మంచమ్మాయ్ – జీవితం చదివిన తత్వవేత్త

ప్రస్తుత విషయం: ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో మంచమ్మాయ్.

ఈ దెబ్బతో, మంచమ్మాయ్ మీద నా అభిమానం ద్విగుణీకృతం కాలేదు. ఒక వెయ్యి రెట్లు అయ్యింది అని చెప్పడం కూడా చాలా తక్కువ. కానీ, ఇంకా పెద్ద సంఖ్య చెబితే, మీరే కాదు, నేను కూడా విజువలైజ్ చేసుకోలేము. కనుక, వెయ్యికి ఆపేద్దాం. అసలు, రేపు సెలవుకూడా పెడదామా? మంచమ్మాయ్ ప్రపంచంలో బ్రతుకుదామా? అని ఆలోచిస్తున్నా.

1) “హాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి దిగివచ్చిన తార….” అని పరిచయం చేస్తూ వాయిస్ ఓవర్ వచ్చినప్పుడు, మనకోసం సముద్రాలు దాటుకుని, అక్కడ మంచి కెరీర్ వదులుకుని వచ్చిందన్న విషయం… ఆకాశం నుండి భూమికి దిగుతున్న గంగా… రెండూ సమంతర తెరల్లో సాక్షాత్కరించిన దృశ్యాలు నాకు.

2) “నిన్ను హీరోయిన్ అనాలా? ప్రొడ్యూసర్ అనాలా?”
“మల్టీ టాలెంటెడ్ హ్యూమన్ బీయింగ్ అనాలి”
-ఎందుకండీ మన హీరోలూ డవిలాగులు చెబుతారు… “ఎవాడి పేరు చెబితే..” అనో… “చెయ్యి చూసావా ఎంత రప్ఫుగా ఉందో” అనో…అవి ఇన్నేళ్ళుగా అన్నిసార్లూ విన్నా రాని పంచ్ ఈ ఒక్క డవిలాగులో వచ్చింది. అదిగో, అలా, మంచమ్మాయి ఆర్కేని ఢీకొన్న విధానం నా మదిలో నిలిచిపోయింది.

3) “ఫ్రూట్ చెట్టు నుంచి దూరంగా పడదు కదా” అంటూ ఉంటే, నవీన భారతీయ తత్వవేత్త మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది.

4) ఆర్కే వ్యంగ్యాన్ని (“పూర్వ జన్మలో నువ్వు అమెరికన్ వా?” “ఏం వంట చేస్తావమ్మా?” “ఎవరన్నా నిన్ను జూస్తే నమ్ముతారా నువ్వు చెప్పేవన్నీ?” వగైరా..) వినమ్రంగా “ఇగ్నోర్” చేసినా, అమాయకంగా పట్టించుకోకపోయినా, మా మంచమ్మాయ్ తప్పిస్తే వేరెవరన్నా చేయగలరా అలా?? వ్యంగ్యాన్ని కూడా ముద్దుగా, అమాయకంగా అంకుల్ అంకుల్ అంటూనే ఎదుర్కున్న ధీరవనిత మా లక్స్మి. అదే తరుణంలో, కావల్సి వస్తే, తెలివిగా, గడుసుగా అవతలి మనుషుల నోరు కట్టేయగలను అని మోహనమురళిగారితో మాట్లాడినప్పుడు కూడా నిరూపించింది. తను నిజంగానే మల్టీ టాలెంటెడ్.

5) సెంటిమెంట్లకి క్వాంటం ఫిజిక్స్ తో లంకె పెట్టి సిన్సియర్గా దాన్ని వివరించడం మీకు సాధ్యమా? మీ అభిమాన తారలకి సాధ్యమా? మా మంచమ్మాయ్ కి సాధ్యం.

6) తెలుగు నేర్చుకోలేదు అన్న బాధ ఉంది. బాట్ దర్ ఆర్ నో రిగ్రెట్స్. …అంటే ఏంటో. మంచమ్మాయ్ మల్టీ లింగ్వల్ కానీ, రాళ్ళపళ్ళి వద్ద ట్రెయినింగ్ అవసరం అన్నది అందుకే.

7) మంచమ్మాయ్ హిందీ అభిమానం, తమిళనాడులో ఉండి కూడా హిందీలో నైపుణ్యం సంపాదించగలగడం (అని తను చెప్పింది. ఇంకా నాకు నిర్ధారణగా తెలీదు. కనీ, మంచమ్మాయ్ తప్పు చెప్పదు!) చూస్తే, హిందీ భాష ఎంత పుణ్యం చేసుకుందో కదా..అనిపించింది.

8) ఎంత ఎదిగినా మంచమ్మాయ్ తన మూలాలు మర్చిపోలేదు. ఇప్పటికీ ప్రపంచం ఉంటే నాన్న చుట్టూ, తమ్ముళ్ళ చుట్టూ లేదంటే అమెరికా చుట్టే తిరుగుతుంది. ఇంతకంటే గొప్ప నాన్నా, ఇంతకంటే మంచి అలవాట్లూ ఉన్న తమ్ముళ్ళూ…మీగ్గానీ, మీ అభిమాన తారలగ్గానీ ఉండరు. నాకు తెలుసు.

9) మంచమ్మాయ్ వ్యక్తిగత జీవితం గురించి, మంచబ్బాయ్ ..అదే అనిపట్టు గారి గురించి ఆర్కే వేసిన ప్రశ్నలు నాకు చిరాకు పుట్టించాయి. ఆర్కే ని చంపేద్దాం అన్నంత కోపం వచ్చింది. ముందు ఈ టపాకి “ఆర్కేకి సెక్యూరిటీ అవసరం – ఓ మంచభిమాని హెచ్చరిక.” అని పెడదాం అనుకున్నా టైటిల్. కానీ, మంచమ్మాయ్ లోని తత్వవేత్త బైటపడే టైటిల్ పెట్టాలని తీసేసా ఈ పేరు.

10) “గ్రాంటెడ్” అంటే “లోకువ అనా” అని ప్రశ్నించినప్పుడు మంచమ్మాయ్ అమాయకత్వానికి నా కళ్ళు చెమర్చాయి, మళ్ళీ!!

11) షో ముప్పావుగంటకంటే ఎక్కువ అయినా కూడా, తను ఎక్స్ట్రా డబ్బులు అడగదు. ఇంత ఉదారగుణం ప్రపంచం మొత్తంలో ఏ తారకన్నా ఉందా??

12) ఆర్కే ఇప్పటివరకు చూడకపోతే, ఆండీ/ప్రేమానందు/అనిపట్టు/లక్ష్మి నారాయణణ్/మంచబ్బాయ్ మనిషి కాదా?? అందుకే, ఆర్కే కి సెక్యూరిటీ అవసరం అనేది. ఇలాంటి “ఇన్సైటింగ్” ప్రకటనలు ఇస్తున్నందుకు. ఆర్కే దిష్టిబొమ్మ జర్మనీలోనైనా సరే, తగలెట్టేయాలి అనిపించింది.

13) అభిమానుల “man handling” వల్ల బాడీగార్డుని పెట్టుకోవాల్సి వచ్చింది అని వినగానే, నాకు నా మీద సిగ్గూ, మంచమ్మాయ్ మీద మరింత ప్రేమా కలిగాయి.

14) “You know… you cannot know” అన్నప్పుడు మంచమ్మాయ్ భలే ముద్దుగా అనిపించింది.

15) “I am an Indian first” అని అమెరికన్ యాసలో తను చెబుతూ ఉంటే, నేను ఎమోషన్లో కింద పడి ఏడుస్తున్నా అని నాకు తెలియడానికి రెణ్ణిమిషాలు పట్టింది.

ఆర్కే గారిని చూశాకా, మంచమ్మాయ్ తరువాత నా జీవితంలో రెండో గురువుగారు ఈయనేనా? అన్న సందేహం కలిగింది. ఇది మూడో సైకిక్ వైబ్రేషన్ ప్రారంభం అయిన క్షణం కావొచ్చు. ఏమైనా, ఆర్కే అంటే నాకు చెడ్డ కోపం వచ్చేసింది… మా “ఊసక్క” ని ఆడుకుంటున్నందుకు. అయినా, మా మంచమ్మాయ్ ఎంత “హుందా”గా జవాబులిచ్చిందో చూశారా? దటీజ్ మంచమ్మాయ్!

గాంధీగిరీ నరనరాలలో జీర్ణించుకున్న నవతరం యువతి మా మంచమ్మాయ్. మంచమ్మాయే అన్నట్లు – “నాతోటిగానీ ఫ్రెండ్షిప్ చేస్తే, విడవడం చాలా కష్టం…”… సత్యం, సత్యం… పునస్సత్యం… అందుకే అన్నది, తను జీవితం చదివిన తత్వవేత్త అని!

తదుపరి: మీ మీ సలహాల పుణ్యమా అని నా జన్మ ధన్యం చేస్కుంటున్నా. ఇంకేమన్నా ఉంటే చెప్పండి-లీవు పెట్టకపోతే, రాత్రీ, దురభిమానం కొద్దీ లీవు పెడితే రేప్పొద్దున్నా చూసి తరిస్తాను.

Advertisements
Published in: on July 31, 2011 at 9:41 pm  Comments (25)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/07/31/manchammai-rk/trackback/

RSS feed for comments on this post.

25 CommentsLeave a comment

 1. సౌమ్య..చిట్టి సౌమ్య..శ్రీలక్ష్మి స్టైల్ లో అంటున్నట్టు.. నా కళ్ళు చేమరుస్తున్నాయి అమ్మ..నీ ఈ మంచమ్మాయి పట్ల.. అభిమానం చూసి. ఇక మనం ఒక అభిమాన సంఘం పెట్టేయ్యచు..నేను ఇక్కడ LAX airport పక్కనే గుంట నక్కల మంచమ్మాయి ఎప్పుడొస్తే అప్పుడు సన్మానం చేద్దాము అని తిరుగాడుతూ వున్నా…గాని విశ్వసనీయ వర్గాల ప్రకారం మంచమ్మాయి bollywood lo ప్రవేశిస్తుంది అని భోగట్ట..అదే గనక జరిగితే మంచు వారి కీర్తి దేశం నలుమూలల వ్యాపించి మరిన్ని వికెట్ లు పడి మన గుంపు లో స౦ఖ్య పెరగచ్చు.. ఈ సరి కచితం గ మంచు పిల్ల ని కలిసి ఆవిడ భాష నైపుణ్యత రహస్యాలు తెల్సు కోవాలని వుంది. ఇక పోతే నువ్వు చూడాల్సిన మరిన్ని కళా ఖండాలు..

  ౧. ప్రభాస్..అతను వాళ్ళ నాన్న గురించి ఏదో retort ఇచిన గుర్తు.
  ౨. జీవిత, రాజశేఖర్ వీళ్ళని పిలిచి మరీ రెచ్చగోట్టింది షో లో.
  ౩. నితిన్..ఇతను మన మంచు పాపా నే ఫ్లిర్ట్ చేసాడు.
  ౪. అసలు మంచు బ్రదర్స్, ఫాదర్ అండ్ విన్నీ వచ్చిన షో చూసి తరించి నట్టు లేవు నువ్వింకా..అది అన్నిటి కన్నా పెద్ద జంబాల హార్ట్.

  చూసి తరించుడు..

 2. మి మంచమ్మాయి MP3 వింటున్నానండీ ఈ వ్యాఖ్య రాస్తున్నప్పుడు. మీ మొదటి మంచమ్మాయి పోస్టుసాక్షిగా

 3. సౌమ్య గారు, ఎలా చూస్తున్నరండి బాబు ? నాకు మొహం మొత్తేస్తోంది ఒక ఇంటర్వ్యూ సెరీస్ చూసే సరికే.ఆ అతిశయం, ఆ అమాయకత్వం ( నటన) అన్నీ.

  కాకపొతే తను జీవితం చదివిన తత్త్వవేత్తే. మీకోటి తెలుసా? తన గురించి వికీపీడియా లో చూస్తె తెలిసింది ఏంటంటే, తన + విష్ణు తల్లి చిన్నప్పుడే చనిపోతే, మోహన్ బాబు, ఆవిడ చెల్లెలినే చేసుకున్నాడు, ఆవిడా కొడుకే మనోజ్.తనకి మనోజే ఎక్కువ క్లోజ్ అని చాల సార్లు చెప్పింది ఒక ఇంటర్వ్యూలో. సొంత పిన్ని ఐన తనని తల్లిగా accept చేయటం మాటలేంటి ?

 4. mp3 aa ? indian minerva garu, daya chesi ikkada link ichi punyam kattukondi.

 5. It is not fair. you did not publish my comment

  • @Sriram: మీ వ్యాఖ్య ఇక్కడ ప్రచురించడం అనవసరం అనిపించిందండీ. మంచమ్మాయ్ గతంలో ఎవర్ని పెళ్ళిచేస్కుందీ, వాళ్ళ నాన్న ఏం‌చేసాడూ – ఇలాంటివన్నీ ఈ‌టపాకి సంబంధించినంతవరకూ అనవసరపు విషయాలు అని నా అభిప్రాయం.

 6. సౌమ్య గారూ, మంచమ్మాయి వారోత్సవాలు బాగానే జరుపుతున్నారు. తిట్టుకుంటూనే, చూడకుండా ఉండటం నాకూ సాధ్యం కావటం లేదు. :-))) మీరు మంచమ్మాయికి వీరాభిమానిగా మారిపోయిన సందర్భంలో శుభాకాంక్షలు.
  మీరు ఇచ్చిన లిస్ట్లో చాలా చూడలేదు. తొందరలో నేను కూడా ఉత్సవాలు మొదలెట్టాలి అయితే.

 7. 🙂 you love her..(???) or hate her.. but definitely cannot ignore her..అన్న దిశలో వెడుతున్నట్టుగా ఉంది మీ మచమ్మాయి ప్రయాణం.. బాగా రాసారు. తన వయసో, లేక తనకంటే చిన్నవాళ్ళో అయిన వారిని కూడా అంఖల్, ఆంటీ అని అనే వినమ్రత మరొక మంచి గుణం ఈ మంచమ్మాయికి.

 8. ఏంటో మీ అభిమానం చూస్తుంటే నాకు అన్నమయ్య సినిమాలో చివరి సీన్ గుర్తు వస్తుంది.
  నా షోలు తెలుగు వారు అభిమానించటమే కాకుండా, దాచుకోని జర్మనీ వెళ్లి కూడా చూసి తరించి, ఆపై బ్లాగులు కూడా వ్రాసి …….ఆహా చాలు నమ్మా ఈ జన్మకిది చాలు

  అని మంచు గారనుకుంటారేమో.
  సెక్యూరిటీ అన్ని వేళలా ఉండదేమో, మొన్నీధ్య హోమ్ టైన్లో ఒంటిగానే కనిపించారు.
  మీరు తను విలన్గా నటించిన సినిమా చూశారా లేదా ఇంతకీ
  మంచమ్మాయి ట్విట్టర్లో యాక్టివ్ అనుకుంటాను, ఈ పోస్టుల లింకు ఇచ్చి చూడండి, జర్మనీ వచ్చినప్పుడు మీరు కలిసి లంచ్ కో డిన్నర్ కో , లేకుంటే తన షోలో ఒక రోజు మంచమ్మాయ్ అభిమానిగా పాటిస్పేట్ చెయ్యవచ్చు.

  అన్నట్టు తెలుగు ఎలా ఉన్నా గ్రామాల్లో (నేను తిరిగిన అని చదువుకోగలరు) ఈ షోకు మంచి ఫాలోయింగ్ ఉన్నట్టుంది.

 9. నేను కూడా కరెక్ట్ గా నిన్న మీరు చదివిన షో చూశాను. ఎంతైనా మనం మనం అభిమానులం.

 10. ఈ ఇంటర్వ్యూలో స్వోత్కర్ష బాగా ఎక్కువైపోయిందండీ. అసలుకైతే ఆ స్కిన్‌షో గురించి ఆమె వెలువరించిన పరస్పర విరుధ్ధమైన అభిప్రాయాలపై ఆమెనొకాటాడుకోవచ్చు.
  @R గారు: ఆ లింకు ఇదేబ్లాగులోని ముందరి పోస్టులో వుంది. ప్రయత్నించండి.

 11. యాక్టింగ్ కి అసలు ప్రీ క్వాలిఫికేషన్ ఏమీ అక్కర్లేదు అని మనము అనుకుంటూ ఉంటాముట, అది ఖాదు అని చెప్పి కల్లు తెరిపించింది మంచమ్మాయి టోరీ ఇంటర్వ్యూ లో. ఈ ఇంటర్వ్యూ గురించి తెలియజేసి మంచి పని చేసారు.

 12. దొందూ దొందే ఈ టోరీ ఇంటర్వ్యూ లో..ఆయనేమి హోస్టండీ బాబూ,విసుగు పుట్టించాడు ఆ తడబాటుతో. మంచమ్మాయిని ప్రశ్న అడగటానికి ముందు ప్రతీ సారీ నా అభిప్రాయం కాదు ఇది అని చెప్పి అడుగుతున్నాడు అవిడ తెలుగు, స్వోత్కర్ష గురించి అడిగేటప్పుడు.

 13. endukandi snow ammayini adiposukuntaru??
  ee me nanna legend kadana??
  edo papam manalani uddariddamani U.S nunchi vachhi ikkada show petti teluguni tegulekunda chestundana mee asuya??
  JAI SNOW LAXMI…PREMATO

  • సాయి గారు: నేను ఆడిపోసుకుంటున్నానా? హవ్వ! హవ్వ! ఊరుకొండి, ఎవరన్నా వింటే నవ్వి పోతారు. నా సిన్సియార్తిటీ గుర్తించట్లేదు ఎవరూ. ఐ లైక్ హర్.

 14. MANCHOCRACY (manchu cheta manchu koraku manchu vallache nadapa bade manchu program).

 15. MANCHOCRACY ( manchu cheta manchu koraku manchu valla che nadapabadutunna manchu program)

 16. వామ్మో…మీ అభిమానం చూస్తుంటే మీరు మంచమ్మాయి మీద థీసిస్ రాసేలా ఉన్నారు! మీ అసలు థీసిస్ కంటే ఇదే ముందుగా సబ్‌మిట్ చేస్తారేమో! 🙂
  ఇంతకీ ఆర్కే తో లంకె ఎక్కడ? ఇక్కడ కొట్టుము!

 17. సరే ఇంత అభిమానం చూపిస్తున్నారు కాబట్టి…భావోద్వేగాలతో నిండిన సెంటి’మెంటల్’ డ్రామా ఇస్తున్నా..చూసి తరించండి.

 18. మంచమ్మాయ్ మంచమ్మాయేనండీ!? లేకపోతే మీచేత ఇన్ని టపాలు వ్రాయించేదా చెప్పండి, హ్యాట్సాఫ్!

 19. సౌమ్యగారూ…మీపాటికి మీరు ఎంచక్క ఎంజాయ్ చేస్తూ రోజుకోరకంగా మంచమ్మాయిని శల్యపరీక్ష చేస్తూ….ఆ పరీక్షా ఫలితాలు బ్లాగులో పెడుతున్నారు.అవి చదివి…మీలాగే నేను ఙ్గ్నానం పెంచుకుందామని మీరు చూసినవన్ని క్రమం తప్పకుండా నేనూ చూస్తుంటే…ఇంట్లో వారినుండి నాకు వార్నింగ్ వచ్చింది 😦 ఇంకోసారి మంచులక్ష్మి కంఠం ఇంట్లో వినపడితే ఊరుకునేది లేదని :(((( వా…వాఆఆఆ….ఇప్పుడెలా????

 20. మంచమ్మ ఎవరో తెలియని నాకు తెలుసుకునే అవకాశం ఇచ్చారు. మంచమ్మ అభిమాని అయిపోయాను, మోహంబాబు కూతురంటే బట్టతల టోపీతో కప్పెట్టుకుని వుంటుందేమో అనుకున్నా, అలా లేదు, చక్కగానే వుంది, ముద్దుగా మాట్లాడుతోంది. వాళ్ళాయన ఎవరో జార్జి బుష్‌లా TV స్పీచ్ ఇచ్చి తన అంతలా పొగిడేయడం, ఈవిడ ఆనంద్ కీ బాష్పాయే తుడుచుకోవడం … 😀 ఆకట్టుకుంది.
  మంచమ్మ ప్రోగ్రాం వినోదంగానే వుంది, అదేగా బుల్లి తెరకు కావాల్సింది?!

 21. avida over action pakkana pedite:

  aayana anchor enti nayano!!!
  ela matladalo kuda teleedu ayanaki!

 22. “ఊసక్క” అని తెలుగు రానివాళ్ళు తిట్టుకుంటారు కదండీ! హేవిటో!!

  • కొత్తావకాయ గారికి: “ఊసక్క” అంటే తిట్టా? చూశారా, మంచమ్మాయ్ ది మంచు లాంటీ మనసు. తిట్టినా కూడా‌ ముద్దుపేరులాగే అర్థం చేసుకుంటుంది. అందరికీ ఉండదండీ‌ అంత ఉదారత….


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: