ఇంద్రధనుస్సు వానవిల్లు ఎందుక్కాదు??

“అక్టోబర్ మాసాన సందెవేళ వానొస్తే వానవిల్లు గుండె తాకెనే…నాది ఏకాంతవాసమాయె దూరాన ఆమె మాత్రం వానవిల్లు లాగా వచ్చెనే”
-ఈ వాక్యం “ఇచటే, నేనిచటే, నేనెదురుచూసి నిలిచా” అన్న పాటలోనిది. ఆ పాట “రిథం” అన్న తమిళ డబ్బింగ్ చిత్రంలోనిది.
(ఆసలు ఆ పాటేమిటో వినాలనిపిస్తే, వీడియోని చూడకుండా ఇక్కడ వినండి. వీడియో చూస్తూనే వింటాం‌అంటే, మీ ఇష్టం..నేనేం‌ చేయలేను).

ఇందాకట్నుంచి ఈ పాట ఒకటే గుర్తొస్తోంది. ఎందుకంటే, నేను ఒక చిన్న వ్యాసం చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండగా, అందులో ఒకే కాంసెప్ట్ కి వివిధ భాషల్లో ఎలాంటి పదాలు ఉన్నాయి? అన్న విషయం చర్చిస్తున్నప్పుడు ఇది తట్టింది. నాకు స్వల్ప పరిచయం ఉన్న భాషల్లో, rainbow కు ఉన్న పదాలు చూడండి:

ఇంద్రధనుస్సు – తెలుగు (వానవిల్లు చూడబోతే తెలుగులో ఉన్నట్లు లేదు. ఆంధ్రభారతి నిఘంటువులో కనబడలేదు)
ఇంద్రచాప, మళబిల్లు – కన్నడ
వానవిల్ – తమిళ్
ఇంధ్రధనుష్ – హిందీ
రెయిన్ బో – ఇంగ్లీషు
రెగ్నెన్ బోనెన్ (Regnenbonen) – జర్మన్
(ఆయా భాషల్లో, ఇతర పర్యాయపదాలు ఉన్నాయేమో కానీ, నాకు తెలిసినవి రాసాను)

వాన-విల్లు అన్న పదం బదులు మనకి ఇంద్రధనుస్సు అన్న పదం ఎందుకు వచ్చింది? అన్నది ఇప్పుడు నా సందేహం అన్నమాట. వస్తే వచ్చింది, కన్నడలో లా తమిళంలో కూడా, ఇంద్రచాపం వంటి పదం ఉందా? అసలు ఎలా అన్నా, వానవిల్లు ఇంద్రధనుస్సు ఎందుకైంది?

అంటే, ఇంద్రుడు వానకి దేవుడు కాబట్టి (మరి ఒక్కోసారి వరుణుడొస్తాడుగా), వాన తరువాత కనిపించే విల్లు కనుక, అది ఇంద్రుడు పని పూర్తయింది అని దిగ్విజయంగా విల్లు పట్టుకుని నిలబడ్డట్లు అనుకోవాలా మనం?
-అని సందేహం కలిగింది.

విషయాలెరిగిన వారు సందేహ నివృత్తి చేయగలరు.

***********************
గూగుల్ అనువాదం, ఇతర గూగుల్ శోధనల సాయంతో రాస్తున్న కొనసాగింపు:

౧) బెంగాలీ సమానార్థకం కోసం చూస్తే, గూగుల్: ఇంధ్ర ధనుష్ తో పాటు, రాం ధనుష్ కూడా ఇచ్చింది. అనుమానం వచ్చి, హిందీ కోసం చూస్తే, మళ్ళి ఇంద్రధనుష్, రామధనుష్ అన్నది. ఈ రామధనుష్ ఏమిటి మధ్యన!!

౨) గుజరాతీ‌ : సప్తరంగి, మేఘధనుషరంగో (బహుశా మేఘధనుష్ కాబోలు..బాగున్నాయ్ పదాలు రెండూ!)

౩)మళయాళంలో కూడా: “మళవిల్లు” అంటారని తెలిసింది. (వానవిల్లే!!)

౪) మరాఠీ: ఇంద్రధనుష్య్

౫) కొంకణి: ధోన్ హు (Dhonhu అని రాశారు రోమన్ లిపిలో – అంటే‌ ఉత్త ధనుస్సా?)

౬) పంజాబీ: పీంఘ్ సత్రంగీ

కొన్ని ప్రపంచ భాషల్లో వానవిల్లు ని ఏమంటారో, ఆ పదానికి అర్థం ఏమిటో, రాసిన లంకె ఇదిగో.

(అలా, దొరికినప్పుడు మరికొన్ని జతచేస్తాను. సింహళ భాషకి కనిపించాయి కానీ, ఆడియో సరిగ్గా లేక, పోనీ అలాగే ఉంచేద్దాం అంటే.. టైపు చేయడం రాక…)

Update:

నేనసలు తెలుగులో హరివిల్లు అన్న పదమే మర్చిపోయా నిన్నరాత్రి. ఇవాళ గుర్తొచ్చి, అసలు హరి అన్న పదానికి అర్థాలేమిటి? అని ఆంధ్రభారతి నిఘంటువులో వెదికితే, మొదటి అర్థం – “ఒక వర్షము”. :))

నేనింకా, ఇంధ్రధనుస్సు, రామ ధనుస్సు, కామధనుస్సు లాగా హరివిల్లు అనుకుంటూ‌ వచ్చా!!! ఐతే, హరివిల్లే మన వానవిల్లనమాట. వానవిల్లే హరివిల్లన్నమాట.

హరి-విల్లు (Hari’s Will) మూలంగానే అది ఏర్పడింది కాబోలు. శివుడాజ్ఞ లేనిదే..అంటారు కదా, శివకేశవ భేదాలు పాటించకుండా, తీర్మానిస్తున్నా అనమాట 🙂

Published in: on August 3, 2011 at 2:20 am  Comments (18)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/08/03/rainbow/trackback/

RSS feed for comments on this post.

18 CommentsLeave a comment

 1. vaana villu pada prayOgam ‘nuvvu naaku naccaav’ sinmaalO oka paaTa (‘vaana villu vadhuvuga maari’)lO vinipistuMdi. bahuSaa mana sinii kavulu tamila padaM nuMci telugulOki laakkoccinadai uMDoccu! iMdra dhanassu kaMTE, vaana villu baaguMdi kadaa!
  telugulO imdra dhanassunu ‘varada guDi’ ani kUDA aMTaaru.

 2. In Kannada, the most commonly used word for rainbow is actually “kaamanabillu” (ಕಾಮನಬಿಲ್ಲು/కామనబిల్లు).

 3. “many types of rainbow are distinguished in Hawaiian” 😀

  Wow!! how many types of rainbows are there??

 4. @Giri: “వరదగుడి?” బాగుంది … కానీ, ఎందుకు? ఈ పదం వినడం ఇదే మొదటిసారి. థాంక్స్.

  @శ్రీకాంత్: Yes, Google Translate also showed that word, “kaamanabillu”. But, since I knew the other two words, I thought I’d better stick with them rather than trust google translate.

  @Indian Minerva: Exactly!! I too am curious about “types of rainbows!” In that hyperlink, several of the languages have that multiple words thing. I am finding it hard to comprehend 😛

  Here is what wiki says about types of rainbows: http://en.wikipedia.org/wiki/Rainbow#Variations

 5. వానవిల్లు – శుభ్రంగా అనవచ్చు. ఇది సమాసం కాబట్టి కనబడకపోవచ్చు. ఇలాంటిదే – “తీపివిలుకాఁడు” అని మన్మథునికి పేరు.

  ఇంద్రధనుస్సుకు ఇంద్రునికి ఏమి బాదరాయణసంబంధమో తెలీదు. వర్షాలను మాత్రం ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టి కురిపిస్తాడని కథలున్నాయి.

 6. ఇంద్రధనుస్సుకు ఉన్న సమాసం లేని అచ్చతెలుగు పదం “సింగిడి” తెలంగాణా ప్రాంతంలో ఇప్పటికీ వాడుకలో వుంది.

  • @Hari: “సింగిడి” అంటే ఇంధ్రధనుస్సు కాదుటండీ.
   “అయితే.. సింగిడి, ఇంద్రధనస్సు ఒక్కటి కావు. రెండూ వేరు వేరు మాటలు. సింగిడికి ఇంధ్రధనస్సుకు సంబంధం లేదు. ఇంద్రధనస్సు సూర్యాస్తమయం లోపు పగలు మాత్రమే కనిపిస్తుంది. సింగిడి రాత్రిళ్లు వెన్నెల రోజుల్లో కనబడుతుంది. ఇది పౌర్ణమికి రెండు రోజుల ముందు పౌర్ణమి తర్వాత రెండు రోజులు సుమారుగా ఐదారు రోజులు మాత్రమే కనిపిస్తుంటుంది. సింగిడికి వరద గూడు అనే మరో పేరు కూడా కలదు. పూర్ణ చందమామకు అతి దగ్గరగా ఓ అందమైన వలయం ఏర్పడితే వానలు ఆలస్యంగా పడతాయని, చందమామకు బాగా దూరంగా వలయం ఏర్పడితే తొందరలోనే వర్షాలు పడతాయని జనపదుల నమ్మకం. ఇది ముదురు బూడిద రంగులో ఉంటుంది. చందమామ చుట్టూ సింగిడి వేసిన తర్వాత సుమారు రెండు మూడు గంటలు ఉంటుంది.”
   – అనంతోజు దేవీ ప్రసాదరావు
   Ref: http://andhrajyothy.com/editshow.asp?qry=/2008/aug/4vividha3
   For further discussion: http://groups.google.com/group/telugupadam/browse_thread/thread/a7ac6418fade1921/eab379193cc36e4e?pli=1

 7. ఆవుల సాల (cow shed)ని పాక అంటేనే చిన్నప్పుడు నాకు అర్థం కాలేదు. ఉన్న పదాలే మార్చేస్తే అర్థమవుతాయా? ఇంద్రధనుసు అంటేనే చాలా మందికి అర్థమవుతుంది. అథమయ్యేది మార్చడం ఎందుకు?

  • ఇక్కడెవరూ మార్చడం గురించి మాట్లాడుకోవడం లేదండీ. ఉన్న పదాల గురించే చర్చించుకుంటున్నాము.

 8. గవ్ శాల అనే ప్రాకృత భాష పదమే తెలుగులో ఆవుల సాల అయ్యింది. దాన్నే మనం సాధారణ తెలుగు పదంగా వాడుతున్నాం. ఇంద్రధనుసు అనే పదాన్ని కూడా అలా వాడలేమా?

 9. Thw tamil Vanavil is from the tamil word “vaanam” meaning “sky”. The meaning changes if you import the word directly from Tamil.

 10. తెలుగువాళ్ళు తెలుగుపదాల్ని వాడడం అవమానకరంగా భావిస్తారు. కాబట్టి మొదట్లో వాడుకలో ఉన్న అచ్చతెలుగు అభివ్యక్తులన్నీ కాలక్రమంలో నిఘంటువుల్లోకి పోయి దాక్కున్నాయి. ఇపుడు ఈ సంస్కృతపదాల స్థానాన్ని ఆంగ్ల ఆదానాలు ఆక్రమించుకోవడం మొదలుపెట్టాయి. ఏం చేస్తే మనవాళ్ళ ఆత్మన్యూనతాభావం పోతుందో ?

 11. Arrestని అచ్చ తెలుగులో చెరపట్టడం అని అన్నారనుకోండి, చాలా మంది దాన్ని నెగటివ్‌గా అర్థం చేసుకుంటారు. ఇవే అచ్చ తెలుగుతో వచ్చే సాంకేతిక సమస్యలు. కారాగారాన్ని చెరసాల అంటే ఏమీ కాదు కానీ arrestని చెరపట్టడం అంటేనే అర్థం మారిపోతుంది. చిన్నప్పుడు విల్లు, విల్లంబులు అనే పదాలు నాకు తెలియవు. చిన్నప్పుడు వెదురు కర్రలని ఒంచి, జనుపతాళ్ళు కట్టి వాటిని ధనుసులు అనేవాళ్ళం. మా ఊర్లో మాకు నేర్పిన భాషే అది.

 12. నాకు తెలిసి “వరదగుడి” అంటే ఇంద్రధనుస్సు కాదు. వరదగుడి అంటే వానలొచ్చే ముందు చందమామ చుట్టూ రంగుల్లో ఏర్పడే వలయం.

 13. మెహర్ గారే కరెక్టండీ. వరదగుడి అంటే వాన పడ్డాక వచ్చే ఇంద్రధనస్సు కాదండీ వాన పడుతుందని తెలిపే సూచన అనుకుంటా.
  “ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా” అన్న పాటలో “పడమటి దిక్కున వరద గుడేసెను” అని ఆ అర్ధంతోనే వాడతాడండీ కొసరాజు గారు.

 14. వానవిల్లు సినీ కవులు చాలా చోట్ల వాడటం చూశాను. తెలుగు లో వాడుకలో లేకపోయినా తమిళ్ ‘వానవిల్’ నుంచి అరువు తెచ్చుకుని ఉండచ్చు! కానీ నాకు ‘వానవిల్లు’ అనే ప్రయోగం బహు సరళంగా, సుందరంగా అనిపిస్తుంది!!
  నువ్వు నాకు నచ్చావ్ లో ‘వానవిల్లే వధువుగ మారి ఒదిగిన వేడుకలో’ – సిరివెన్నెల సీతారామశాస్త్రి
  ఆడవారి మాటలకు అర్థాలే వేరులే లో ‘చినుకులలో వానవిల్లు నేలకిలా జారెనే’ – చంద్రబోస్
  ప్రయోగాలు మనం గమనించచ్చు.
  A little digression though…
  వాన చిత్రం లో ‘ఆకాశ గంగ’ అనే పాటలో ‘కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు విసిరావే!!’ అనే ప్రయోగం నన్ను విన్నప్పుడల్లా మురిపిస్తుంది!!

 15. ‘వరదగుడి ‘, లేక ‘సింగిడి ‘ అంటే చంద్రుడి చుట్టూ ఏర్పడే వలయమే అని నిఘంటువులు చెబుతున్నా హరివిల్లును ఆపేర్లతోటే ఊళ్లలో పిలుస్తారు.

 16. ఓహో దాన్ని వరదగుడి అంటారా… మొన్న ఇదే సందేహం వచ్చింది. ఎవర్నడగాలో నిర్ణయించుకొనేలోగా మరచిపోయాను. Thanks


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: