మంచమ్మాయిని మించిన మేనేజరు లేరు జగములో

పొద్దున్న ఈనాడు ఈపేపర్ వర్షన్ చూస్తూ ఉంటే, ఒక ప్రకటన కనబడి, నేను సిగ్గుతో కుంచించుకుపోయేలా చేసింది. అది, మంచమ్మాయ్ చిరుతో చేసిన రెండో ఎపిసోడ్. సిగ్గెందుకూ అంటే, నా జీవితానికి సంబంధించినంతవరకూ, గురువారమే లక్ష్మీవారం కనుకా, ఆ విషయం నాకు పేపర్ చెప్పేదాకా తట్టలేదు కనుకా. ఛీ! నాలాంటి అభిమానుల వల్లే మంచమ్మాయికి చెడ్డపేరు వస్తోంది. వారం మధ్యలో చూడకూడదు అనుకున్నా కానీ, మంచమ్మాయ్ ది అయస్కాంత సన్నిధి!

౧) ఇక్కడ చిరు సీరియస్గా తన ఐడియాలజీ గురించి చెప్తూ ఉంటేనే నాకు బ్లాకై పోతూ‌ఉండింది మెదడు. ఇంతలో, “అసలు సామాజిక న్యాయం అంటే ఏంటంకుల్?” అని అమాయకంగా అడిగినప్పుడు మాత్రం అద్గదీ! అద్గదీ మంచమ్మాయ్ అంటే! అనిపించి గర్వంగా అనిపించింది.

౨) జిగేల్ జిగేల్ అని అలీ అంకుల్ వచ్చి చిరు అంకుల్తో మాట్లాడుతూ ఉంటే, మంచమ్మాయ్ మురిపెంగా చూశే దృశ్యం మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంది.

౩) మంచమ్మాయ్ మేనేజ్మెంట్ స్కిల్స్ గురించి మరీ‌మరీ చెప్పుకుంటూ‌ రోజూ పారాయణ చేయాల్సిన అవసరం ఉంది అనిపించిన దృశ్యం రాంగోపాల్ వర్మ వచ్చినప్పుడు జరిగింది. సత్యేంద్రనూ, శ్రీదేవినీ, నీషేనీ, అయన్ రాండ్ నీ తప్ప అన్యులను మెచ్చని ఆర్.జీ.వీ చిరుని తెగపొగిడాడు అంటే, అది మంచమ్మాయ్ గొప్పతనం కాదూ?

౪) గబుక్కున, గుబుక్కున వచ్చేసిన సత్యానంద్ గారు నేటి ప్రత్యేకత. “ఆ టాక్ షో కండక్ట్ చేస్తున్నావిడ ఫాదర్ కొంచెం ఫీలవుతాడేమో…”
-లాల్ సలాం సార్!!!

౫) చిరంజీవి-మోహన్ బాబు మధ్య ఎవరు టాం? ఎవరు జెర్రీ? అన్నదానికి సమాధానం, ఎన్ని బ్రేకులైనా, బుర్ర ఎన్నిసార్లు బ్రేకైనా మీకు దొరకదు. టాం అండ్ జెర్రీ పోలికే కెవ్వు. దానికి తోడు “నా చిన్నప్పటి నుంచి కూడా నేను మోహన్ బాబూ అంకుల్ ని చూస్తున్నా కాబట్టి” – చిరు సార్! మీరూ రాకింగ్. ఆ తర్వాత వచ్చిన దృశ్యంలో…”కళకళలు కిలకిలలు కొత్తగ చేరెను మా ఎదగూటికి వెలుతురులు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి…..” అన్నట్లు ఉండింది నాకు.

(కానీ, సత్యానంద్గారూ, చిరు గారూ, మీ ఇద్దరికీ ఒక సంగతి తెలుసా? బట్ ఐ హేట్ దీస్ గబుక్కు ఎంట్రీస్. ఐ ఆల్సో హేట్ పీపుల్ టీజింగ్ మంచమ్మాయ్….పొగడ్తా నాదే, కోపమూ నాదే! అన్నట్లు, ప్రకాశ్ రాజ్ కు థాంకులు.)

౬) “చాలా అల్లరిగా ఉన్నారు మీరు కూడా…” అని ముద్దుగా మంచమ్మాయ్ అడిగినప్పుడు, “వయసు, అల్లరి…” అని చిరు సిగ్గుపడ్డప్పుడు ఆ చిలిపి వైబ్రేషంస్ కి ఇవతల నా గదిలో చల్లటి గాలులు వీచాయి.

౬) అన్నింటికంటే ఈ షోలో ఒక హైలైట్ ప్రసంగం ఉంది ..హాంజీ, వో హై హెన్జీ! కోడిరామకృష్ణ గారి మాటల్లో, చేతల్లో ఒక విధమైన నాట్యం ఉంది. ఎందుకో అత్యుత్సాహంగా ఉన్నారు. చిరుని చూడగానే, ఫ్యాను పైన, టైము మనసులో, తిరిగి తిరిగి, కొన్నేళ్ళు వెనక్కి వెళ్ళారు. ఆయన ప్రసంగ పాఠం, సంక్షిప్తంగా:
“ఏంటండీ అసలు మీ సీక్రెట్ నాకేమీ అర్థమవ్వట్లేదు. ఇంట్లో రామయ్య,వీథిలో కృష్ణయ్య అప్పుడు ఎలా ఉన్నారో, ఇప్పుడు కూడా అలాగే, అంతే ఫ్రెష్ గా ఉన్నారు……..దసరా, సంక్రాంతి, దీపావళి వంటి పండుగలతో పాటు, మీరు రీఎంట్రీ కావడం కూడా ఒక పండుగలా అనుకుంటున్నారు. అది మేమందరం కూడా అప్రిషియేట్ చేస్తాం. ఎందుకంటే…మీకోసం…మనుషులు కాదు, ప్రొడ్యూసర్లు కాదు (అంటే ప్రొడ్యూసర్లు మనుషులు కాదా?) ..నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మీరు వేయాల్సినవి ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. అవి వెయిట్ చేస్తున్నాయ్..డూ ఇట్. డూ ఇట్…..”
-ఈయన నటుడిగా కెరీర్ రీ-ఎస్టాబ్లిష్ చేస్కోడానికి చాలా కృషి చేస్తున్నారల్లే ఉంది. ఇంట్లో చేస్తున్న అభ్యాసం నెమ్మదిగా ఫలితాన్ని ఇస్తోంది.

మంచమ్మాయ్ అంత గొప్ప మేనేజర్ ని నేనెక్కడా చూడలేదు. చూడలేను. చూడబోను. తనని మించిన శాల్తీ వస్తే, గిస్తే నేను గాంధారిలా కళ్ళగ్గంతలు కట్టుకుంటా.

అంత పెద్ద మేనేజరూ పసిపిల్లల్లా కేరింతలు కొడుతూ, అంకుల్ అంకుల్ అంటూ‌ ముద్దుముద్దుగా మాట్లాడుతుంది. ఇలాంటి హోస్ట్ ఇంకెక్కడ దొరుకుతారు?

ఈ సందర్భంగా, మనతెలుగుమూవీస్ సఈట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎప్పట్లాగే, మీరు మళ్ళీ నా దినం చేశారు!!

రోజురోజుకి మంచమ్మాయ్ తెలుగు బాగున్నట్లు అనిపించడం ఐదో సైకిక్ వైబ్రేషనా??

Advertisements
Published in: on August 5, 2011 at 1:31 am  Comments (17)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/08/05/manchammai-chiru-2/trackback/

RSS feed for comments on this post.

17 CommentsLeave a comment

 1. Looks like you became a dedicated fan of మంచమ్మాయ్ !? keep it up.

 2. తినతినగ వేము తియ్యనుండు…వినగవినగ గార్ధభ స్వరము గాంధర్వమయుండు….మీకు చూడగా..చూడగా మంచమ్మాయి తెలుగు ముచ్చటగొలుపుచుండు 😉

 3. వామ్మో సౌమ్యగారూ మీరు మంచమ్మాయ్‌కి ఇంత పెద్ద అభిమానయిపోయారా?

 4. Just observed Laksmi Manchu called Roja also, as aunty.


  According to Wiki Roja is an year younger than Laksme…:o

 5. మీరో అబిమాన సంఘం స్తాపింట్చబోతున్నారని అర్డ్జం అయ్యిందండ్జీ. ఎఖ్ఖడ్జ, ఎప్పుడ్జు చెబితే మేం ఖుంచెం డ్జాగ్రట్చగా వుంట్చాం. 😀

 6. @ Indian Minerva :))

 7. సౌమ్యా! ఈ సిరీస్ సూపర్!

  ******రోజురోజుకి మంచమ్మాయ్ తెలుగు బాగున్నట్లు అనిపించడం ఐదో సైకిక్ వైబ్రేషనా??

  — LOL

 8. “మళ్ళీ నా దినం చేశారు!!” OMG Sowmya garu….. 😀

 9. okka balayya babu ne ‘annayya’ ani pilustaru, mee manchu ammayi ~
  gun bullet shot ante evarikaina bayame kadaa….:)

 10. @Surya, Indu, Krishnapriya, Sujata : Thanks. 😛
  @Satya & Indian Minerva: :))
  @Ravi: ఆవిడ ఆంటీ అనదు. అండీ అని గౌరవంగా అనడమే అమెరికన్ యాసలో మీ అందరికీ అలా అనిపించి, ఆవిడని అపార్థం చేసుకుంటున్నారు. ఇక, మంచమ్మాయ్ తెలుగు పిల్లకాయలు అంకుల్ అంకుల్ అని అందర్నీ పిలవడం చూసి, తెలుగులో అదేదో గౌరవార్థకం అని భ్రమిసింది. తనకి తెలుగు రాదు కదా. తమిళ్ ఫస్ట్ లాంగ్వేజ్, నేషనల్ అవుట్లుక్ కోసం హిందీ నేర్చుకుంది. హాలీవుడ్ లో ఉంది కాబట్టి ఎలాగో ఇంగ్లీష్ వచ్చింది. తెలుగు ఎక్కడ ఉందిక్కడ??
  -మంచమ్మాయి అందరికంటే ఎక్కువగా అపార్థానికి గురైన అమ్మాయి 😦

 11. సౌమ్యా,
  మీ మంచమ్మాయి ఎపిసోడ్లు యూట్యూబు లో మా పిల్లలకి చూపించాను. వాళ్ళ “తెలుగు స్పీకింగు ఆత్మ విశ్వాసం” అమాంతంగా పెరిగిపోయింది. “వీ స్పీక్ బెటర్ దెన్ ద టివీ లక్ష్మి” అంటున్నారు.
  సుజాతా,
  మీరు నా నోట్లోని మాఠల్ని లాగేసుఖూన్నారు.
  (మంచమ్మాయిని మెచ్చుకుని, మనం ఆవిడ లాగే మాట్లాడతామేమో, ఖర్మ!)
  శారద

 12. మంచమ్మాయి ఇప్పుడు మాంచి ఎంటర్టైనర్ టీ.వీ లొ కదా. I hope she speaks good Tamil ?!

 13. Maa panchu lachhi gurinchi intamandi kaamentadam maree haascharyamu aanandamuni kaliginchu chunnnadi. Nenu kooda panchu lachhi gurinchi raasinaanu.

  http://varudhini.blogspot.com/2011/07/blog-post_31.html

  cheers
  zilebi.

 14. బాబోయ్ సౌమ్య….మీ అభిమానానికి ఎల్లలు లేవని నిరూపిస్తున్నారు

 15. ఈ షో నిన్న డైరెక్ట్ గా చూసినదానికంటే ఇప్పుడు మీ బ్లాగ్ లో చదివి ఎక్కువ ఎంజాయ్ చేశాను :-))))))))

 16. first time mee blog chadiwanu.. meeru raasina widhanam baundhi.. 🙂

 17. మీ అభిమానానికి ముచ్చటేసి… మీ కోసం సహజంగా మంచమ్మాయి http://yfrog.com/h8y45ooj


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: