మంచమ్మాయ్ అండర్ప్లే అను చిత్తభ్రాంతి

ఇంకో మూడు చూశా: ఒకటేమో – అల్లు బ్రదర్స్. ఇంకోటి రాజేంద్రుడు. మూడు అలీ.

అల్లు బ్రదర్స్: ఏమిటో, నేనూహించిన భాషా ప్రావీణ్య ప్రదర్శన ఇక్కడ కూడా కనబడలేదు. పైపెచ్చు, అల్లు సోదరుల మధ్య గల పరస్పర ఆదరాభిమానాలు చూసి, మంచమ్మాయికి మల్లే నాక్కూడా ఎమోషనల్ భావాలు కలిగాయి. అసలక్కడ షో లో ముఖ్య అతిథి అల్లు అర్జునా లేక అల్లు వెంకటేషా?‌అన్నది మాత్రం చివరకు అర్థం కాని చిక్కుప్రశ్నగా మిగిలిపోయింది. “ఆవు చేలో గడ్డి మేయును” కథను మంచమ్మాయ్ ఏ విధంగా అర్థం చేసుకుందో, ఈ ఎపిసోడ్లన్నీ చూస్తూ ఉంటే బాగా అర్థమైంది. నేనెలా అర్థం చేసుకున్నానో మీకు అర్థం అవుతోందా ఇంతకీ?

రాజేంద్రుడి షో: రాజేంద్రుడు అనగానే, అవతల మంచమ్మాయిని క్షమించేద్దాం‌అని ఫిక్సయిపోయా. అయితే, ఈ‌ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ లా కూడా చాలా నిరాశ పరచింది. ఏమిటో, ఆ మనిషిని పట్టుకుని ఏమీ మాట్లాడించకుండా పంపేసినట్లు అనిపించింది. మంచమ్మాయ్ మరీ అంత అతి చేయలేదు కానీ, తను వదిలించుకోగలిగినంత వదిలించుకుంది. అన్నట్లు, ఇక్కడ కూడా రేలంగి నరసింహారావు గారు ఒక పేద్ద ఉపన్యాసం ఇచ్చి, రాజేంద్రుడా, నరసింహుడా ఇవ్వాళ్టి అతిథి? అన్న సందేహం కలిగించాడు.ఒక పది సినిమాలు చేసిన అల్లు అర్జున్ తో మాట్లాడ్డానికి ఉన్నన్ని కబుర్లు రాజేంద్రుడితో లేకపోవడం పరమ విడ్డూరం.

ఇవన్నీ ఈసారి యూట్యూబ్ లంకెల్లో చూశా. అబ్బో, ఎన్ని యాడ్లో. నిజంగా టీవీలో కూడా అంతంత సేపు యాడ్స్ వస్తే, టీవీలో చూస్తున్న అందరికీ నా ప్రగాఢ సంతాపం. ఒక పక్క యూట్యూబ్ వాడి యాడ్స్ తోనే చస్తుంటే, ఇవి ఖూఢా. యూట్యూబ్ వాడు స్కిప్ దిస్ యాడ్ నౌ అంటాడు కొన్ని సెకనుల తరువాత. ఈటీవీ వాడు కొన్ని నిముషాల తరువాత కూడా అనడు :((

ఇలా, అదేమిటి, చూసేయగలుగుతున్నాను? తెగులుకి అలవాటుపడిపొయ్యానా?? అనుకుంటూ, మంచమ్మాయ్ హెయిర్ స్టయిలూ, క్లోజప్పులో నవ్వులూ, సిగ్గులూ, బొగ్గులూ చూస్తూ కూడా మంచమ్మాయి మామూలుతో పోలిస్తే “restrained performance” ఇస్తోంది కాబోలు… బుర్ర పనిజేస్తోందేమో అనుకుంటూ ఉండగా, అలీ వచ్చిన ఎపిసోడ్ చూడ్డం మొదలుపెట్టాను.

౧) మంచమ్మాయ్ అలీని కూడా అంకుల్ అనేయడం విని, గుండాగినంత పనై…. ఎలాగో తమాయించుకున్నా. వాళ్ళ నాన్నకి ఒక ముప్ఫయ్ సంవత్సరాల బట్టీ పరిచయం ఉంటే, ఇతగాడు ఈవిడకి అంకులైపోతాడా! వామ్మో! ఈ లెక్కన, నాకు ఇరవైల నుంచి డెబ్భై ఏళ్ళ దాకా రకరకాల వయసుల్లో స్నేహితులు ఉన్నారు. ఆ లెక్కన, వీళ్ళ పిల్లల్ని నేను కలవడం సంభవిస్తే, వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళై ఉన్నా, ఆంటీ అని పిలుస్తారా నన్ను? వా!!!! 😦 అంకులా, పెంకులా…తగలడే పెట్రోలు బంకులా…వ్రాపర్లుగా చుట్టే జింకులా…వీథి చివరి పిచ్చి వెంకులా…. నాలో పుడుతున్న జంకులా….ఎంతైనా, ఇంత పెద్దపెద్ద జోకులేస్తే… అర్భకపు మానస్కులం.. అందునా, ఆ అర్భకత్వానికి అర్చకత్వం చేసేది సున్నితత్వం, దర్శకత్వం చేసేది అమాయకత్వమూనూ!! – మేమేం‌ కావాలి??

౨) “లాస్ట్ నేం మంచు అని పడిపోయింది కదా. మామూలు పనులు చేయలేము”
– అవును నిజం! మీ నిజాయితీకి నమోనమ-హహహ!

అలా మరీ ఇదివరకటన్ని కాకపోయినా, కొన్ని రసగుళికలు ఉన్నాయి లెండి ఈ ఎపిసోడ్లోనూ!

ఈ మూడూ మరీ త్వరగా ఐపోయినట్లు అనిపించాయి. వేణూ శ్రీకాంత్ గారిలా నేనూ ఫ్యాన్ అయిపోతున్నానో ఏమిటో… కర్మ కాబోయిన ఖర్మ!‌(అదృష్టం కొద్దీ ర, మ లకు ఒత్తు అక్షరాల్లేవ్!) ఉన్నది చాలనట్లు, ఈవిడ ధాటికి నా అంకోపరి ఫిట్సొచ్చి పడిపోయింది. ఎంతసేపటికి ఆన్ అవ్వదు. ఎలాగో, తిప్పలు పడి, అర్జెంటుగా ఇది పోస్టు చేసేందుకు తిప్పలు పడి….చేసేస్తున్నా!!

హమ్మయ్యా! ఇప్పుడు ప్రశాంతంగా నిష్క్రమిస్తా ఇవాళ్టికి. అంకోపరీ, అమర్ రహే! మంచమ్మాయ్, ఇంటర్వ్యూ కరే! Jai Hind!!

Advertisements
Published in: on July 31, 2011 at 2:34 am  Comments (5)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/07/31/manchammai-varusalu/trackback/

RSS feed for comments on this post.

5 CommentsLeave a comment

 1. సౌమ్య గారూ. చాలా సరదాగా వున్నాయి ఈ ఇంటర్వ్యూలు. ఇవాళ వంట చేసేటప్పుడు నేనూ చూశాను. లక్ష్మి తెలుగు నాకు ఆశ్చర్యంగా అనిపించలేదు, చాలా మంది సిటీ అమ్మాయిలు ఇలాంటి తెలుగే అమెరికన్ యాసతో మాట్లాడుతుండడం నేనూ విన్నా. మొత్తం మీద మీ కామెంటరీ చాలా నవ్వు పుట్టించింది.

 2. అఫ్సర్ గారికి: సిటీ అమ్మాయిలు అమెరికన్ యాసతో మాట్లాడ్డం> ఒకటి అరా ఉంటారేమో కానీ, అలాంటి గొప్ప యాస మా హైదరాబాదీలకు లేదండీ. తెలుగులో‌ ఇంగ్లీషు, హిందీ కలిపేసి మాట్లాడే వారు కోకొల్లలు. తెలుగు అనుకుంటూ‌ఇంగ్లీషు మాట్లాడే వారూ ఉన్నారు. కానీ, తీవ్రస్థాయిలో ఇంత మందపు యాస వాడే యూత్ ని నేను ఇప్పటిదాకా చూడలేదు… మంచమ్మాయిని తప్ప.

 3. సౌమ్య గారూ ఇంక మీరు మంచు లక్ష్మికి వీరాభిమానుల సంఘం స్టార్ట్ చేసేయచ్చు. మీకు మా సుమనాభిమానుల సంఘం తరపున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. అన్నట్టు ప్రేమతో మీ లక్స్ మీ కన్నాముందే ఈ మంచమ్మాయ్ జీ టీవీలో “లక్స్ మీ ఠాక్ షో ” చేసింది. ఆ వీడియోలు కూడా ఉంటాయి యూ ట్యూబ్ లో. పండగ చేసుకోండి 🙂

 4. సౌమ్య గారు మీరు అర్జంట్ గా ఈ క్రింది వీడియో చూసేయాలండీ.. ఆర్కే ఆడుకున్నాడు ఒక రేంజ్ లో .. అండ్ మంచమ్మాయ్ కూడా ఒళ్ళుదగ్గర పెట్టుకుని కాస్త సరైన తెలుగు మాట్లాడింది.

 5. సౌమ్య గారు,
  మీ మంచమ్మీ పోస్ట్లు తెగ ఫాలో అవుతున్నా.ముఖ్యం గా ఆవిడా మీ చేత వంట కూడా చేయించిందని విని ఎంత సంతోష పడిపోయానో.
  ఐన మీరు అమాయకులు లాగ ఉన్నారు.లేక మీ ఫ్రెండ్స్ సర్కిల్ అంతా అంతేనా ?
  ఈ కాలం లో కూడా నాకు మల్లె పాత కాలం వాళ్ళ లాగ తెలుగు లో మాట్లాడుతున్నారు.

  లక్ష్మి కన్నా గొప్ప తెలుగు మాట్లాడే హైదరాబాదీలని నేను కనీసం పది మందిని చూపిస్తా. వీళ్ళల్లో ఇద్దరు అమెరికా లో మూడు నెలలు ఉండి వచ్చారు.అమెరికన్ యాస?? ( లాగా అనిపించే యాస ) తోనే తెలుగు మాట్లాడతారు, మధ్యలో ఇంగ్లిపీస్ దట్టిస్తూ.

  ఇక అమెరికా లో ఉండే తెలుగు అబ్బాయిలు ( అమ్మాయిలు ఎవరు తగల్లేదు ఏంటో ) కొందరు మంచమ్మీ భాషలోనే మాట్లాడేవారు ఇద్దరు తెలుసు, తెలుగులో మాట్లాడటమే నామోషి అనుకునే వారు, అక్కడక్కడ ఒక తెలుగు పదం వాడి మిగితా మొత్తం ఇంగ్లిపీస్ లో మాట్లాడేవారు ఆరుగురు తెలుసు.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: