సింబు సూపర్ స్టారు చూడు, రాజేందరన్న సన్ను వీడు

మంచమ్మాయి లాగా, నాకు బాగా నచ్చే మరొక వ్యక్తి – ఒక కలర్ఫుల్ యంగ్ తమిళ్ హీరో. అతని మాటల్లో చెప్పాలంటే, పదేళ్ళ తరువాత సినీరంగాన్ని ఏలబోయే సూపర్ స్టార్ అతను. అతనే, సింబు అలియాస్ సిలంబరసన్. నేను ఎంతో అభిమానించే మరో అద్భుత వ్యక్తి టి.రాజేందర్ గారి కుమార’రత్నం’.

మొన్న వారాంతంలో ట్రెయినులో కూర్చుని కొన్ని తమిళ పాటలు వింటున్నా. వాటి మధ్య, “మన్మథన్” అన్న చిత్రరాజంలోని ఒక పాట వినబడ్డది. పాట ఎంత అద్భుతంగా ఉందంటే, కొన్ని ఏళ్ళ క్రితం, థియేటర్ కి వెళ్ళి మరీ “మన్మథ” సినిమా తెలుగు డబ్బింగ్ లో నారాయణగూడలో చూసినప్పుడు చూసిన ఆ పాట వీడియో కళ్ళముందు కదలాడింది. ఈ సినిమాలో ఒకట్రెండు పాటలంటే నాకు అప్పట్లో విపరీతమైన ఇష్టం ఉండేది (కాదన్నా ప్రేమే ఔనన్నా ప్రేమే, మన్మథుడా నీ కలగన్నా..ఈ రెండో పాటకి తమిళ పాట విత్ సబ్ టైటిల్స్ చూడండి ఆ యూట్యూబ్ లంకెలో! 🙂 బేసికల్లీ, పాటలు తమిళ్ లో వినేందుకే బాగుంటాయి…అంతగా అర్థం కాకున్నా, డబ్బింగ్ సాహిత్యం ఉండదుగా). ఇప్పుడింతకీ, నా చేత ఈ‌టపా రాయిస్తున్న పాట – తెలుగులో వినాలనుకునే వారు “నింగిలాంటి మనసు చూడు” అంటూ, తమిళంలో వినాలి అంటే, “వానమున్న ఉయిరె కాట్టు” అంటూ వినండి. సాహిత్యం జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మీరు తెలుగు విన్నారంటే, అసలు ఒరిజినల్ లో ఏం‌రాసారు? అన్న కుతూహలం కలగడం సహజం. ఆట్టే తేడా లేదు లెండి… ఇవిగో తమిళ లిరిక్స్.

నిజానికి, ఇక్కడ సగం గొప్పతనం లిరిక్స్ రాసిన వాళ్ళదే కానీ, సింబు బాబు కాకుండా వేరే ఎవరూ వాటికి న్యాయం చేకూర్చలేరు. మీరు భయపడతారని ఇక్కడ వీడియోలూ అవీ పెట్టట్లేదు. నాకు మాత్రం ఏడేళ్ళౌతున్నా ఇంకా కళ్ళకు కట్టినట్లు కనబడుతోందీ పాట. అలా, స్నేహితులరోజున నేను సింబాబు గురించి ఆలోచించడంలో సింబాలిజం ఏమీ లేదండోయ్!! అపార్థం చేసుకోకండి!

సింబాబు సినిమాలు చిన్నప్పట్నుంచీ చూస్తున్నా. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు, సింబాబుకి చిన్నప్పట్నుంచే అతి నటన జాస్తి. అప్పట్లో, తెలుగు డబ్బింగ్లో (ముఖ్యంగా తేజా‌టీవీలో..) మాస్టర్ చింపూ… అని వేసేవాళ్ళు. వాళ్ళ నాన్నని కదా చింపూ అనాలి! వాళ్ళ నాన్నని చూశాక సింబాబుని మాస్టర్ చింపూ అని ఎందుకు అనేవాళ్ళో‌అర్థమైంది.హీహీహీ. చిన్నప్పట్నుంచే సింబాబు స్టైలే వేరు.

పెద్దైపోయిన సింబు బాబు చేసిన మరో చిత్రరాజం కూడా ఒకసారి‌ టీవీలో చూసి తరించితిన్. దాని నామధేయం “వల్లభ”. మీరు ఆ సినిమా చూడని పక్షంలో, ఆ అద్భుతమైన క్రియేటివ్ కథకూ, దానిలో నటీనటులు – ముఖ్యంగా అబ్బాయిగారు, రీమాసేన్ ల నటన కోసం తప్పక చూడగలరు. అయితే, ఒక్కళ్ళే చూడకండి. నేను మరో నలుగురితో మొదటిసారి అర్థరాత్రి నిద్ర ఆపుకు మరీ చూసి (అంటే,ఒకళ్ళు బలవంతంగా చూపించారు లెండి!), సాడిజం కొద్దీ ఇంకొకరిని కూర్చోబెట్టి వాళ్ళకి చూపిస్తూ రెండోసారి చూశా. నిజానికి సింబాబు మంచి ఆర్టిస్టే కానీ (చూడుడు, విన్నైతాండి వరువాయా, వానం వంటి చిత్రాలు. నేను చూడలేదు..సీన్లు చూశా అంతే. కానీ, మా సింబాబు టాలెంట్ గురించి నాకెవ్వరూ చెప్పనక్కర్లేదు!), మనిషిలోని మర్కటానికి తరుచుగా పగ్గాలు అప్పజెప్పేస్తూ ఉంటాడు – సింబాబు వాళ్ళ బాబుకి మల్లే!

(వాళ్ళ స్థాయికి నేను చేరలేను కానీ, నా పరిధిలో, నా అభిమానం ఇలా చాటుకుంటున్నా!)

సింబు బాబు స్టారు చూడు, రాజేందరన్న సన్ను వీడు
రేపు కాబోయే స్టార్ వీడు రా
డవిలాగు స్టైలు చూడు, నటనలోని దమ్ము చూడు
పుట్టుకతోనే, వీడు సూపర్హీరోరా

…..
(తర్వాత కొనసాగిస్తా..)

Advertisements
Published in: on August 10, 2011 at 1:27 pm  Comments (5)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/08/10/manmatha-simbu/trackback/

RSS feed for comments on this post.

5 CommentsLeave a comment

  1. బాబోయ్ మీరేదో అద్భుతమైన ఫాంలో ఉన్నట్టున్నారు నిన్న,మొన్న,అటుమొన్నలన్నీ మంచు లక్స్మి, ఇప్పుడు సింబ్బాబు నెక్స్ట్ ఎవరో

  2. నేను సింబు సినిమా ఒకటి చూసి మొదట్లో ఎవడ్రా ఈ హీరో?? ..పొట్టిగా వుండి’ లిటిల్ సూపర్ స్టార్’ అంటాడు అనుకున్నా!కానీ నటన బానే ఉంటుంది ..మన్మధ,వల్లభ లో ..

  3. @Santosh Surampudi: గత మూడ్రోజులుగా ఒక సినిమా వల్ల ప్రభావితం అయ్యానండీ. బహుశా దాని గురించేమో నెక్స్టు.

  4. వామ్మో! ఈ మహానుభావుడి సినిమా చూసి నేను ఠపీమని పడిపోయా! ఎంత ఓవరేక్షనో! ఇక టీ.రాజేందర్ కామెడీ మాత్రం కేకోకేక! :))

  5. సింబాంబు అనాలేమో.
    Didn’t know he’s TR’s son.
    I liked his performance in vinaithaandi varuvaya – a lot better than NC in the telugu version


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: