ఓయ్ నేస్తాలూ, మీరు విన్నా వినకున్నా, ఇది మీకోసమే!

నాకు పొద్దుట్నుంచి మహా దురదగా ఉంది, పబ్లిక్ గా నా స్నేహితులందరికీ పెద్ద థాంక్స్ చెప్పుకోవాలని. నూటికి తొంభై రోజులు డిప్రెషంలోనూ, పుట్టకా, చావు మిథ్యేనా?‌ అన్న సందేహంలోనూ బ్రతుకుతూ ఉండే నాకు, సమాంతరంగా సరదాలూ, సంతోషాలతో మరో జీవితం ఇచ్చినందుకు అందరికీ థాంకులు చెప్పుకోవద్దూ? అందరికీ ఉంటార్లేవో అంటారా? ఉంటారు… కానీ, నాలాగా అవతలి మనుషులను అర్థం చేసుకుని, వారితో మంచిగా మాట్లాడ్డం కూడా చేతకాని మనుషులకి కూడా స్నేహితులు ఉన్నారు అంటే, అది ఆ స్నేహితుల గొప్పదనమే కదా మరి! అఫ్కోర్సు, వీళ్ళలో నా దినం చేసే వాళ్ళు కూడా ఉన్నారు కానీ, దినం చేసే వాళ్ళు కూడా ఒక్కోసారి నన్ను ఎంత భరిస్తారూ అంటే, నాలాంటి నాకే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయ్!

అసలుకి నాకు అర్థమే కాదు – నాకెలా ఇంత అదృష్టం పడుతూ ఉంటుంది? అని. తక్కిన విషయాల్లో ఎలా ఉన్నా, అసలుకి నేను అంత కలువుగోలుగా ఉండకపోయినా, నాతో ఇంత ఆదరంగా, మంచిగా ఎందుకుంటారు కొంతమంది? అన్నది నాకు అర్థమే కాదు. రమణ గారి తొమ్మిది మంది తల్లుల్లా, నాఈడు వారే నన్ను ఒక్కోసారి అలా ఆదరించారు. ఇందులో, ఈ నా ప్రపంచంలో, కాలక్రమంలో, ఒక్కోసారి నేస్తాల అక్కలో, చెల్లెళ్ళో, వాళ్ళ కుటుంబాలో కూడా, పర్మనెంట్ సిటిజెంషిప్ పొందేశారు. కొందరు సొంత కుటుంబీకులు కూడా స్నేహితుల లెక్కలో వస్తార్లెండి నాకు.

ఒక స్నేహితులకి ఏదో‌ సమస్య ఉంది. అది వాళ్ళు విడమరిచి చెప్తే కానీ, సాధారణంగా నాకు అర్థం కాదు. ఒకరికి కాసేపు నాతో మాట్లాడితే మనసు తేలిక పడుతుంది అనిపిస్తుంది అనుకోండి – అది వాళ్ళు చెప్తే కానీ నాకు అర్థం కాదు. అలాగని, ఒక్కోసారి వాళ్ళు చెప్పేది కూడా పూర్తిగా వినను. సగం వింటూ ఉండగా, మనసు అన్యవస్తుక్రాంతం అయిపోతూ ఉంటుంది. అంత బ్యాడ్ లిజనర్ ని నేను. కానీ, నాకేదైనా గోడు ఉంటే మాత్రం, అర్జెంటుగా చెప్పాలి అనిపించిన వాళ్ళకి చెప్పేస్తా. వాళ్ళు బాగున్నారా? అన్నది కూడా అడగను. అలాంటి అక్రూర జాతి పనికిమాలిన స్నేహితురాలిని నేను. ఇందులో దాపరికం ఏమీ లేదు. అందుకే నాకు ఆశ్చర్యం. ఇంత ఓపిగ్గా ఇన్నేళ్ళూ నన్ను వీళ్ళంతా ఎలా భరిస్తున్నారా? అని.

ఓ మూణ్ణాలుగేళ్ళ బట్టీ‌ అవతలి పార్టీ అభిప్రాయం కనుక్కోకుండా మూకుమ్మడిగా స్నేహాలు వదిలేసి, కొత్త జీవితం మొదలెట్టే ప్రయత్నాలు కొన్ని వందలు చేశా. అయినా కూడా, కొందరు ఇంకా నాతో మామూలుగానే మాట్లాడుతూ ఉంటారు, నేను మళ్ళీ పలకరిస్తే. నన్ను ఒకటీ అరా తిట్టినా, మామూలైపోతారు. ఇంత మంచోళ్ళేంటో, వీళ్ళకి నేను తగలడం ఏమిటో! ఇలా, నా ధోరణిలో నేనుండి, ఉన్నట్లుండి ఒకరోజు నా గోడు చెప్పేస్కుని, ఆ తర్వాత నెల రోజులు కనిపించక – ఇలాంటి వెధవ్వేషాలు గత కొన్ని నెలలుగా లెక్కలేనన్ని వేశాను. అయినా, ఆశ్చర్యం, నన్ను పల్లెత్తుమాటైనా అనరు ఎవ్వరూ. ఉత్తి పుణ్యానికి వేపుకు తింటున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ, వాళ్ళ శాతం – సముద్రంలో కాకిరెట్టంత. అయినా, వాళ్ళూ నా స్నేహితులే. ఒకసారి స్నేహితులంటే ఇక జీవితకాలం పాటు అంతేగా!

కాబట్టి, ఓ మై డియర్ ఫ్రెండ్సులారా! Thanks for everything you gave me!!! మీరే లేకపోతే, నేను లేను.
I will try to be a better friend in the coming years…. 🙂
నా టైం బాగుంటే, ఇది చదివి నన్ను క్షమించండి, ఎప్పట్లాగే!
మీ టైం బాగుంటే, ఇదే నా అసలు రంగు. తెలుసుకుని, నన్ను వదిలించుకోండి! 🙂

ఇలా, అత్యుత్సాహంతో, నా అదృష్టానికి బహిరంగంగా మురిసిపోయిన మొదటి/ఇప్పటిదాకా చివరి సారి, కోలుకోలేని దెబ్బతిని, దానికింద ఇంకా నలిగిచస్తున్నా. కనుక, ఇలా బహిరంగంగా నా అదృష్టం గురించి టముకు వేశాక ఏం వినాల్సి వస్తుందో అన్న చింత ఉండనే ఉంది కానీ, ఐ డోంట్ కేర్. ఆ మాత్రం ఖలేజా లేకుంటే, అదేం బ్రతుకూ!!

Advertisements
Published in: on August 7, 2011 at 11:54 pm  Comments (14)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/08/07/frendshipday/trackback/

RSS feed for comments on this post.

14 CommentsLeave a comment

 1. :)))))))))))

 2. 😀 😛
  Happy friendship day andee. 😀 (mee post ki intakannaa em cheppaalo teliyatam ledu.. 🙂 )

 3. మైత్రీదినోత్సవ శుభాకాంక్షలు.

 4. 🙂

 5. :-)))))

 6. 🙂 🙂

  టైం బాగుందండీ కాని అందులో బ్యాటరి బాగోలేదు. ఏం చేయాలో చెప్పరా ప్లీజ్.

 7. good post…n happy friendship day 2u….

 8. same pinch సౌమ్య గారూ…. నాక్కూడా ఇలాంటి అనుమానాలు వస్తాయి అప్పుడప్పుడు… అయితే అలాంటి సందేహాత్మక సమయాల్లో నా స్నేహితులు నాకు నాలుగు మొట్టికాయలేసి గడ్డి బా పెట్టారులెండి. టూ.కీ.గా చెప్పాలంటే, “కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు?” అన్నట్టన్నమాట. 😀

  So, కలిసి ఉండటాలు, దూరంగా పోవటాలు అనేవి ఎవరికి వారికి వదిలెయ్యటమే మంచిది. ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఫ్రీ గా వదిలేస్తే ఎవరికీ వారు ఎంతెంత దూరాల్లో ఉంటే comfortable గా ఫీల్ అవుతారో, అంత దూరంలో తమకు తామే settle అయిపోతారు.

  ఒక్కటి మాత్రం నిజం. నేస్తాల్లేని జీవితం లేదు. నిజ్జం!!

  Happy Friendship Day 🙂

 9. I hear you!

  I’ve been a victim of this good luck, too. Having folks who put up with me all the times, lulling me into believing that I’m possibly a fine human being and plausibly a good friend. Only when reality mocks you, you know, what a shame it is to be under such delusion.

  Anyway, you sound a mis-fit friend. I’m as hopeless as anybody could get. We should be starting a club, “Failed friends”. Then, in times to come, your b’day or my b’day could be celebrated as “Failed friendships day” 😛 What say?

 10. సౌమ్యా, నువ్వు ఇలాంటి దానివని నాకు తెలీదు సుమా :)))
  మరీ అంత తక్కువ చేసుకోకు.
  నేను ఇంతలా నన్ను (పైకి) అనుకోలేను కానీ, నా వైపు నుంచి నాకు అనిపించేది,
  నేను నా స్నేహితుల నుండి పొందిన comfort ఎక్కువ, నేను వారికి ఇచ్చిన దానికన్నా అని.
  Three cheers to friends for making life that much more secure, fun and enjoyable. We need them to share our joys as much as we depend on them in our lows.

 11. బావుందండీ..బాగా రాసారు..:)

 12. O.Kay. Happy Friendship Day. Enjoy with all your friends:)

 13. అంతా వ్రాసి మీరు లేకపోతే నేను లేను అన్నారు చూడండి.ఆ స్థితి మీ అసలు స్థితి .మీరు ఎప్పటికి మంచి స్నేహితురాలే మీ మిత్రులకు !మిమ్మల్ని నా బ్లాగు కు ఆహ్వానిస్తున్నాను.స్నేహం ఫై ,మనసు ఫై వ్రాస్తున్నాను పరిశీలించగలరు.

 14. […] ఎలాంటి మనిషినో గత ఏడాది ఇదే సందర్భంలో రాసిన పోస్టులో తెలియజేశాను. అలాటి నా చుట్టూ ఎన్ని […]


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: