరిశీలిస్తే, కచ్చితంగా ఆ పాటలని గుర్తించ వచ్చని నా నమ్మకం. దీనివల్ల, సంగీతంలో కొత్తదనం కనిపించలేదు. అక్కడక్కడా తమిళ కంపు(వాసన) కూడా కొట్టింది.
  నాకనిపించిన మరో విషయం – There seemed to be a lot of orchestration, which sounded clumsy at times. అలాగే, జానపద బాణీలో ఉన్న పాటల్లో కూడా వెనక వింపించే వాయిద్యాలూ, మధ్యన వచ్చే interludes అన్నీ western ధోరణిలో ఉండి, రెండిటికీ పొత్తు కుదరలేదు.

  నాకు ఇళయరాజా అంటే అసహ్యమూ లేదూ, వీరాభిమానమూ లేదు. ఈ సినిమాకి మాత్రం అతను సంగీతదర్శకుడు కాకపోయి ఉంటే బాగుండేదని, పాటలు విన్నాక నాకు గట్టిగా అనిపించిన విషయం.

  అయితే, ఈ పాటలు సినిమాలో చూస్తే బాగుంటాయేమో, చెప్పలేం. విడిగా వినడానికి మాత్రం నాకు చాలా కష్టమయ్యింది.

  (మీ బ్లాగు చదివే ఈ సినిమాపాటలు విన్నాను కాబట్టి, నా యింత పెద్ద వ్యాఖ్యా మీ బ్లాగుకే అంకితమిస్తున్నాను! :-))

 14. అవునండి.. నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.. ఒక్క బాలు గారు తప్ప మనసు పెట్టి ఎవరు చేసినట్టుగా అనిపించలేదు.. స్వాతిముత్యాలు ఒలికించ గలిగిన రాజా వారు..మనస్సును సరిగ్గా లంఘించ లేకపోయారని అ౦చనా !! గాయక బృందం స్పష్టత లోపించి నట్లుగా ఉంది.. సంగీతం ఒక వంతు సినమాకి పట్టు.. అది పట్టినట్లుగా లేదు..సినిమా లో ఎలా ఓడిగినదో అని ఒక భయం.. కష్టే ఫలి లాగ లేదు.. నష్టే ఫేయిలి అనిపిస్తోంది.. చేతులు జోడించి అందరం మంచి మనసుతో ఆరాధించక తప్పదు మరి..

 15. “Modern mythological music”
  Correst ! 🙂

 16. paatalu bane unnai andi.. kakapothe.. lyrics dominate chesthai. monna edo site lo. working stills choosanu..setings bane wesaru mari..kakapothe.. edhi ekkada wastundho. cheppatam kashtam..

  okkate baga nachindhi.. annamayya and sri ramadasu movies lo laga.. heroines tho duets lewu.. enni sarlu choosina,, aa rendu songs kaastha ibbandiga tosthai naaku..

  I mean..Ele Ele maradala..and chalu chalu..

  nemmadiga ekkuthaii.. 🙂

 17. అమ్మా సౌమ్యా! మీ లాంటి పండితులని ఈ పాటలు మురిపించక పోవచ్చు. కానీ మాలాంటి పామురులకి నచ్చాయి. మునుపు సంవత్సరంలో విడుదలయ్యే సినిమాలలో అన్నిరకాల సినిమాలు వుండేవి. కానీ ఇప్పుడు దశాబ్దానికి ఒక పౌరాణికం, ఒక జానపదం, ఒక చారిత్రక సినిమా కూడా రావట్లేదు. ఎప్పుడైనా సాయిబాబా లాంటి నిర్మాతలు, బాపు లాంటి దర్శకులు, ఇళయరాజా లాంటి సంగీతకారులు ఒక ప్రయత్నం చేస్తే దాన్ని ప్రశంసించాలి గానీ ఇలా పనిగట్టుకుని చీల్చి చండాడాలా! సినిమా చూడకుండా ఏ సందర్భంలోనిది ఈ పాట అని తెలియకుండా మీరూ కన్ఫ్యూజ్ అయి ఈ పాటలకు “కన్ఫ్యూజ్ద్ మ్యూజిక్” అని పేరు పెట్టరను కుంటా! విమర్శ కూడా సద్విమర్శగా వుండాలి. రాగా.కాం లో కాకుండా పాటల సీడి తెచ్చుకొని విని సినిమా చూసి అప్పటికైనా మీ అభిప్రాయంలో తేడా రాకుంటే తప్పు ఎవరిలో వుందో తెలుస్తుంది.

  కొలవరి వెర్రిలో వున్న జనాలకు ఈ మాత్రం పాటలు వినడానికే టైం లేదు.

 18. అయ్యా సురేశ్ గారూ, మీకు నాకు ఈ సినిమా పాటలు నచ్చలేదు అనిపిస్తే అది నా సమస్య కాదు. పాటలు మీకు నచ్చాయి. మంచిది. అవతలి వాళ్ళకి నచ్చాయో లేదో, వాళ్ళ పండిత్యం…ఇవన్నీ మీకెందుకండీ? ఈ వ్యాసం మీకు చీల్చి చెండాడినట్లు అనిపించిందా? పైన కామేశ్వర రావు గారి కామెంటు, రెంటాల జయదేవ గారి బ్లాగు చూశారూ? ఏమైనా, ఈ తరహా వితండ వాదాలపై నాకు ఆసక్తి లేదు. మీకు గొడవ పెట్టుకోవాలి అని ఉంటే; చాలా బ్లాగులున్నాయి. చివరగా చెప్పొచ్చేది ఒకటే – బ్లాగు అంటే… “వెబ్-లాగు”. నా బ్లాగులో నా అభిప్రాయాలే రాస్తాను. సురేశ్ పెద్దరాజు గారివి రాయను. ఎందుకంటే, ఆయనెవరో నాకు తెలీదు గనకా, ఇది నా బ్లాగు గనకా.

 19. సౌమ్యా గారు, మీరన్నది కరక్టే నండి. మీ బ్లాగు మీ ఇష్టం. కానీ మీ లాంటి వారు వ్రాసే అభిప్రాయాలు కొంతమందిని ఇంస్పైర్ చెయ్యొచ్చు కదా! సినిమా చూడాలా వద్దా లేక పాటలు వినాలా వద్దా అని డోలాయమానంలో వున్నవారు మానుకొనే అవకాశం వుందనదే నా బాధంతా! మిమ్మల్ని కించపరచాలని ఏ కోశానా లేదు. మీ బ్లాగు నేను ఇదివరకు చాలాసార్లు చదివాను. కానీ ఎప్పుడూ కామెంట్ చేయలేదు. నా వ్యాఖ్యలు మిమ్మల్ని బాధించి వుంటే క్షమించండి.

 20. ఎవరి అభిప్రాయాలు వారు రాయటానికి కూడా హెచ్చరికలు/గమనికలు. ఏంటో !! చాలా చోట్ల ఇటువంటివి గమనించి ఈ వ్యాఖ్య రాయాలనిపించింది.

 21. సురేష్ గారికి: పాటలు వినేందుకు కూడా ఇంకోళ్ళ అభిప్రాయాల మీద ఆధారపడతారు అని నేననుకోను. వ్యాఖ్యలు బాధించడం వరకూ ఎందుకు లెండి…అంత వ్యక్తిగతంగా తీసుకోను నేను కామెంట్లను. కాకపోతే, వెంకటరమణ గారు అన్నట్లు – ఎవరి అభిప్రాయాలు వాళ్ళు రాస్కోవడానికి కూడా హెచ్చరికలు ఇచ్చుకోవాల్సి వస్తున్న పరిస్థితులు ఉన్నందుకు, అలా జవాబు ఇవ్వాల్సి వచ్చింది. అంతే.

  @వెంకటరమణ గారు: 🙂

 22. లవకుశతో పోలిక లేకుండా నేను కూడా ఈ పాటలు వినలేదు. అయినా ఈ పాటల్లో శ్రావ్యతకు లోటు లేదనే అనిపించింది. పౌరాణికం అనగానే ఒక రకమైన “డివైనిటీ” పాటల్లో ఉండాలని ఆశించడం సహజమే! ఆ మాటకొస్తే పద్యాలు లేని పౌరాణికాలు అసలు ఊహించనే లేం. ఈ సినిమాలో కూడా పద్యాలున్నాయనీ, అవిని సినిమా రిలీజ్ అయ్యాక కానీ బయటికి రావనీ ఊహించుకుని మరీ వెళ్ళానా ఈ సినిమాకి…అబ్బే, ఆ ఊసే లేదు.

  కాకపోతే సంగీతం విషయంలో ఇప్పటి శ్రోతల అభిరుచుల్ని, అభిప్రాయాల్ని బహుశా బాపు,ఇళయ రాజాలు బాగా డిస్కస్ చేసి ఈ ట్యూన్స్ ని ఎన్నిక చేసి ఉంటారని నా అభిప్రాయం. ఈ సినిమా కమర్షియల్ హిట్ కావాలంటే పెద్ద గమకాలు,రాగాలు,శాస్త్రీయ పోకడలు ఉంటే బహుశా వర్కవుట్ అవ్వదని వాళ్లకు అనిపించిందేమో! అందుకే ఏ పాటకూ అంత శ్రమ తీసుకోక, మెలొడీ బేస్ తో సాదాగా లాగించేశారు. శ్రీరామ లేరా ఓ రామా మరీ, ఫ్యూజన్ బేస్డ్ గా ఉందని అనిపిస్తుంది.

  పాటల సాహిత్యం మాత్రం నాకు భలే బాగా నచ్చేసింది. ఒక్కో చోట లవకుశ పాటలకంటే కూడా నచ్చ్హింది.

  హనుమంతుడు పాడే కలయా నిజమా వైష్ణవ మాయా పాట అద్భుతంగా ఉందని చెప్పొచ్చు! టిప్పు చాలా చక్కగా పాడాడు.

  పర భాషా గాయకుల మీద ఆధారపడటం తెలుగు ఫీల్డు కి అలవాటైన తర్వాత,వాళ్లను బలవంతంగా మనమీద రుద్దాక ఇహ వాళ్ళు తెలుగు పదాల్ని స్వచ్ఛంగా పలుకుతారని చూడ్డం అత్యాశే! కాస్తో కూస్తో తెలుగు బాగానే పలికే శ్రేయా ఘోసల్ కూడా “జగ్ దా నంద్ కార్ కా” అని పాడ్డం… విధి! :-))

  కాకపోతే ఇదే కీరవాణి అయ్యుంటే పాటలు పూర్తిగా తగలడిపోయుండేవని నా అభిప్రాయం!

 23. vbsowmya గారు: //కాకపోతే, వెంకటరమణ గారు అన్నట్లు – ఎవరి అభిప్రాయాలు వాళ్ళు రాస్కోవడానికి కూడా హెచ్చరికలు ఇచ్చుకోవాల్సి వస్తున్న పరిస్థితులు ఉన్నందుకు….” .//
  ఈ మాట నేననలేదు. హెచ్చరికలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు ఉండటం గురించి నా వ్యాఖ్య కాదు. హెచ్చరికలు /గమనికలు పెట్టటం గురించి.

 24. వెంకట రమణ గారికి:
  క్షమించాలి మీ వ్యాఖ్య ఇంకోలా అర్థం చేసుకున్నందుకు. కానీ, పరిస్థితులు అలా ఉంటేనే కదా హెచ్చరికలు ఇవ్వాల్సి వచ్చేది? లేకపోతే, ఎవరైనా వాళ్ళ బ్లాగుల్లో వాళ్ళ అభిప్రాయాలే రాస్తారు… ఇంకోళ్ళవి రాయరు – అన్న విషయం ప్రత్యేకించి గమనిక గా రాయాల్సిన అవసరం ఏముంటుంది అంటారు?

 25. vbsowmya గారు: ఇంక నేను చెప్పేది ఏమీ లేదు. 🙂

 26. సౌమ్యా గారు, నేనొక విషయం చెప్పదలుచుకోన్నాను. బహుశా మీకు నచ్చక పొతే

  మన్నించండి. మనమొక కూడలిలో నిలుచొని మన స్నేహితులతో గానీ, మనకు

  కావలిసిన వారితో గాని అభిప్రాయాలు పంచుకుంటే అవి మనకు మాత్రమే చెందినవి.

  వాటి మీద పక్కనున్న వారు వ్యాఖ్యలు చేస్తే తప్పు పట్టవచ్చు. కానీ అదే కూడలిలో

  పక్కకి కారు ఆపుకొని కారు కిటీకీ అద్దం దించి మైకులో ఒక సినిమా గురించి కానీ, పాట

  గురించి కానీ, రాజకీయ పార్టీనీ లేదా ఏదైనా జనానికి సంబంధించిన విషయం గురించి

  గాని అభిప్రాయలు చెప్పినప్పుడు అది విన్న వాళ్ళు తప్పకుండా వ్యాఖలు చేస్తారు.

  లేదు నేను నా కారులో కూర్చొని నా మైకు నుండి నా అభిప్రాయాలను తెలియచేసాను

  కాబట్టి వాటిపై వ్యాఖలు చేయడానికి వీలు లేదు అనడం సరి కాదు. బ్లాగ్స్కూకూడా నేను

  పైన చెప్పిన కూడలి లాంటివే అని అనుకుంటున్నాను. మన అభిప్రాయలు

  ప్రపంచానికంతా తెలుస్తున్నాయి. కాబట్టి వాటి మీద వ్యాఖలు రావడం సహజం.

  అందులో మన అభిప్రాయాలతో ఏకీభవించేవి వుండవచ్చు లేదా విభేదించేవీ

  వుండవచ్చు. రెండింటినీ ఒకేలా తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. నా ఈ

  అభిప్రాయంతో మీరు ఏకీభవించకపోతే తేలిగ్గా తీసుకొని వదిలేయండి.

 27. ఈ మధ్యకాలంలో నేను పదేపదే వింటున్నవి ‘శ్రీరామరాజ్యం’ పాటలే. మాధుర్యంతో వినసొంపుగా ఉన్నాయి. వీటికి పౌరాణిక స్పర్శ లేదనో, కన్ ఫ్యూజ్ డ్ మ్యూజిక్ అనో నేనుకోవడం లేదు. పైగా ఇళయరాజా చాలాకాలం తర్వాత స్వరపరిచిన enchanting music అని నా ఉద్దేశం.

  ‘జగదానంద కారకా’ కంటే కూడా ‘శ్రీరామ లేరా ఓ రామ’ పాటా, దానికంటే మించి ‘రామాయణమూ శ్రీ రామాయణమూ’ పాట… ప్రత్యేకంగా ఈ పాటల్లోని బాణీలకు దీటుగా, ఒకోసారి వాటిని మించి కూడా నేపథ్యసంగీతం అమరిందనుకుంటున్నాను. ఉపయోగించిన వాద్యాలు దేశీయమో, విదేశీయమో కానీ శ్రవణానందరకంగా ఉన్నాయి!

 28. @Venu: నేను కూడానూ. ఈమధ్య వచ్చిన వాటిల్లో అలా కొన్ని నెలలైనా మళ్ళీ మళ్ళీ వింటున్నవి ఇవొక్కటే.
  @Suresh: నా సమస్య మీరు విమర్శించినందుక్కాదు. మీరొక్కసారి ఈ బ్లాగులో వ్యాఖ్యలు చూస్కుంటే…. మీలాగ కాకుండా నిజంగా “తిట్టిన” వాళ్ళకి కూడా నేను చాలాసార్లు జవాబివ్వను 🙂 ఇక్కడ సమస్య ఏమిటి అంటే, ఒక పక్క ఆ సినిమా పాటలు నాకు నచ్చాయి అని రాస్తూ ఉంటే, మీరు నేను విమర్శిస్తున్నా అన్నారు కనుక, మీకు జవాబు ఇచ్చుకోవలసి వచ్చింది. చందమామ కథల్లో తప్ప “నచ్చింది-నచ్చలేదు” అని రెండే ఆప్షన్స్ ఉండవు అని నా అభిప్రాయం. నచ్చినా కూడా, కొన్ని నచ్చని అంశాలు ఉంటాయి. అంతే కానీ, నేనేదో రక్షకుడులో నాగార్జునలా లావా ప్రహాహం చేత ప్రేరేపితమై కాదు మీకు జవాబిచ్చినది. ఇంతకీ, మీ పోలికేమిటో నాకు అర్థం కాలేదు.

 29. మంచి సంగీతం, సాహిత్యాం వున్న శ్రీరామారాజ్యం పాటలను మనస్పూర్తిగా ఆహ్వానించి, ఆస్వాదించాలన్నదే నా ఉద్దేశ్యం. ఇంతకన్నా ఇంక నేను చెప్పేదేమీ లేదు. మీ జవాబుకి ధన్యవాదాలు సౌమ్యా గారు!

 30. సౌమ్యా గారు, మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా బ్లాగులో “ఎంతో మధురమీ స్నేహం” అనే కథను భాగాలుగా పోస్ట్ చేస్తున్నాను. మీ వీలున్నప్పుడు చదివి అభిప్రాయం తెలుపగలరు. http://nityavasantam.blogspot.com/
  ధన్యవాదాలు,
  సురేష్


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: